pizza
2 Days to Go.. 5 Premieres.. 5 Global Cities - JNR Premiere Hungama!
“జయమ్ము నిశ్చయమ్మురా” పబ్లిక్ ప్రీమియర్ !
You are at idlebrain.com > News > Functions
Follow Us

20 November 2016
Hyderaba
d

Watching a film on the very first show is great excitement!

Watching a premiere show before the movie release along with the celebrities is a privilege!

What if we say, you can watch a premiere show two days prior to the release along with film stars and that too for FREE..FREE..FREE?!

Yes! Jayammu Nischayammu Raa movie team is delighted to offer you something FREE & EXCITING!

Wholesome family entertainer JNR is gearing up for a release on the 25th of this November (this Friday) and the confident movie team is organizing a special premiere two days before the release, i.e. on Nov 23rd.

Now what makes it interesting is that, JNR Special Premieres shall be simultaneously held in 5 different global cities - Hyderabad, Vijayawada, Chicago (US), London & California (US) on the same day. The movie cast, crew and other distinguished stars and guests shall be gracing these premiere shows.

JNR Special Premiere Show on Nov 23rd - Mark your calendars & be the lucky one! Jayammu Nischayammu Raa!

“జయమ్ము నిశ్చయమ్మురా” పబ్లిక్ ప్రీమియర్ !

నివాస‌రెడ్డి, పూర్ణ హీరో హీరోయిన్లుగా ఎ.వి.ఎస్‌.రాజు స‌మ‌ర్ప‌ణ‌లో శివ‌రాజ్ ఫిలింస్ బ్యాన‌ర్‌పై శివ‌రాజ్ క‌నుమూరి ద‌ర్శ‌క‌త్వంలో శివ‌రాజ్ క‌నుమూరి, స‌తీష్ క‌నుమూరి నిర్మాత‌లుగు రూపొందుతోన్న చిత్రం `జ‌య‌మ్ము నిశ్చ‌య‌మ్మురా`. ఈ సినిమా న‌వంబ‌ర్ 25న విడుద‌ల కానుంది. ఈ సంద‌ర్భంగా ఆదివారం హైద‌రాబాద్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల స‌మావేశంలో...

శ్రీనివాస‌రెడ్డి మాట్లాడుతూ - ``మా సినిమా జ‌య‌మ్ము నిశ్చ‌య‌మ్మురా ఈ న‌వంబ‌ర్ 25న విడుద‌ల‌వుతుంది. సినిమా ప్ర‌మోష‌న్ బాగా జ‌రుగుతుంది. అయితే మా దర్శ‌కుడు శివరాజ్ క‌నుమూరిగారి ప్ర‌మోష‌న్ ఆక‌లి ఇంకా తీరిన‌ట్టు లేదు. అందుకే ప్రమోష‌న్‌లో భాగంగా సినిమా ప‌బ్లిక్ ప్రివ్యూను ఈ న‌వంబ‌ర్ 23. 24 తేదీల్లో ప్ర‌ద‌ర్శించ‌బోతున్నారు. సినిమాను 300 థియేట‌ర్స్‌లో విడుద‌ల చేస్తున్నాం`` అన్నారు.

ద‌ర్శ‌కుడు శివ‌రాజ్ క‌నుమూరి మాట్లాడుతూ - ``సినిమాకు అంద‌రూ ఎంట‌ర్‌టైన్మెంట్ కోసం వ‌స్తుంటారు. అటువంటి ఎంట‌ర్‌టైన్‌మెంట్‌లో భాగంగా రూపొందిన జ‌య‌మ్ము నిశ్చ‌య‌మ్మురా ఈ న‌వంబ‌ర్ 25న విడుద‌ల కానుంది. అయితే అంత కంటే ముందుగా అంటే న‌వంబ‌ర్ 23, 24 తేదీల్లో ప్రివ్యూ వేస్తున్నాం. హైద‌రాబాద్ శాంతి థియేట‌ర్‌లో అభిమానుల కోసం ప్రివ్యూను వేస్తున్నాం. అలాగే విజ‌య‌వాడ, యు.ఎస్‌., లండ‌న్‌, స‌హా మ‌రికొన్ని ప్రాంతాల్లో ఈ ప్రివ్యూ ప్ర‌ద‌ర్శింపబ‌డుతుంది. సోష‌ల్ మీడియాలో ఈ పబ్లిక్ ప్రివ్యూకు సంబంధించిన టికెట్స్‌ను ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నాం`` అన్నారు.

ఎ.వి.ఎస్‌.రాజు మాట్లాడుతూ - ``అంద‌రూ క‌ష్ట‌ప‌డి సినిమాను అద్భుతంగా తెర‌కెక్కించారు. మా శివ‌రాజ్ సినిమాను అద్భుతంగా తెర‌కెక్కించాడు. శివ‌రాజ్ ముందు ద‌ర్శ‌కత్వం మీద ఆస‌క్తితో ఉన్నా, లండ‌న్ వెళ్లి త‌న కాళ్ల‌పై తాను నిల‌బ‌డి, ద‌ర్శ‌కుడిగానే కాకుండా నిర్మాత‌గా కూడా ఈ సినిమాను రూపొందించాడు. ఈ సినిమాను తెర‌కెక్కించే ముందు శివ‌రాజ్ నాకు ఐదు క‌థ‌ల‌ను చెప్పారు. అందులో ఈ క‌థ నాకు బాగా న‌చ్చింది. సినిమాను ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా చ‌క్క‌గా తీశాడు. సినిమాపై చాలా న‌మ్మ‌కంగా ఉన్నాం కాబ‌ట్టి సినిమా న‌వంబ‌ర్ 25న విడుద‌ల‌వుతున్న‌ప్ప‌టికీ న‌వంబ‌ర్ 23, 24 తేదీల్లో ప‌బ్లిక్ ప్రివ్యూ వేస్తున్నాం. ద‌ర్శ‌కుడు శివ‌రాజ్ క‌నుమూరి తెలుగు సినిమా ఇండ‌స్ట్రీలో పెద్ద ద‌ర్శ‌కుడవుతాడ‌ని చెబుతున్నాను`` అన్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో ర‌వివ‌ర్మ ఎన్‌.కె.ఆర్‌.ఫిలింస్ అధినేత ఎన్‌.కృష్ణారెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు.

 

 


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved