pizza
Vellipomake Press Meet
`వెళ్ళిపోమాకే` ప్రెస్‌మీట్‌
You are at idlebrain.com > News > Functions
Follow Us

1 October 2016
Hyderaba
d

శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై ప్ర‌ముఖ నిర్మాత దిల్‌రాజు విడుద‌ల చేస్తున్న చిత్రం `వెళ్ళిపోమాకే`. యాకూబ్ అలీ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ చిత్రంలో విశ్వ‌క్ సేన్ హీరోగా న‌టించాడు. ఈ సినిమాకు సంబంధించిన పాత్రికేయుల స‌మావేశం శ‌నివారం హైద‌రాబాద్‌లో జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా...

నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ -`` గ‌త సంవ‌త్స‌రం విడుద‌లైన బాహుబ‌లి చిత్రం తెలుగు సినిమా ఖ్యాతి ప్ర‌పంచానికి చాటింది. అలాగే ఈ ఏడాది చిన్న సినిమాగా విడుద‌లైన పెళ్ళిచూపులు సెన్సేష‌న‌ల్ స‌క్సెస్ సాధించింది. ఈ రెండు సినిమాలు తెలుగు సినిమా గ‌మ‌నం మారుతుంద‌ని చెప్ప‌డానికి నిద‌ర్శ‌నాలుగా నిలిచాయి. ఇలాంటి చిత్రాలు వ‌చ్చిన‌ప్పుడే నిర్మాత‌లైన మేం కూడా ట్రెండ్‌కు అనుగుణంగా ముందుకు వెళ్ల‌డానికి ప్ర‌య‌త్నాలు చేస్తాం. రీసెంట్‌గా హీరో నాని ఇలా నా జ‌త‌గా అనే సినిమా ట్రైల‌ర్ బావుంద‌ని సోఫ‌ల్ మీడియాలో షేర్ చేశాడు. దాన్ని చూసిన నా టీం నాకు విష‌యాన్ని తెలియ‌జేస్తే, నేను కూడా ఆ ట్రైల‌ర్‌ను చూశాను. నాకు సినిమా మేకింగ్ చాలా బాగా న‌చ్చింది. మంచి ఫీల్ గుడ్ ల‌వ్ స్టోరీని ద‌ర్శ‌కుడు యాకూబ్ అలీ చ‌క్క‌గా ఎగ్జిక్యూట్ చేశాడు. సినిమా న‌చ్చ‌డంతో ఇలాంటి సినిమాను ప్రేక్ష‌కుల్లోకి మ‌రింత‌గా తీసుకెళ్ళాల‌నే ఉద్దేశంతో ఈ సినిమాను నేను విడుద‌ల చేస్తున్నాను. కొత్త టీం క‌లిసి, కొత్త‌గా చేసిన ప్ర‌య‌త్నం. ఇది స‌క్సెస్ అయితే తెలుగు సినిమా డైమ‌న్ష‌న్ మారుతుంది. ద‌ర్శ‌కుడు అలీ సినిమా తీసిన విధానం, న‌టీన‌టుల నుండి పెర్‌ఫార్మెన్స్‌ను రాబ‌ట్టుకున్న తీరు, మంచి మ్యూజిక్‌తో పాటు ఆర్టిస్టుల పెర్‌ఫార్మ‌న్స్ బాగా న‌చ్చింది. మంచి అనుభ‌వ‌మున్న న‌టుల్లా న‌టించారు. హీరో విశ్వ‌క్ సేన్ అనుప‌మ్ ఖేర్ ఫిలిం ఇన్‌స్టిట్యూట్లో ట్ర‌యినింత్ తీసుకున్నాడు. డైరెక్ట‌ర్ యాకూబ్ అలీ రామానాయుడు స్టూడియోలో ద‌ర్శ‌క‌త్వ శాఖ‌లో శిక్ష‌ణ తీసుకున్నాడు. అలాగే మ్యూజిక్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ విహారి ఎ.ఆర్‌.రెహ‌మాన్ మ్యూజిక్ స్కూల్‌లో ట్ర‌యినింగ్ తీసుకున్నాడు. ఇలాంటి మంచి కాన్సెప్ట్‌తో వ‌స్తున్న యంగ్ టీంను ఎంక‌రేజ్ చేస్తే మ‌రిన్ని మంచి సినిమాలు వ‌స్తాయ‌ని నేను సినిమాను విడుద‌ల చేయ‌డానికి ముందుకు వ‌చ్చాను. ఈ సినిమాకు వెళ్ళిపోమాకే అనే టైటిల్‌ను పెట్టాం. ఒక అబ్బాయి, ఇద్ద‌ర‌మ్మాయిల మ‌ధ్య జ‌రిగే క్యూట్‌, ఫీల్ గుడ్ ల‌వ్ స్టోరీ`` అన్నారు.

ద‌ర్శ‌కుడు యాకూబ్ అలీ మాట్లాడుతూ - ``ఈ సినిమాను రెండున్న‌ర సంవ‌త్స‌రాల క్రిత‌మే స్టార్ట్ చేశాం. నాకున్న బ‌డ్జెట్ ప‌రిమితుల్లో, వ‌న‌రుల‌తో చేసిన సినిమా ఇది. ఇలాంటి సినిమా న‌చ్చి దిల్‌రాజుగారు సినిమాను విడుద‌ల చేద్దామ‌నే ఉద్దేశంతో ముందుకు రావ‌డం చాలా ఆనందంగా ఉంది. అందుకు దిల్‌రాజుగారికి థాంక్స్‌. అంద‌రూ స‌పోర్ట్ మాకు ఉంటుంద‌ని భావిస్తున్నాం`` అన్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో మ్యూజిక్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ విహారి, హీరో విశ్వ‌క్ సేన్ త‌దిత‌రులు పాల్గొన్నారు.


Photo Gallery (photos by G Narasaiah)
 
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved