pizza
Nenorakam release on 17 March
మార్చి 17న `నేనో రకం` విడుద‌ల‌
You are at idlebrain.com > News > Functions
Follow Us

15 March 2017
Hyderaba
d

సాయిరాం శంక‌ర్‌, శ‌ర‌త్ కుమార్‌, రేష్మీ మీన‌న్ ప్ర‌ధాన తారాగ‌ణంగా రూపొందుతోన్న చిత్రం ``నేనోర‌కం``. సుద‌ర్శ‌న్ స‌లేంద్ర ద‌ర్శ‌క‌త్వంలో దేపా శ్రీకాంత్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా మార్చి 17న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ సంద‌ర్భంగా బుధ‌వారం హైద‌రాబాద్ ప్ర‌సాద్ ల్యాబ్స్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల స‌మావేశంలో....

హీరో సాయిరాం శంక‌ర్ మాట్లాడుతూ - ``శ‌ర‌త్‌కుమార్‌గారితో నేను క‌లిసి చేసిన సినిమా నేనోర‌కం. మార్చి 17న విడుద‌ల‌వుతుంది. క‌థ‌ను న‌మ్మి ద‌ర్శ‌కుడు సుద‌ర్శ‌న్ సులేంద్ర చెప్పగానే ఈ సినిమాలో న‌టించ‌డానికి ఒప్పుకున్న శ‌ర‌త్‌కుమార్‌గారికి థాంక్స్‌. ఇటీవ‌ల విడుద‌ల చేసిన ట్రైల‌ర్‌కు చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ద‌ర్శ‌కుడు సుద‌ర్శ‌న్ సులేంద్ర సినిమాను చాలా చ‌క్క‌గా తెరకెక్కించాడు. నా కెరీర్‌లో ఇది బెస్ట్ మూవీ అవుతుంద‌ని భావిస్తున్నాను. సినిమాను పెద్ద హిట్ చేస్తార‌ని భావిస్తున్నాను`` అన్నారు.

ద‌ర్శ‌కుడు సుద‌ర్శ‌న్ సులేంద్ర మాట్లాడుతూ - ``ద‌ర్శ‌కుడిగా నా తొలి సినిమా ఇది. కొత్త ద‌ర్శ‌కుడినైనా నేను చెప్పిన క‌థ న‌చ్చి సినిమాలో కీల‌క‌పాత్ర చేయ‌డానికి ఒప్పుకున్న శ‌ర‌త్‌కుమార్‌గారికి థాంక్స్‌. ఆయ‌న న‌టించ‌డం సినిమాకెంతో ప్ల‌స్ అయ్యింది. మంచి కంటెంట్‌, సెంటిమెంట్ ఉన్న సినిమా. తొలి సినిమా అయినా న‌టీన‌టులు, టెక్నిషియ‌న్స్ ఎంత‌గానో స‌పోర్ట్ చేశారు. నేనో ర‌కం మార్చి 17న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. మా ప్ర‌య‌త్నాన్ని ఆశీర్వ‌దించాల‌ని కోరుకుంటున్నాను`` అన్నారు.

నిర్మాత దేపా శ్రీకాంత్ మాట్లాడుతూ - ``సినిమాలో కంటెంట్‌ను న‌మ్మి కొత్త ద‌ర్శకుడైనా సినిమాను అద్భుతంగా చేసిన శ‌ర‌త్‌కుమార్‌గారికి స్పెష‌ల్ థాంక్స్‌. మ‌హిత్ నారాయ‌ణ్ మ్యూజిక్‌, రామ్ శంక‌ర్‌, రేష్మీమీన‌న్ న‌ట‌న సినిమాకు చాలా ప్ల‌స్ అవుతాయి. 17న ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాం. మా సినిమాను పెద్ద హిట్ చేయాల‌ని ప్రార్థిస్తున్నాం`` అన్నారు.

శ‌ర‌త్ కుమార్ మాట్లాడుతూ - ``నేనోర‌కం టైటిల్ చాలా బావుంది. బ‌న్ని, జీనియ‌స్ సినిమాల త‌ర్వాత తెలుగులో నేను చేస్తున్న సినిమా ఇది. మంచి సోష‌ల్ మెసేజ్ ఉన్న సినిమా. ప్రస్తుతం యూత్ ఎలా ఉంది. వారి ప్రేమ‌లు ఎలా ఉన్నాయి. త‌ల్లిదండ్రుల ప్రేమ ఏంటి అనే విష‌యాల‌ను తెలియ‌జేసే చిత్రం. త‌ప్ప‌కుండా అంద‌రికీ న‌చ్చుతుంది`` అన్నారు.


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved