pizza
Sudheer Babu - Indraganti film launched
పూజా కార్య‌క్ర‌మాలు జరుపుకున్న సుధీర్‌బాబు - ఇంద్ర‌గంటి - శ్రీదేవి మూవీస్ చిత్రం
You are at idlebrain.com > News > Functions
Follow Us

23 November 2017
Hyderabad

 

మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి ద‌ర్శ‌క‌త్వంలో నాని హీరోగా శ్రీదేవి మూవీస్ ప‌తాకంపై శివ‌లెంక కృష్ణ‌ప్ర‌సాద్ నిర్మించిన `జెంటిల్‌మేన్‌` ఎంత పెద్ద విజ‌యాన్ని సొంతం చేసుకుందో తెలిసిందే. ఇప్పుడు ఆ ద‌ర్శ‌క నిర్మాత‌లు మ‌రోసారి క‌లిసి సినిమా చేస్తున్నారు. సుధీర్‌బాబు హీరోగా న‌టిస్తున్న ఈ తాజా చిత్రం పూజా కార్య‌క్ర‌మాలు హైద‌రాబాద్‌లో గురువారం ఉద‌యం జ‌రిగాయి. మ‌ణిర‌త్నం `చెలియా` సినిమాలో నాయిక‌గా న‌టించి అందరినీ ఆక‌ట్టుకున్న బాలీవుడ్ భామ అదితీరావు హైదరీ ఈ సినిమాలో నాయిక‌గా న‌టిస్తున్నారు. శ్రీదేవి మూవీస్ ప్రొడ‌క్ష‌న్ నెంబ‌ర్ 10గా ఈ సినిమాను నిర్మిస్తోంది.

నిర్మాత శివ‌లెంక కృష్ణ ప్ర‌సాద్ మాట్లాడుతూ ``గురువారం పూజా కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించాం. ఇంద్ర‌గంటి మోహ‌న్‌కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో మా సంస్థ‌లో మేం నిర్మించిన `జెంటిల్‌మేన్‌` ఎంత‌టి విజ‌యాన్ని సాధించిందో అంద‌రికీ గుర్తుండే ఉంటుంది. ఈ తాజా సినిమా స్క్రిప్ట్ కూడా చాలా బాగా వ‌చ్చింది. సుధీర్‌బాబుగారికి ప‌ర్ఫెక్ట్ సినిమా అవుతుంది. డిసెంబ‌ర్ 11 నుంచి నిర‌వ‌ధికంగా షూటింగ్ చేస్తాం. మార్చితో చిత్రీక‌ర‌ణ పూర్త‌వుతుంది. మేలో సినిమా విడుద‌ల చేస్తాం. హైద‌రాబాద్‌, హిమాచ‌ల్‌ప్ర‌సాద్‌, ముంబైలోని స‌రికొత్త లొకేష‌న్ల‌లో తెర‌కెక్కిస్తాం`` అని చెప్పారు.

దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి మాట్లాడుతూ ``అనూహ్యమైన కథాంశంతో ఆద్యంతం వినోదాత్మకంగా నడిచే ఒక కొత్త తరం ప్రేమకథా చిత్రమిది`` అన్నారు.సుధీర్‌బాబు, అదితిరావు హైద‌రి, న‌రేశ్‌, త‌నికెళ్ల భ‌ర‌ణి, రోహిణి, నందు, కేదార్ శంక‌ర్‌, కాదంబ‌రి కిర‌ణ్‌, హ‌రితేజ‌, రాహుల్ రామ‌కృష్ణ‌, శిశిర్‌శ‌ర్మ త‌దిత‌రులు ఇత‌ర పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఈ సినిమాకు మేక‌ప్‌: పి.బాబు, కాస్ట్యూమ్ డిజైన‌ర్‌: ఎన్‌. మ‌నోజ్ కుమార్‌, ప్రొడ‌క్ష‌న్ ఎగ్జిక్యూటివ్స్: పి. ర‌షీద్ అహ్మ‌ద్ ఖాన్‌, కె. రామాంజ‌నేయులు, ప్రొడ‌క్ష‌న్ కంట్రోల‌ర్‌: చ‌ంద్ర‌మోహ‌న్‌, కో డైర‌క్ట‌ర్‌: కోట సురేశ్ కుమార్‌, ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌: య‌స్ . ర‌వీంద‌ర్‌, ఎడిట‌ర్‌: మార్తాండ్‌.కె.వెంక‌టేశ్‌; డైర‌క్ట‌ర్ ఆఫ్ పొటోగ్ర‌ఫీ: పి.జి.విందా, సంగీతం: వివేక్ సాగ‌ర్‌, నిర్మాత‌: శివ‌లెంక కృష్ణ‌ప్ర‌సాద్‌, ర‌చ‌న‌- ద‌ర్శ‌క‌త్వం: మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి.



Photo Gallery (photos by G Narasaiah)
 
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved