pizza
Ekkadiki Pothavu Chinnavada thanks meet
`ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా` థాంక్స్ మీట్‌
You are at idlebrain.com > News > Functions
Follow Us

23 November 2016
Hyderaba
d

నిఖిల్‌, హెబ్బాప‌టేల్‌, నందిత‌శ్వేత‌, అవికాగోర్ హీరో హీరోయిన్లుగా మేఘ‌న ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై వి.ఐ.ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం `ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా`. ఈ సినిమా న‌వంబ‌ర్ 18న విడుద‌లైంది. ఈ సంద‌ర్భంగా బుధ‌వారం హైద‌రాబాద్ ప్ర‌సాద్‌ల్యాబ్స్‌లో థాంక్స్‌మీట్ జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో....

నిఖిల్ మాట్లాడుతూ - ``ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా సినిమా స‌మ‌యంలో 500, 1000 క్యాన్సిల్ చేయ‌డంతో ఎలా విడుద‌ల చేస్తారోన‌ని అనుకున్నాం. అయితే నిర్మాత‌లు ధైర్యం చేసి విడుద‌ల చేశారు. ఈ సినిమా ఇంత పెద్ద స‌క్సెస్ అయ్యిందంటే కార‌ణం నిర్మాత‌ల‌కే క్రెడిట్ ద‌క్కుతుంది. తెలుగు ప్రేక్ష‌కుల‌కు యూనానిమ‌స్‌గా పెద్ద స‌క్సెస్ చేశారు. ఇంత పెద్ద విజ‌యంలో ద‌ర్శ‌కుడు ఆనంద్‌గారు, మ్యూజిక్ డైరెక్ట‌ర్ శేఖ‌ర్ చంద్ర‌, సినిమాటోగ్రాఫ‌ర్ సాయిశ్రీరామ్ చోటా కె.ప్ర‌సాద్ భాగ‌మయ్యారు. అంద‌రికీ థాంక్స్‌. సినిమాను ఇంత పెద్ద స‌క్సెస్ చేసిన తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఈ సినిమాను డేడికేట్ చేస్తున్నాను`` అన్నారు.

Hebah Patel glam gallery from the event

ద‌ర్శ‌కుడు వి.ఐ.ఆనంద్ మాట్లాడుతూ - ``ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా ఎమోష‌న‌ల్ జ‌ర్నీ. ఎందుకంటే ఈ సినిమా ప్రారంభం నుండి నా హృద‌యానికి ద‌గ్గ‌రైన క‌థ‌తో రూపొందింది. 2001లో సినిమా రంగంలోకి ఎంట‌ర్ అయిన నాకు 2016లో ద‌ర్శ‌కుడిగా పెద్ద స‌క్సెస్ ద‌క్కింది. టైగ‌ర్ సినిమా స్టార్ట్ అయిన‌ప్ప‌టి నుండి ఈ సినిమా కోసం నిఖిల్‌, నిర్మాతగారితో జ‌ర్నీ స్టార్ట్ అయ్యింది. సాయిశ్రీరామ్‌, శేఖ‌ర్ చంద్ర స‌హా అంద‌రూ టెక్నిషియ‌న్స్ సినిమాను నెక్ట్స్ లెవ‌ల్‌కు తీసుకెళ్లారు. రామ‌జోగ‌య్య‌శాస్త్రి, శ్రీమ‌ణి మంచి సాహిత్యంను అందిస్తే, అబ్బూరి ర‌వి అద్భుత‌మైన డైలాగ్స్‌ను అందించారు. హెబ్బా చాలా హార్డ్ వ‌ర్క్ చేసి న‌టించింది. నందిత‌శ్వేత మంచి పెర్‌ఫార్మెన్స్ చేసింది. సినిమాను ఇంత పెద్ద హిట్ చేసిన అంద‌రికీ థాంక్స్‌`` అన్నారు.

హెబ్బా ప‌టేల్ మాట్లాడుతూ - ```ఎక్క‌డికిపోతావు చిన్న‌వాడా` సినిమాను స‌క్సెస్ చేసిన ప్రేక్ష‌కుల‌కు థాంక్స్‌. ఇంత పెద్ద స‌క్సెస్‌లో భాగం కావ‌డానికి కార‌ణ‌మైన ద‌ర్శ‌కుడు ఆనంద్‌, హీరో నిఖిల్‌, నందిశ్వేత‌, సాయిశ్రీరాం, శేఖ‌ర్‌చంద్ర, నిర్మాత‌లు స‌హా కార‌ణ‌మైన అంద‌రికీ థాంక్స్‌`` అన్నారు.

నిర్మాత మాట్లాడుతూ - ``ద‌ర్శ‌కుడు ఆనంద్‌గారు సినిమాను ఎంతో అద్భుతంగా తెర‌కెక్కించారు. అలాగే నిఖిల్‌, హెబ్బా, నందిత‌శ్వేత‌, అవికా స‌హా అంద‌రూ చ‌క్క‌గా న‌టించారు. స‌క్సెస్ చేసిన ప్రేక్ష‌కులకు థాంక్స్‌`` అన్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో చోటా కె.ప్ర‌సాద్‌, వెన్నెల కిషోర్‌, రాజా ర‌వీంద్ర త‌దిత‌రులు పాల్గొన్నారు.


 


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved