pizza
Maa Abbayi first look launch
`మా అబ్బాయి` ఫ‌స్ట్ లుక్ లాంచ్‌
You are at idlebrain.com > News > Functions
Follow Us

10 November 2016
Hyderaba
d

శ్రీవిష్ణు హీరోగా వెన్నెల క్రియేష‌న్స్ ప‌తాకంపై బేబీ సాక్షి స‌మ‌ర్ప‌ణ‌లో బ‌ల‌గ ప్ర‌కాష్ రావు నిర్మిస్తున్న చిత్రం `మా అబ్బాయి`. కుమార్ వ‌ట్టి ద‌ర్శ‌కుడుగా ప‌రిచ‌య‌మ‌వుతున్న ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ కార్య‌క్ర‌మం గురువారం హైద‌రాబాద్‌లో జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో ..

చిత్ర నిర్మాత బ‌ల‌గ ప్ర‌కాష్ రావు మాట్లాడుతూ -``మాది శ్రీకాకుళం జిల్లా. ప‌ది మందికి ఉపాధి క‌ల్పించాల‌న్న ల‌క్ష్యంతో వెన్నెల క్రియేష‌న్స్ సంస్థ ని ప్రారంభించి తొలిసారిగా `మా అబ్బాయి` చిత్రాన్ని నిర్మించాను. ఆల్ ఎమోష‌న్స్ ఉన్న చిత్ర‌మిది. శ్రీవిష్ణు న‌ట‌న సినిమాకు ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌. త్వ‌ర‌లో ఆడియో విడుద‌ల చేసి వ‌చ్చే నెల‌లో సినిమాను విడుదల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం`` అన్నారు.

ద‌ర్శ‌కుడు కుమార్ వ‌ట్టి మాట్లాడుతూ - ``కొత్త క‌థ‌నంతో రూపొందిన చిత్ర‌మిది. అంద‌రూ `మా అబ్బాయి` అనేలా సినిమా ఉంటుంది. నేను మార్తాండ్ వెంకటేష్ గారి వ‌ద్ద శిష్య‌రికం చేశాను. అలాగే ద‌ర్శ‌కుడు ప‌ర‌శురామ్ గారి వ‌ద్ద కూడా కొన్ని చిత్రాల‌కు ప‌ని చేసిన అనుభ‌వం ఉంది. మా టీమ్ స‌పోర్ట్ బావుంది`` అన్నారు ద‌

హీరో శ్రీవిష్ణు మాట్లాడుతూ - `` పెద్ద హీరోతో చేయాల్సిన ఈ సినిమాను మా ద‌ర్శ‌క నిర్మాత‌లు నాతో చేశారు. ఇలాంటి సినిమా చేయాలంటే గ‌ట్స్ ఉండాలి. అలాంటి గ‌ట్స్ ఉన్న నిర్మాత ప్ర‌కాష్ గారు. సినిమాటోగ్ర‌ఫీ, డైర‌క్ష‌న్ సినిమాకు ఆక‌ర్ష‌ణ‌లు`` అన్నారు.

సినిమాటోగ్ర‌ఫీః థ‌మ‌శ్యామ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ః వండాన రామ‌కృష్ణ‌, సంగీతంః సురేష్ బొబ్బిలి, ఎడిటింగ్ః మార్తాండ్.కె.వెంక‌టేష్, ఫైట్స్ రాబిన్ సుబ్బు న‌బ‌, కొర‌యోగ్రాఫ‌ర్స్ః ర‌ఘు, అజ‌య్, సాయి, స్వ‌ర్ణ‌, పాట‌లుః కందికొండ‌, క‌రుణాక‌ర్ అడిగ‌ర్ల‌, సురేష్ బ‌నిశెట్టి, నిర్మాతః బ‌ల‌గ ప్ర‌కాష్ రావు,క‌థ‌,స్ర్కీన్ ప్లే,మాట‌లు,ద‌ర్శ‌క‌త్వంః కుమార్ వ‌ట్టి.

 


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved