pizza
Jaya Janaki Nayaka success meet
'జయ జానకి నాయక' వంటి ఒక మంచి చిత్రాన్ని నిర్మించినందుకు గ‌ర్వంగా వుంది - నిర్మాత మిర్యాల రవీందర్‌రెడ్డి
You are at idlebrain.com > News > Functions
Follow Us

23 August 2017
Hyderaba
d

'అల్లుడు శీను' ఫేమ్‌ బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ హీరోగా గ్లామర్‌ స్టార్‌ రకుల్‌ ప్రీత్‌సింగ్‌ హీరోయిన్‌గా ద్వారకా క్రియేషన్స్‌ పతాకంపై మాస్‌ డైరెక్టర్‌ బోయపాటి శ్రీను దర్శకత్వంలో యువ నిర్మాత మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మించిన లవ్‌, ఫ్యామిలీ, యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రం 'జయ జానకి నాయక'. ఈ చిత్రం ఇటీవల రిలీజై యునానిమస్‌ హిట్‌ టాక్‌తో అన్ని సెంటర్స్‌లో విజయదుంధుభి మ్రోగిస్తోంది. ఆల్‌ కమర్షియల్‌ ఎలిమెంట్స్‌తో ఈ చిత్రాన్ని అత్యద్భుతంగా రూపొందించి ఇది బోయపాటి మార్క్‌ సినిమా అని మరొక్కసారి జయ జానకి నాయకతో ప్రూవ్‌ చేసుకున్నారు. సరికొత్త పాయింట్‌తో అన్ని ఎమోషన్స్‌ని, సెంటిమెంట్‌ని పండించి ఈ చిత్రం ద్వారా మంచి మెస్సేజ్‌ని అందించారు దర్శకుడు బోయపాటి శ్రీను. పెర్‌ఫార్మెన్స్‌, డ్యాన్స్‌, యాక్షన్‌ సీన్స్‌లలో తనదైన నటనను ప్రదర్శించి ప్రేక్షకుల మన్ననలను పొందుతున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ ఈ చిత్రం ఘన విజయంతో స్టార్‌ హీరోగా ఎదిగారు. ఈ చిత్రం యునానిమస్‌ హిట్‌ అయిన నేపథ్యంలో చిత్ర యూనిట్‌ సక్సెస్‌మీట్‌ని ఏర్పాటు చేసింది. ఆగస్ట్‌ 23న హైదరాబాద్‌ ప్రసాద్‌ ల్యాబ్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌, హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌సింగ్‌, దర్శకుడు బోయపాటి శ్రీను, నిర్మాత మిర్యాల రవీందర్‌ రెడ్డి, నటులు నందు, ప్రభు, శివన్నారాయణ, శ్రావణ్‌, నటి రూప, కళా దర్శకుడు సాగి సురేష్‌, డిస్ట్రిబ్యూటర్‌ హరి తదితరులు పాల్గొన్నారు.

హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ మాట్లాడుతూ - ''ఈ సినిమాని ఇంత పెద్ద సక్సెస్‌ చేసిన ప్రేక్షకులకు మనస్ఫూర్తిగా నా థాంక్స్‌. నా లైఫ్‌ ఛేంజింగ్‌ ఫిల్మ్‌ ఇచ్చిన బోయపాటి శ్రీనుగారికి నా కృతజ్ఞతలు. నన్ను చాలా సపోర్ట్‌ చేసి నాకు ఎంతో కాన్ఫిడెన్స్‌ ఇచ్చారు. సినిమా మొదలు పెట్టినప్పుడు ఇది ప్రతి గుండెను తాకే సినిమా అవుతుందని చాలా కాన్ఫిడెన్స్‌తో సినిమా తీశాం. ఇప్పుడు అలాగే ప్రేక్షకులు ప్రతి ఒక్కరూ గుండెల్లో ఈ సినిమా పెట్టుకుని చూస్తున్నారు. మా టీమ్‌ని, కథని నమ్మి మిర్యాల రవీందర్‌ రెడ్డి ఈ చిత్రాన్ని చాలా భారీగా నిర్మించారు. కాంపిటీషన్‌ వున్నా కూడా ఎక్కడా తగ్గకుండా అనుకున్న రిలీజ్‌ డేట్‌కి ఈ సినిమా రిలీజ్‌ చేసి మాకు పెద్ద హిట్‌ ఇచ్చారు. ఆయనకి నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ ఫిలిం నాకు ఒక మర్చిపోలేని జర్నీ. మా చిత్రాన్ని ఆదరించి ఇంకా పెద్ద హిట్‌ చెయ్యాలని కోరుకుంటున్నాను'' అన్నారు.

హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌సింగ్‌ మాట్లాడుతూ - ''ఒక మంచి సినిమాని సపోర్ట్‌ చేసి ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికీ నా థాంక్స్‌. ఈ చిత్రంలో ఒక స్ట్రాంగ్‌ మెస్సేజ్‌ వుంది. ఎమోషన్స్‌, సెంటిమెంట్‌, డ్రామా సీన్స్‌ని బాగా క్యారీ చేశారు. ఇన్ని సినిమాలు చేసినా గానీ, జానకి క్యారెక్టర్‌కి వచ్చినంత రెస్పాన్స్‌ ఏ చిత్రానికీ రాలేదు. నేను చాలా ఎంజాయ్‌ చేస్తూ చేసిన సినిమా ఇది. బోయపాటిగారితో మరిన్ని చిత్రాల్లో నటించాలని వుంది'' అన్నారు.

Glam gallery from the event

నిర్మాత మిర్యాల రవీందర్‌ రెడ్డి మాట్లాడుతూ - ''మా చిత్రం మూడోవారంలో కూడా హౌస్‌ఫుల్‌ కలెక్షన్స్‌తో రన్‌ అవుతూ వుంది. అన్ని వర్గాల తరగతుల వారికి నచ్చే సినిమా. ఫ్యూచర్‌లో తీస్తానో లేదో చెప్పలేను. కానీ ఇంత గొప్ప సినిమాని నిర్మించినందుకు చాలా గర్వంగా, ప్రౌడ్‌గా ఫీలవుతున్నాను. మంచి మెస్సేజ్‌ వున్న ఈ చిత్రాన్ని ప్రతి ఒక్కరూ ఎంజాయ్‌ చేస్తున్నారు. నేను ఏ నమ్మకంతో అయితే ఈ చిత్రాన్ని తీసానో.. నా నమ్మకాన్ని ప్రేక్షకులు నిజం చేశారు. ఈ సినిమా హిట్‌తో మా బేనర్‌ వేల్యూ మరింత పెరిగింది. ఇంత మంచి హిట్‌ చిత్రాన్ని తీసిన మా దర్శకులు బోయపాటి శ్రీనుగారికి నా థాంక్స్‌'' అన్నారు.

మాస్‌ డైరెక్టర్‌ బోయపాటి శ్రీను మాట్లాడుతూ - ''ఈ సినిమాని ఎంతగానో నమ్మి చేశాను. నేను ఏది చేసినా అలాగే చేస్తాను. ఎన్ని జనరేషన్స్‌ మారినా హ్యూమన్‌ రిలేషన్స్‌ మారవు. ఆ పాయింట్‌ ఎన్ని రకాల సినిమాలు అయినా తీయొచ్చు. అవి ఎప్పటికైనా సక్సెస్‌ అవుతాయి. దీనికి బెస్ట్‌ ఎగ్జాంపుల్‌ 'జయ జానకి నాయక' చిత్రం. ఇలాంటి చిత్రాలు ప్రతి ఒక్క కుటుంబానికి రీచ్‌ అవుతాయి. ఈ చిత్రంలో నటించిన ప్రతి ఒక్కరూ ప్రాణం పెట్టి చేశారు. ఇవాళ ఒక మంచి ప్రొడ్యూసర్‌ ఇండస్ట్రీకి అవసరం. అలా వచ్చిన వారిలో మిర్యాల రవీందర్‌ రెడ్టి ది బెస్ట్‌ ప్రొడ్యూసర్‌ అని నా అభిప్రాయం. సినిమా అంటే ప్యాషన్‌. సినిమా కోసం ఏదైనా చెయ్యగల సమర్థుడు మిర్యాల రవీందర్‌ రెడ్డి. అతని బేనర్‌లో మళ్ళీ మళ్ళీ సినిమాలు చేస్తాను. ఈ సినిమా రెండోవారంలో కూడా హౌస్‌పుల్‌ కలెక్షన్స్‌తో రన్‌ అవుతుంది. ఇప్పుడు మూడోవారంలోకి ఎంటర్‌ అయ్యింది. అన్ని సెంటర్స్‌లో థియేటర్స్‌ అన్ని ఫుల్స్‌ అవుతున్నాయి. ఈ చిత్రాన్ని ఇంత పెద్ద హిట్‌ చేసిన తెలుగు ప్రేక్షకులు అందరికీ నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు'' అన్నారు.


Photo Gallery (photos by G Narasaiah)

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved