pizza
Raviteja, Sreenu Vytla, Mythri Movie Makers Production No 6 – Amar Akbar Anthony Launch
రవితేజ - శ్రీనువైట్ల - మైత్రీ మూవీ మేకర్స్ కాంబినేషన్లో "అమర్ అక్బర్ ఆంటోనీ" ప్రారంభం
You are at idlebrain.com > News > Functions
 
Follow Us

8 March 2018
Hyderabad

Crazy combination of Mass Maharaja Raviteja and the loyal brand for entertainment director Sreenu Vytla combination is back. After beginning their careers with critically acclaimed Nee Kosam followed by super hits Venky, Dubai Seenu; once again Vytla-Ravi are back into show business with Mythri Movies Production No 6 officially launched today with the muhurtham shot.

“I am very excited to work with my hero Raviteja. Seed for this film Amar Akbar Anthony was sown one year back. A simple one minute idea was expanded into a full-fledged script with ten months of hard work by my team members. This is one of the back bending and exhaustive script I ever worked on. Raviteja and my producers felt that the script has come out extra ordinary.

Entire 100% shoot is planned in the United States and just a meagre 10 days of production will be shot in India. Locations like New York, Detroit, Salt Lake City and many more are to be covered in the forth coming schedules. None of the Indian movies are shot so extensively in US which promises to be a treat for movie lovers. Thanks to my producers and their wide network in USA made these schedules possible in reality.

After succeeding as a hero with many hit films to credit, Sunil is joining our team as a full length comedy artist in this flick while yesteryear heroine Laya, her daughter Shloka are also a part of this film. One more highlight of Amar Akbar Anthony will be Raviteja’s son Mahadhan in a superb role,” said director Sreenu Vytla.

“Amar Akbar Anthony is a special project on our banner Mythri Movies, striving to provide high quality entertainment for our audience. Raviteja and Vytla is one of the craziest combinations in Tollywood. This film had all ingredients to take both their stardom to next level.

We thank Vytla’s daughters Anandi Vytla and Aadhya Vytla present today on the occasion to kick start the muhurtham. While Srinu Vytla’s elder daughter Anandi Vytla sounded the clap board, his second daughter Aadhya Vytla switched on the camera as first shot is directed by Srinu Vytla himself after receiving the bound script from hero Raviteja. Most talented and gorgeous looking Anu Emmanuel will be romancing Ravi in this film populated with a big casting team,” informed producers Naveen Yerneni, Y. Ravi Shankar and Mohan Cherukuri.

Cast:
Raviteja
Anu Emmanuel
Sunil
Laya
Shloka (Laya’s Daughter)
Mahadhan (Raviteja Son)
Abhimanyu Singh
Tarun Arora
Vikram Jeet Singh
Rajveer Singh
Shiyaji Shinde
Aditya Menon
Vennela Kishore
Sathya
Jayaprakash Reddy
Shakalaka Shankar
Shubhalekha Sudhakar
Divya Unni
Sejoy Varghese
Mathew Varghese
Bharat Reddy
Giridhar

Crew:
Story: Sreenu Vytla & Vamsi Rajesh Kondaveeti
Screenplay, Dialogues and Direction: Sreenu Vytla
Producers: Naveen Yerneni, Y. Ravi Shankar and Mohan (CVM)
CEO: Chiranjeevi (Cherry)
DoP: Vijay C Dileep
Music: SS Thaman
Editor: MR Varma
Art Director: AS Prakash
Lyrics: Ramajogayya Shastri
Rachana Sahakaram: Praveen Varma, Kollipara Praveen
Chief Co-Director: Ch Rama Rao
Co-Director: Subhash Jetti
Production Executives: K Kalyan and Balaji
Stills: Sairam Maganti
PRO: Vamsi Shekhar
Makeup Chief: I Srinivas Raju

రవితేజ - శ్రీనువైట్ల - మైత్రీ మూవీ మేకర్స్ కాంబినేషన్లో "అమర్ అక్బర్ ఆంటోనీ" ప్రారంభం

మాస్ మహారాజా రవితేజ, ఎంటర్ టైన్మెంట్ కి కేరాఫ్ అడ్రస్ లాంటి శ్రీనువైట్లల క్రేజీ కాంబినేషన్ లో "దుబాయ్ శీను" తర్వాత మళ్లీ కలిసి చేయబోతున్న చిత్రం "అమర్ అక్బర్ ఆంటోనీ". రవితేజ సరసన అను ఎమ్మాన్యుల్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో ప్రొడక్షన్ నెం.6గా రూపొందుతుండగా.. ఈ చిత్ర ప్రారంభోత్సవం నేడు (మార్చి 8) హైదరాబాద్ లో ఘనంగా జరిగింది.

దేవుని పటాలపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు శ్రీనువైట్ల పెద్ద కుమార్తె ఆనంది వైట్ల క్లాప్ కొట్టగా.. రెండవ కుమార్తె ఆద్య వైట్ల కెమెరా స్విచ్చాన్ చేసింది. శ్రీనువైట్ల గౌరవ దర్శకత్వం వహించారు. చిత్ర కథానాయకుడు రవితేజ బౌండెడ్ స్క్రిప్ట్ ను దర్శకుడు శ్రీనువైట్లకు అందించారు.

ఈ సందర్భంగా దర్శకుడు శ్రీనువైట్ల మాట్లాడుతూ.. "నా హీరో రవితేజతో మళ్లీ ఇన్నాళ్ల తర్వాత కలిసి చేయబోతున్న చిత్రం. "అమర్ అక్బర్ ఆంటోనీ" కథకి బీజం ఏడాది క్రితం పడింది. పది నెలలపాటు కష్టపడి స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ చేసాం. రవితేజతో పాటు మా నిర్మాతలకు కూడా కథ బాగా నచ్చింది. షూటింగ్ మొత్తం యునైటెడ్ స్టేట్స్ లొనే చేస్తాం. న్యూయార్క్, డెట్రాయిట్, సాల్ట్ లేక్ సిటీ మరియు ఇతర లొకేషన్స్ లో చిత్రీకరణ జరపనున్నాం. అత్యధిక శాతం అమెరికాలో చిత్రీకరణ జరుపుకోనున్న మొట్టమొదటి చిత్రమిది. కష్టతరమైన ఈ భారీ షెడ్యూల్స్ ను చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసిన మా నిర్మాతలకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. స్టార్ కమెడియన్ కమ్ హీరో సునీల్ ఈ చిత్రంలో ఫుల్ లెంగ్త్ కామిక్ రోల్ ప్లే చేయనున్నారు. నిన్నటితరం కథానాయకి లయ మరియు ఆమె కుమార్తె శ్లోక కూడా ఈ చిత్రంలో కీలకపాత్ర పోషించనుండడం విశేషం. ఈ చిత్రంలో రవితేజ తనయుడు మహాధన్ మరో ముఖ్యపాత్ర పోషించనుండడం "అమర్ అక్బర్ ఆంటోనీ"కి ప్రధాన ఆకర్షణగా నిలవనుంది" అన్నారు.

చిత్ర నిర్మాతలు నవీన్ యెర్నేని - వై.రవిశంకర్ - మోహన్ చెరుకూరి మాట్లాడుతూ... "మా మైత్రీ మూవీ మేకర్స్ సంస్థకి "అమర్ అక్బట్ ఆంటోనీ" చాలా స్పెషల్ ప్రాజెక్ట్. టాలీవుడ్ లో ఒన్నాఫ్ ది క్రేజీయస్ట్ కాంబినేషన్ అయిన "రవితేజ-శ్రీనువైట్ల"లు ఈ చిత్రంతో మళ్లీ కలిసి వర్క్ చేయనుండడం విశేషం. రవితేజ సరసన గ్లామరస్ హీరోయిన్ అను ఎమ్మాన్యుల్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం రెగ్యులర్ షూట్ త్వరలో ప్రారంభం అవుతుంది. ఎస్.ఎస్.థమన్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నాడు" అన్నారు.

రవితేజ, అను ఎమ్మాన్యుల్, సునీల్, లయ, శ్లోక (లయ కుమార్తె), మహాధన్ (రవితేజ కుమారుడు), అభిమన్యు సింగ్, తరుణ్ అరోరా, విక్రమ్ జీత్ సింగ్, రాజ్ వీర్ సింగ్, షాయాజీ షిండే, ఆదిత్య మీనన్, వెన్నెల కిషోర్, సత్య, జయప్రకాష్ రెడ్డి, షకలక శంకర్, శుభలేఖ సుధాకర్, దివ్య ఉన్ని, సిజొయ్ వర్గీసి, భరత్ రెడ్డి, గిరిధర్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి మేకప్ చీఫ్: ఐ.శ్రీనివాస్ రాజు, పి.ఆర్.ఓ: వంశీ-శేఖర్, స్టిల్స్: సాయిరాం మాగంటి, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్: కె.కళ్యాణ్-బాలాజీ, కో-డైరెక్టర్: సుభాష్ జెట్టి, చీఫ్ కో-డైరెక్టర్: సీహెచ్ రామారావు, రచన సహకారం: ప్రవీణ్ వర్మ-కొల్లిపార ప్రవీణ్, లిరిక్స్: రామజోగయ్య శాస్త్రి, కళ: ఏ.ఎస్.ప్రకాష్, ఎడిటర్: ఎం. ఆర్.వర్మ, సంగీతం: ఎస్.ఎస్.థమన్, సినిమాటోగ్రాఫర్: విజయ్ సి.దిలీప్, కథ: శ్రీనువైట్ల-వంశీ రాజేష్ కొండవీటి, సి.ఈ.ఓ: చిరంజీవి (చెర్రీ), నిర్మాతలు: నవీన్ యెర్నేని-వై.రవిశంకర్-మోహన్ (సివిఎం), స్క్రీన్ ప్లే - మాటలు - దర్శకత్వం: శ్రీనువైట్ల.


 
Photo Gallery (photos by G Narasaiah)
   
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved