pizza
Veedevadu theatrical trailer launch
`వీడెవ‌డు` థియేట్రిక‌ల్ ట్రైల‌ర్ విడుద‌ల‌
You are at idlebrain.com > News > Functions
Follow Us

9 September 2017
Hyderaba
d

స‌చిన్‌, ఇషా గుప్తా హీరో హీరోయిన్లుగా వై కింగ్ మీడియా అండ్ ఎంట‌ర్‌టైన్మెంట్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రైనా జోషి నిర్మించిన చిత్రం `వీడెవ‌డు`. ఈ సినిమా సెప్టెంబ‌ర్ 15న విడుద‌ల‌వుతుంది. ఈ సంద‌ర్భంగా ఈ సినిమా థియేట్రిక‌ల్ ట్రైల‌ర్ విడుద‌ల కార్య‌క్ర‌మం శ‌నివారం హైద‌రాబాద్ ప్ర‌సాద్ ల్యాబ్స్‌లో జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా....

ద‌ర్శ‌కుడు తాతినేని స‌త్య మాట్లాడుతూ - ``ఎస్‌.ఎం.ఎస్‌, భీమిలి క‌బ‌డ్డీ జట్టు, శంక‌ర సినిమాలు త‌ర్వాత చేసిన మూవీ ఇది. నేను తెలుగులో చేసిన స్ట్ర‌యిట్ మూవీ వీడెవ‌డు. స‌చిన్ జోషిగారు ఎక్స‌లెంట్‌గా న‌టించారు. త‌న‌లో ఓ కొత్త యాంగిల్‌ను చూస్తారు. బినేంద్ర మీన‌న్ సినిమాటోగ్ర‌ఫీ, థ‌మ‌న్ మ్యూజిక్‌, ర‌ఘు కుల‌క‌ర్ణి ఆర్ట్‌, స‌హా అంద‌రూ ఎంతో స‌పోర్ట్ చేశారు. అవుట్‌పుట్ సూప‌ర్బ్‌గా వ‌చ్చింది. సినిమాపై చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. సినిమా సెప్టెంబ‌ర్ 15న విడుద‌ల‌వుతుంది`` అన్నారు.

స‌చిన్‌జోషి మాట్లాడుతూ - ``వీడెవ‌డు సినిమా అవుట్‌పుట్ చాలా బాగా వ‌చ్చింది. సినిమా కోసం ప‌నిచేసిన వారంద‌రూ ప్యాష‌న్‌తో వ‌ర్క్ చేశారు. సినిమా కూడా అంద‌రికీ న‌చ్చేలా ఉంటుంది. కొత్త త‌ర‌హా మూవీ. ప్రేక్ష‌కులు కోరుకునే ఎలిమెంట్స్ అన్నీ ఈ సినిమాలో ఉంటాయి. సినిమా సెప్టెంబ‌ర్ 15న విడుద‌ల‌వుతుంది. ప్రేక్ష‌కులు సినిమాను ఆద‌రిస్తార‌ని న‌మ్మంగా ఉన్నాం`` అన్నారు.

స‌చిన్‌, ఇషా గుప్తా, ప్ర‌భు, కిషోర్‌, సుప్రీత్ రెడ్డి, శ్రీనివాస రెడ్డి, వెన్నెల‌కిషోర్‌, హ‌ర్ష‌వ‌ర్ధ‌న్‌, ధ‌న్య బాల‌కృష్ణ‌న్ త‌దిత‌రులు న‌టించిన ఈ చిత్రానికి సినిమాటోగ్ర‌ఫీః బినేంద్ర మీన‌న్‌, సంగీతంః ఎస్‌.ఎస్‌.థ‌మ‌న్‌, ఎడిటింగ్ః ప్ర‌వీణ్ పూడి, ఆర్ట్ః ర‌ఘుకుల‌క‌ర్ణి, ఫైట్స్, క‌న‌ల్ క‌ణ్ణ‌న్‌, పాట‌లుః రామ‌జోగ‌య్య‌శాస్త్రి, భాస్క‌ర‌భ‌ట్ల‌, శ్రీమ‌ణి, కొరియోగ్ర‌ఫీః సీజ‌ర్‌, జానీ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ః శివ‌ప్ర‌సాద్ గుడిమిట్ల‌, ప్రొడ్యూస‌ర్ః రైనా జోషి, క‌థ‌, స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వంః తాతినేని స‌త్య‌.


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved