pizza
Pelliki Mundu Prema Katha teaser launch
`పెళ్ళికి ముందు ప్రేమ‌క‌థ‌` టీజ‌ర్ విడుద‌ల‌
You are at idlebrain.com > News > Functions
Follow Us

30 January 2017
Hyderaba
d

ప్రేమ్‌కుమార్ పాట్ర‌, మాస్ట‌ర్ అవినాష్ స‌లండ్ స‌మ‌ర్ప‌ణ‌లో గ‌ణ‌ప‌తి ఎంటర్‌టైన్మెంట్స్‌, ప‌ట్నం ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్స్‌పై చేత‌న్ శీను, సునైన హీరో హీరోయిన్లుగా మ‌ధు గోపు ద‌ర్శ‌క‌త్వంలో డి.ఎస్‌.కె, అవినాష్ స‌లండ్ర‌, సుధాక‌ర్ ప‌ట్నం నిర్మాత‌లుగా రూపొందుతోన్న యూత్‌ఫుల్ ఎంట‌ర్‌టైన‌ర్ `పెళ్ళికి ముందు ప్రేమ‌క‌థ‌`. ఈ సినిమా టీజ‌ర్, ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్ విడుదల కార్య‌క్ర‌మం సోమ‌వారం హైద‌రాబాద్‌లో జ‌రిగింది. ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌ను కె.య‌స్‌.రామారావు విడుద‌ల చేశారు. టీజ‌ర్‌ను ద‌ర్శ‌కుడు అశోక్ విడుద‌ల చేశారు. అనంత‌రం ....

కె.య‌స్‌.రామారావు మాట్లాడుతూ - ``ద‌ర్శ‌కుడు మ‌ధు చాలా మంచి టైటిల్‌ను పెట్టాడు. ఈ టైటిల్ యూత్ అందరికీ క‌నెక్ట్ అవుతుంది. ప్ర‌తి ఒకరికీ పెళ్ళికి ముందు ఒక ప్రేమ‌క‌థ ఉంటుంది. మ‌రి ఈ సినిమాలో ద‌ర్శ‌కుడు ఎలాంటి ప్రేమ‌క‌థ‌ను చూపించ‌నున్నారో చూడాలి. సినిమా పెద్ద స‌క్సెస్ అయ్యి చేత‌న్‌, సునైన స‌హా న‌టీన‌టుల‌కు మంచి పేరుని, ద‌ర్శ‌క నిర్మాత‌లకు మంచి లాభాల‌ను తెచ్చి పెట్టే చిత్రం అవుతుంద‌ని భావిస్తున్నాను`` అన్నారు.

మ‌ల్కాపురం శివ‌కుమార్ మాట్లాడుతూ - ``అందరికీ మంచి పేరు, లాభాల‌ను తెచ్చే సినిమా నిల‌వాల‌ని కోరుకుంటున్నాను`` అన్నారు.

అశోక్ మాట్లాడుతూ - ``మంచి టీం కుదిరింది. సినిమా మంచి సక్సెస్ సాధించాల‌ని కోరుకుంటున్నాను`` అన్నారు.

ద‌ర్శ‌కుడు మ‌ధు గోపు మాట్లాడుతూ - ``ద‌ర్శ‌కుడుగా నా తొలి చిత్రం త్వ‌ర‌లోనే ఆడియో విడుద‌ల చేస్తాం. టైటిల్‌కు త‌గ్గ క‌థ‌. మా ప్ర‌య‌త్నాన్ని ఆశీర్వ‌దిస్తారని భావిస్తున్నాను`` అన్నారు.

నిర్మాత ప‌ట్నం సుధాక‌ర్ మాట్లాడుతూ - ``మా ద‌ర్శ‌కుడు మ‌ధు గోపు సినిమాను చ‌క్క‌గా తెర‌కెక్కించారు. చేత‌న్‌, సునైన బాగా న‌టించారు. ప్రేమ‌కు ముందు మా సినిమాలో చూపించే ప్రేమ‌క‌థ ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. సినిమా బాగా వ‌చ్చింది`` అన్నారు.


Photo Gallery (photos by G Narasaiah)

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved