pizza
Padipoya Nee Mayalo teaser launch
`ప‌డిపోయా నీ మాయ‌లో` ఫ‌స్ట్‌లుక్‌, టీజ‌ర్ లాంచ్‌
You are at idlebrain.com > News > Functions
Follow Us

29 October 2017
Hyderabad

శ్రీరాజన్న మూవిస్. మహెష్ ఎంటర్ ట్రెన్ మెంట్స్ ప‌తాకాల‌పై రూపొందుతోన్న ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్ `నీ ప‌డిపోయా నీ మాయ‌లో`. అరుణ్ గుప్తా, సావేరి, జ‌య‌వ‌ర్ధ‌న్ తారాగ‌ణంగా న‌టించారు. ఆర్‌.కె.కాంప‌ల్లి ద‌ర్శ‌కుడు. మ‌హేష్ పైడ‌, భ‌ర‌త్ అంక‌తి నిర్మాత‌లు. ఈ సినిమా ప‌స్ట్ లుక్‌, టీజ‌ర్ లాంచ్ కార్య‌క్ర‌మం ఆదివారం హైద‌రాబాద్ ప్ర‌సాద్ ల్యాబ్స్‌లో జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా...

హ‌రిబాబు మ‌ల్లూరి మాట్లాడుతూ - ``సినిమాకు ప‌నిచేసిన టీం అంద‌రూ యంగ్‌స్ట‌ర్స్ కావ‌డంతో సినిమాను స‌రికొత్త‌గా తీసి ఉంటార‌ని అర్థ‌మ‌వుతుంది. ఈ సినిమాలో ప‌నిచేసిన అంద‌రికీ అభినంద‌న‌లు`` అన్నారు.

హీరో అరుణ్ గుప్తా మాట్లాడుతూ - ``పూర్తి స్థాయి కామెడీతో సాగే చిత్ర‌మిది. అంద‌రినీ ఎంట‌ర్‌టైన్ చేస్తుంది. ద‌ర్శ‌కుడు ఆర్‌.కె. గారిని మేమంతా జూనియ‌ర్ పూరి అని పిలుస్తుంటాం. ఆయ‌న సినిమాను చాలా చ‌క్క‌గా తెర‌కెక్కించారు`` అన్నారు.

నిర్మాత‌లు మ‌హేష్ పైడ‌, భ‌ర‌త్ అంక‌తి మాట్లాడుతూ - ``ద‌ర్శ‌కుడు ఆర్.కె.గారు చెప్పిన క‌థ బాగా న‌చ్చింది. ఆయ‌న చెప్పిన తీరు బాగా న‌చ్చ‌డంతో సినిమా చేయ‌డానికి ముందుకు వ‌చ్చాం. ఆర్‌.కెగారి టాలెంట్‌ను నేను గ‌మ‌నించాం. సినిమా పూర్త‌య్యింది. రెండు గంట‌ల ఆరు నిమిషాల సినిమా ఇది. వ‌రంగ‌ల్‌, ఖ‌మ్మం, విశాఖ‌ప‌ట్నం త‌దిత‌ర ప్రాంతాల్లో సినిమాను చిత్రీక‌రించాం. అరుణ్‌, సావేరి చ‌క్క‌గా న‌టించారు. ఫ‌ణి, రాధాకృష్ణ‌, మ‌ల్లిఖార్జున స‌హా అంద‌రూ బాగా స‌పోర్ట్ చేయ‌డంతో సినిమాను చ‌క్క‌గా పూర్తి చేశాం`` అన్నారు.

ద‌ర్శ‌కుడు అర్‌.కె.కాంప‌ల్లి మాట్లాడుతూ - ``ముందుగా ఈ సినిమాకు మేం అనుకున్న టైటిల్ వేరు. కానీ క‌థానుగుణంగా ఈ టైటిల్ అయితే యాప్ట్ అవుతుంద‌ని భావించి ప‌డిపోయా నీ మాయ‌లో అనే టైటిల్‌ను నిర్ణ‌యించాం. నిర్మాత భ‌ర‌త్‌గారు నాకు ప‌దేళ్లుగా ప‌రిచ‌యం. నేను చెప్పిన సింగిల్ లైన్ న‌చ్చిన ఆయ‌న సినిమా చేయ‌మ‌ని అన్నారు. త‌ర్వాత మ‌హేష్‌గారు మాతో జ‌త క‌లిశారు. అరుణ్‌, సావేరి చ‌క్క‌గా న‌టించారు. ఇక విక్ర‌మ్ త‌లశిల‌గారు నాకు ఎంత‌గానో స‌పోర్ట్ చేశారు. నాకు పూరిగారంటే పిచ్చి. ఆయ‌న్ను దృష్టిలో ఉంచుకునే ఈ సినిమాను డిజైన్ చేసుకున్నాను. ఆయ‌న‌లా సినిమా తీయాల‌నేది నా క‌ల‌. ఇదే బ్యాన‌ర్‌లో నా రెండో సినిమా కూడా చేస్తాను. సినిమా బాగా వ‌చ్చిందని చూసిన వారంద‌రూ అంటున్నారు. త్వ‌ర‌లోనే సినిమా మీ ముందుకు తీసుకొస్తాం`` అన్నారు.

సంగీత దర్శకుడు జయవర్దన్ మాట్లాడుతూ - ``న‌న్ను న‌మ్మి నాకు మ్యూజిక్ చేసే అవ‌కాశం ఇచ్చిన ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు థాంక్స్‌. మ్యూజిక్‌కు మంచి స్కోప్ ఉన్న సినిమా ఇది. త‌ప్ప‌కుండా ఎంట‌ర్‌టైనింగ్ పంథాలో ఉంటుంది`` అన్నారు.

ఫణిదర్, రాధకృష్ణ,భరత్ అంకతి,మల్లికార్జున్,రాధరపుప్రభాకర్,పుర్ణచందర్, మల్లేషం, శివ, ఆశ్విని,నేహ,మహేష్ పైడ,వేణు నాగుల,చంద్రశేఖర్,రమేష్ అరె తదితరులు న‌టించిన ఈ చిత్రానికి సంగీతంః జ‌య‌వ‌ర్ధ‌న్‌, పాటలరచయితలుః నరేష్ చైతన్య,వీరు, గాయకులుః గీతమాదురి, మాలవిక,హైమద్,జయవర్దన్, డి.ఓ.పి...విక్రమ్ తలశిల‌, ఫెట్స్ః రాజు మద్దురి, ఎడిటర్ః గోపి సిందం, నిర్మాతలు...మహెష్ పైడ,భరత్ అంకతి, కథ,మాటలు,స్రీన్ ప్లె,దర్శకత్వం.....ఆర్ కె కాంపల్లి.


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved