pizza
Thanu Vachenanta team at Radio Mirchi - Vijayawada
అచ్యుత ఆర్ట్స్‌ 'తను.. వచ్చేనంట..'
You are at idlebrain.com > News > Functions
Follow Us

22 September 2016
Hyderaba
d

తేజ కాకుమాను, రేష్మి గౌతమ్‌, ధన్యబాలకృష్ణన్‌, చలాకి చంటి, శివన్నారాయణ, ఫిష్ వెంకట్ తదితరులు నటీనటులుగా రూపొందుతున్న చిత్రం 'తను.. వచ్చేనంట'. అచ్యుత ఆర్ట్స్‌ పతాకంపై చంద్రశేఖర్‌ ఆజాద్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి వెంకట్‌ కాచర్ల దర్శత్వం వహిస్తున్నారు. శరవేగంగా నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి చేసుకుంటున్న ఈ చిత్రాన్ని ఈ నెలాఖరులో విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్ర ప్రమోషన్ నిమిత్తం రేష్మి గౌతమ్, తేజ కాకుమాను విజయవాడ రేడియో మిర్చిలో మరియు విజయవాడ సిద్దార్ధ కాలేజీ స్టూడెంట్స్ తో హల్చల్ చేసారు.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత శ్రీ చంద్రశేఖర్ ఆజాద్ పాటిబండ్ల మాట్లాడుతూ "ఇటీవల రిలీజ్ చేసిన సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. మా హీరో తేజ కాకుమాను విజయవాడ వాడే కావడంతో జనాల్లో అతనికి మంచి రెస్పాన్స్ వస్తుంది. రేడియో మిర్చి ప్రోగ్రాం కి, సిద్దార్ధ కాలేజీ కి వెళ్ళినప్పుడు అందరు మీ చిత్రం ట్రైలర్ చూసాము, సాంగ్స్ విన్నాము చాల బాగున్నాయి అని చెప్తున్నారు. జామెడీ అంటే ఏంటి అని ఎంతో ఆతృతగా అడుగుతున్నారు. మా చిత్రానికి మేము అనుకున్నదానికంటే మంచి రెస్పాన్స్ ప్రేక్షకుల నుంచి వస్తుంది. ఈ చిత్రం ప్రమోషన్ కోసం ఈ రోజు మధ్యాహ్నం విజయవాడలోని ప్రముఖ మాల్స్, షాపింగ్ కాంప్లెక్స్ లకి మా హీరో, హీరోయిన్ లు తేజ కాకుమాను, రేష్మి గౌతమ్, చలాకి చంటి వస్తున్నారు. మొదటినుంచి మాచిత్రాన్ని జనాలకి బాగా చేరువ చేసిన మీడియా వారికి కృతఙ్ఞతలు తెలుపుతున్నాము అని అన్నారు.

హీరో తేజ కాకుమాను మాట్లాడుతూ "నేను విజయవాడ లోనే చదువుకున్నాను. నను ఇంతగా ఆదరిస్తున్నందుకు దయవాదాలు. బాహుబలి చిత్రం తర్వాత ఈ సినిమాలో హీరోగా తొలి పరిచయం కావడం ఆనందంగా ఉంది." అని అన్నారు.

ఈ చిత్రానికి లైన్‌ ప్రొడ్యుసర్‌: బెక్కెం రవీందర్‌, ఆర్ట్‌: సిస్తల శర్మ, కెమెరా: రాజ్‌కుమార్‌, ఎడిటింగ్‌ టీమ్‌: గ్యారీ బి.హెచ్‌; గణేష్‌.డి, విజువల్‌ ఎఫెక్ట్స్‌: విజయ్‌, సంగీతం: రవిచంద్ర, నేపథ్య సంగీతం: శశిప్రీతం, సహనిర్మాత: పి.యశ్వంత్‌, పాటలు: చల్లా భాగ్యలక్ష్మీ, కథ-నిర్మాత: చంద్రశేఖర్‌ ఆజాద్‌ పాటిబండ్ల, క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌: కె. రాఘవేంద్రరెడ్డి.


Photo Gallery (photos by G Narasaiah)
 
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved