pizza
Dwaraka success meet
`ద్వార‌క‌` స‌క్సెస్‌మీట్‌
You are at idlebrain.com > News > Functions
Follow Us

5 March 2017
Hyderaba
d

సూప‌ర్‌గుడ్ ఫిలింస్ ప‌తాకంపై ఆర్‌.బి.చౌద‌రి స‌మ‌ర్ప‌ణ‌లో రూపొందుతున్న చిత్రం `ద్వార‌క‌`. లెజెండ్ సినిమాస్ ప‌తాకంపై రూపొందుతోంది.

విజయ్‌ దేవరకొండ, పూజ జవేరి జంటగా నటించిన ఈ చిత్రంలో ప్రకాష్‌రాజ్‌, మురళీ శర్మ, పృథ్వీ, రఘుబాబు, ప్రభాకర్‌, కృష్ణభగవాన్‌, షకలక శంకర్‌, ఉత్తేజ్‌, నవీన్‌, గిరిధర్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ధారులు. ఈ సినిమాకు ప్ర‌ద్యుమ్న‌, గ‌ణేష్ నిర్మాత‌లు. శ్రీనివాస్ ర‌వీంద్ర ద‌ర్శ‌కుడు. ఈ సినిమా స‌క్సెస్‌మీట్ హైద‌రాబాద్‌లో ఆదివారం జ‌రిగింది.

పృథ్వి మాట్లాడుతూ ``ఈ సినిమాకు ఫోటోగ్రఫీ పెద్ద హైలైట్‌. నా పాత్ర చాలా హైలైట్ అవుతుంది. డ‌బ్బింగ్ కూడా చాలా సెటిల్డ్ గా చెప్పాను. నేను న‌టుడిగా ఎద‌గ‌డానికి స్ఫూఫ్ చాలా ప‌నికొచ్చింది. కానీ కృష్ణ‌గాడివీర‌ప్రేమ‌గాథ సినిమాతో చాలా మంచి పాత్ర‌లు వ‌స్తున్నాయి. 90-80 శాతం డైలాగులు కూడా ఈ సినిమాకు హైలైట్ అయ్యాయి. సాయికార్తిక్ సంగీతం హైలైట్‌గా ఉంది`` అని అన్నారు.

ల‌క్ష్మీ భూపాల్ మాట్లాడుతూ ``సీన్లు చాలా కొత్త‌గా అనిపించాయి. ఈ నిర్మాత మా క‌థ‌ను న‌మ్మి సినిమాను ఓకే చేశారు. అది చాలా ఆనందంగా ఉంది`` అని తెలిపారు.

Pooja Jhaveri Glam gallery from the event

నిర్మాత‌లు మాట్లాడుతూ ``ఈ నెల 8,9,10న విజ‌యయాత్ర చేస్తాం. ఆర్బీ చౌద‌రి గైడెన్స్ నాకు చాలా బాగా ఉప‌యోగ‌ప‌డింది. 100 శాతం ఈ టీమ్ తో నేను ఇంకో సినిమా చేస్తాను. టీమ్ నాకు చాలా స‌పోర్ట్ చేసింది. నా 20 ఏళ్ల డ్రీమ్ ఈ సినిమా`` అని తెలిపారు.

సాయికార్తిక్ మాట్లాడుతూ ``చాలా మంచి సంగీతం కుదిరింది. అన్ని వ‌ర్గాల‌వారికీ సినిమా న‌చ్చినందుకు ఆనందంగా ఉంది`` అని చెప్పారు.

ద‌ర్శ‌కుడు మాట్లాడుతూ ``తొలిరోజు మా సినిమా రెస్పాన్స్ చూసి చాలా ఆనందంగా అనిపించింది. ఫ్యామిలీస్ ఎక్కువ‌గా చూస్తున్నారు`` అని అన్నారు.

విజయ్‌దేవ‌ర‌కొండ మాట్లాడుతూ ``ఈ సినిమా హిట్ అయినందుకు చాలా ఆనందంగా ఉంది. సినిమా విడుద‌లైన‌ప్ప‌టి నుంచి చాలా మంది ఫోన్లు చేశారు`` అని తెలిపారు.

హీరోయిన్ మాట్లాడుతూ ``నా గ‌త సినిమాల‌తో పోలిస్తే ఈ చిత్రంలో చాలా అందంగా ఉన్నాన‌ని చాలా మంది చెబుతున్నారు. సినిమా హిట్ అయినందుకు ఆనందంగా ఉంది`` అని చెప్పారు.


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved