pizza
Rangam 2 release on 25 November
న‌వంబ‌ర్ 25న విడుదల‌వుతున్న `రంగం-2`
You are at idlebrain.com > News > Functions
Follow Us

21 November 2016
Hyderaba
d

జ‌స్‌రాజ్ ప్రొడ‌క్ష‌న్ స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ ల‌క్ష్మి జ్యోతి క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై జీవా, తుల‌సి నాయర్ జంట‌గా రూపొందిన చిత్రం `రంగం-2`. ర‌వి.కె.చంద్ర‌న్ ద‌ర్శ‌త‌క్వంలో ఎ.ఎన్‌.బాలాజీ నిర్మాత‌గా ఈ సినిమా న‌వంబ‌ర్ 25న విడుద‌ల‌వుతుంది. ఈ సంద‌ర్భంగా సోమ‌వారం హైద‌రాబాద్‌లో ఈ సినిమా పాట‌లు, థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌ను ప్ర‌ద‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా....

భీమ‌నేని శ్రీనివాస‌రావు మాట్లాడుతూ - ``రంగం సినిమా త‌మిళంలో ఎంత పెద్ద హిట్ అయ్యిందో మ‌న‌కు తెలిసిందే. రంగం-2 సినిమా తమిళంలో పెద్ద స‌క్సెస్ సాధించింది. ఇప్పుడు తెలుగులో న‌వంబ‌ర్ 25న విడుద‌ల‌వుతుంది. ఈ సినిమా ద్వారా ఎ.ఎన్‌.బాలాజీ నిర్మాత‌గా ప‌రిచ‌యం అవుతున్నారు. తెలుగులో కూడా సినిమా పెద్ద స‌క్సెస్ సాధించి బాలాజీ మంచి నిర్మాతగా పేరు తెచ్చుకోవాల‌ని కోరుకుంటున్నాను`` అన్నారు.

సుమ‌ద్ర మాట్లాడుతూ - ``సూప‌ర్‌గుడ్ ఫిలింస్‌ డిస్ట్రిబ్యూష‌న్‌లో ఉన్న బాలాజీ నిర్మాత‌గా చేస్తున్న తొలి ప్ర‌య‌త్న‌మిది. రంగం 2 పెద్ద విజ‌యాన్ని సాధించాల‌ని కోరుకుంటున్నాను`` అన్నారు.

కె.వి.వి.స‌త్య‌నారాయ‌ణ మాట్లాడుతూ - ``రంగం అప్ప‌ట్లో తెలుగు స్ట్ర‌యిట్ సినిమాలా సెన్సేష‌నల్ హిట్ అయ్యింది. రంగం-2 సినిమాను భారీ బ‌డ్జెట్‌తో నిర్మించారు. త‌మిళంలో విడుద‌లైన ఈ సినిమా మంచి హిట్ అయ్యింది. తెలుగులో బిజినెస్ పూర్త‌య్యింది. తెలుగులో సినిమా పెద్ద హిట్ అయ్యి నిర్మాత బాలాజీకి మంచి పేరు తెచ్చి పెట్టాల‌ని కోరుకుంటున్నాను`` అన్నారు.

హీరో విజ‌య్ దేవ‌ర కొండ మాట్లాడుతూ - ``నేను సినిమా ఇండ‌స్ట్రీలో రాక ముందు రంగం పెద్ద సెన్సేష‌న్ క్రియేట్ చేసింది. ఎందుకో ఏమో..పాట పెద్ద హిట్ అయ్యింది. ఇప్పుడు రంగం 2 త‌మిళంలోలాగానే తెలుగులో పెద్ద హిట్ కావాలి`` అన్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో భ‌ర‌త్ చౌద‌రి, వీర్రాజు త‌దిత‌రులు పాల్గొన్నారు.

జీవా, తుల‌సినాయ‌ర్‌, నాజ‌ర్‌, జ‌య‌ప్ర‌కాష్ త‌దిత‌రులు న‌టించిన ఈ చిత్రానికి స‌మ‌ర్ప‌ణః జ‌స్‌రాజ్ ప్రొడ‌క్ష‌న్స్‌, మ్యూజిక్ః హారీష్ జైరాజ్‌, ఎడిటింగ్ః శ్రీక‌ర్ ప్ర‌సాద్‌, నిర్మాతః ఎ.ఎన్‌.బాలాజీ, క‌థ‌, స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వంః ర‌వి.కె.చంద్ర‌న్‌.


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved