pizza
Kaadhali releasing on 16th June
`కాద‌లి`... రెస్పెక్ట్ హ‌ర్ చాయిస్‌
You are at idlebrain.com > News > Functions
Follow Us

14 June 2017
Hyderabad

పూజా కె. దోషి, హ‌రీశ్ క‌ల్యాణ్‌, సాయి రోణ‌క్‌, సుద‌ర్శ‌న్‌, మోహ‌న్ రామ‌న్‌, డా. మంజేరి ష‌ర్మిల‌, గురురాజ్ మానేప‌ల్లి త‌దిత‌రులు న‌టించిన సినిమా `కాద‌లి`. ప‌ట్టాభి.ఆర్‌.చిలుకూరి స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో నిర్మించారు. ఈ సినిమా ఈ శుక్ర‌వారం విడుద‌ల కానుంది. ఈ సంద‌ర్భంగా బుధ‌వారం హైద‌రాబాద్‌లో విలేక‌రుల స‌మావేశం జ‌రిగింది. ఈ స‌మావేశంలో

హీరో సాయి రోణ‌క్ మాట్లాడుతూ ``చాలా మంచి మెసేజ్ ఉన్న చిత్ర‌మిది. చాలా క‌ల‌ర్‌ఫుల్‌గా ఉంటుంది. ఆడియోకి మంచి స్పంద‌న వ‌చ్చింది`` అని అన్నారు.

నాయిక మాట్లాడుతూ ``ఇంత మంచి సినిమాలో భాగ‌మ‌వుతాన‌ని అనుకోలేదు. చాలా హ్యాపీగా ఉంది. సినిమా చూసిన ప్ర‌తి ఒక్క‌రికీ న‌చ్చుతుంది`` అని చెప్పారు.

ద‌ర్శ‌కుడు మాట్లాడుతూ ``ఆడియో వేదిక మీద మా లైన్ ప్రొడ్యూస‌ర్ పేరు చెప్ప‌డం మ‌ర్చిపోయాను. యువ‌కుల‌కు బాగా న‌చ్చే అంశంతో ఈ సినిమా చేశాం. ఇద్ద‌రు అబ్బాయిలు, ఓ అమ్మాయి మ‌ధ్య జ‌రిగే క‌థ ఇది. శ్రీలంక‌లో ఓ రిస్కీ ప్లేస్‌లో మా నాయిక డ్యాన్స్ చేసింది. ఈ సినిమా హీరోలు ఇద్ద‌రు ఒక‌రికి ఒక‌రు ఏమాత్రం త‌గ్గ‌కుండా ఉంటారు. ఫీమేల్ సెంట్రిక్ సినిమా అన‌గానే బ‌రువైన క‌థ అని అనుకోవ‌ద్దు. నేటి స‌మాజానికి చ‌క్క‌గా స‌రిపోయే క‌థ ఇది. కాద‌లి అనే ప‌దం ద్ర‌విడ ప‌దం అని ఓ ఇంటర్వ్యూలో వేటూరిగారు అన్నారు. అందుకోసం ఈ ప‌దాన్ని మా టైటిల్‌గా వాడాం`` అని అన్నారు.

 

 

 


Photo Gallery (photos by G Narasaiah)

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved