pizza
Nenu Seethadevi release on 14 October
అక్టోబర్ 14న విడుదలవుతున్న `నేనూ.. సీతాదేవి`
You are at idlebrain.com > News > Functions
Follow Us

1 October 2016
Hyderaba
d

సందీప్, కోమలి, భవ్యశ్రీ హీరో హీరోయిన్లుగా సందీప్ క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందుతోన్న చిత్రం `నేనూ..సీతాదేవి`. శ్రీనివాస్ మ‌ల్లం ద‌ర్శ‌క‌త్వంలో చిటుకుల సందీప్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాను అక్టోబ‌ర్ 14న విడుద‌ల కానుంది. ఈ సంద‌ర్భంగా శ‌నివారం హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల స‌మావేశంలో....

హీరో, నిర్మాత సందీప్ మాట్లాడుతూ - `` సినిమా సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుంది. ల‌వ్‌, కామెడి, హ‌ర్ర‌ర్ ప్ర‌ధానాంశాలుగా సాగే చిత్రమిది. ఫస్టాఫ్‌లో ల‌వ్ కామెడి ఉంటే, సెకండాఫ్ లో హర్ర‌ర్ ఉంటుంది. సినిమాను చాలా క‌ష్ట‌ప‌డి నిర్మించాం. మంచి అవుట్‌పుట్ రావ‌డానికి ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాలేదు. మ్యూజిక్ డైరెక్ట‌ర్ చైత‌న్య అందించిన పాట‌ల‌కు చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ద‌ర్శ‌కుడు శ్రీనివాస్‌గారు సినిమాను చ‌క్క‌గా తెర‌కెక్కించారు. సినిమాను అక్టోబ‌ర్ 14న విడుద‌ల చేస్తున్నాం. మా ప్ర‌య‌త్నాన్ని ప్రేక్ష‌కులు ఆద‌రించాలి కోరుకుంటున్నాను`` అన్నారు.

హీరోయిన్ కోమ‌ల మాట్లాడుతూ - ``ఈ సినిమాలో హీరోయిన్‌గా చేయ‌డం ఆనందంగా ఉంది. ఇందులో టైటిల్‌రోల్‌ను పోషించాను. మంచి బ్రేక్ వస్తుంద‌ని భావిస్తున్నాను. ద‌ర్శ‌కుడు శ్రీనివాస్ గారు మంచి క‌థ‌ను అందించ‌డ‌మే కాదు, సినిమాను చ‌క్క‌గా తీర్చిదిద్దారు. చైత‌న్య సంగీతం, శివాజీ సినిమాటోగ్ర‌ఫీ సినిమాకు చాలా ప్ల‌స్ అవుతుంది. అక్టోబ‌ర్ 14న ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాం`` అన్నారు.

ర‌ణ‌ధీర్‌, వెన్నెల‌కిషోర్‌, జీవా, ధ‌న‌రాజ్, గుండు హ‌నుమంత‌రావు త‌దిత‌రులు న‌టించిన ఈ చిత్రానికి మాట‌లుః చింతా శ్రీనివాస్‌, కొరియోగ్ర‌ఫీః చిన్నా, ఎడ‌టిర్ః శ్రీ, సినిమాటోగ్ర‌ఫీః శివాజి.కె, ఆర్ట్ః యాద‌గిరి, నేప‌థ్య సంగీతంః సునీల్ క‌శ్య‌ప్‌, నిర్మాత: చిటుకుల సందీప్‌, ద‌ర్శ‌క‌త్వం: శ్రీనివాస్ మ‌ల్లం.


Photo Gallery (photos by G Narasaiah)
 
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved