pizza
Manu Trailer launch
'మను' ట్రైలర్‌ విడుదల
You are at idlebrain.com > News > Functions
Follow Us


12 August 2018
Hyderabad

రాజా గౌతమ్‌, చాందిని చౌదరి హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న చిత్రం 'మను'. నిర్వాణ సినిమాస్‌ సమర్పణలో క్రౌడ్‌ ఫండెడ్‌గా నిర్మితమైన ఈ చిత్రానికి ఫ˜ణీంద్ర నార్‌శెట్టి దర్శకుడు. ఈ సినిమా ట్రైలర్‌ను ఆదివారం హైదరాబాద్‌ రామానాయుడు స్టూడియోలో విడుదల చేశారు.

రాజా గౌతమ్‌ మాట్లాడుతూ - ''ఇది మూడేళ్ల ప్రయాణం. ఒక్కొక్క సినిమాకు ఇంత గ్యాప్‌ ఎందుకు తీసుకుంటున్నావ్‌? కంటిన్యూగా సినిమాలు చెయ్‌ అని అంటుంటారు. వాళ్లందరూ అంటే చాలా గౌరవం. అయితే నా మనసులో మాత్రం ఇలాంటి సినిమా చేస్తే బావుంటుందనే వ్యక్తిగత అభిప్రాయం బలంగా ఉండిపోయింది. ఈ జర్నీ స్టార్ట్‌ కాకముందు చాలా షార్ట్‌ ఫిలింస్‌ చూశాను. షార్ట్‌ ఫిలింస్‌ డైరెక్టర్స్‌ని కలిశాను. 40-50 కథలు విన్నాను. ఈ ప్రాసెస్‌లో మధురం అనే షార్ట్‌ ఫిలిమ్‌ చూసిన తర్వాత చాలా బాగా నచ్చింది. నా స్నేహితుడి దగ్గర నుండి డైరెక్టర్‌ ఫణి నెంబర్‌ తీసుకుని తనకు కాల్‌ చేసి అప్రిషియేట్‌ చేశాను. తను చేసిన బ్యాక్‌ స్పేస్‌ చూసి ఇంకా ఆశ్చర్యపోయాను. తనను కలిసి ఇద్దరం డిస్కస్‌ చేసుకుంటూ వచ్చాను. ఇద్దరి ఐడియాలజీ కలిసింది. ఆ సందర్భంలో మను సినిమా గురించి.. ఓ పదిహేను నిమిషాలు కథ చెప్పాడు. స్క్రిప్ట్‌ అద్భుతంగా ఉందని తనను అప్రిషియేట్‌ చేశాను. అయితే అప్పటికీ నేనే ఆ సినిమా చేయబోతున్నానని కూడా నాకు తెలియదు. అయితే ఫణితో పరిచయం మాత్రం కొనసాగింది. ఓరోజు తను మను క్యారెక్టర్‌ నువ్వే చేస్తున్నావ్‌ అంటూ మెసేజ్‌ చేశాడు. చాలా సంతోషంగా అనిపించింది. ఓ నటుడు తనను తాను ప్రూవ్‌ చేసుకోవాలనుకుంటున్నప్పుడు మను క్యారెక్టర్‌ చాలు. ఫణి పర్‌ఫెక్షన్‌తో ఈ సినిమా చేశాడు. 115 మంది డబ్బులు పెట్టి చేసిన సినిమా కాబట్టి.. ఎంత బాధ్యతగా ఉండాలో తెలిసిన వ్యక్తి. సినిమా స్టార్ట్‌ అయినప్పటి నుండి నేటి వరకు కూల్‌గా హ్యాండిల్‌ చేసుకుంటూ వచ్చాడు. ప్రతి ఒక్కరికీ పూర్తి స్క్రిప్ట్‌ వివరించాడు. చాలా క్లారిటీ ఉన్న డైరెక్టర్‌. 'ఏ సినిమా చేసినా రక్త మాంసాలు పెట్టి పనిచెయ్‌' అని నాన్న ఎప్పుడూ చెబుతుంటారు. అలా ఎందుకు చెబుతున్నారో ఈ సినిమాకు నాకు తెలిసింది. సినిమా అంటే పిచ్చి, ప్రేమ ఉన్న జనాలు ఈ సినిమాకు తమ వంతు సహకారాన్ని అందించారు. ప్రతి ఒక్కరికీ థాంక్స్‌. గ్రేట్‌ లెర్నింగ్‌ ఎక్స్‌పీరియెన్స్‌. క్వాలిటీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్‌ కాలేదు. ఎక్కడా వేస్ట్‌ కాకూడదు అని చాలా కష్టపడ్డాం. ఇది సక్సెస్‌ అయితే ఇలాంటి ఫార్మేట్‌లో ఇంకా చాలా సినిమాలు వస్తాయి. హీరోయిన్‌ చాందిని మాతో కలిసిపోయి పనిచేసింది. చాలా ఓపికగా సినిమా కోసం పనిచేసింది. తన కమిట్‌మెంట్‌, డేడికేషన్‌ సూపర్బ్‌. నీల పాత్రలో అద్భుతంగా నటించింది. మా కెమెరామెన్‌ విశ్వనాథ్‌గారు.. తన బడ్జెట్‌ లిమిటేషన్స్‌లో అద్భుతమైన విజువల్స్‌ అందించారు. నరేశ్‌ ఎక్సలెంట్‌ మ్యూజిక్‌ ఇచ్చాడు. శివ్‌ ఆర్ట్‌ వర్క్‌ విషయంలో కాంప్రమైజ్‌ కాకుండా సపోర్ట్‌ చేశారు. సినిమాకు సహకారం అందించిన ప్రతి ఒక్కరికీ థాంక్స్‌. సెప్టెంబర్‌ 7న సినిమా విడుదలవుతుంది'' అన్నారు.

చాందిని చౌదరి మాట్లాడుతూ - ''ట్రైలర్‌ అందరికీ నచ్చే ఉంటుంది. దీని కంటే ఎన్నో రెట్లు సినిమా గొప్పగా ఉంటుంది. మధురంలో నేను మెయిన్‌ లీడ్‌గా నటించాను. సినిమా చేసి నాలుగేళ్లు అయ్యింది. కానీ ఇంకా ఆ మధురం గురించి వింటూనే ఉన్నాను. అప్పటి నుండి ఫణి గురించి తెలుసు. తను చెప్పేదాని కంటే గొప్ప విజన్‌ ఉన్న డైరెక్టర్‌. ఈ సినిమాలో నీలు అనే డెప్త్‌ ఉండే క్యారెక్టర్‌ చేశాను. నాపై నమ్మకంతో ఫణి నాకు అవకాశం ఇచ్చాడు. ఈ క్షణం కోసం నేను ఎంతో వెయిట్‌ చేశాను. సినిమా విషయానికి వస్తే.. రాజేశ్‌, మౌనిష్‌, శివ, శబరీశ్‌.. అందరూ నన్ను వాళ్ల ఫ్యామిలీ మెంబర్స్‌లా చూసుకున్నారు. అందరూ స్ట్రాంగ్‌ పిల్లర్స్‌లా సినిమా కోసం సపోర్ట్‌ చేశారు. గౌతమ్‌ బ్యాగ్రౌండ్‌ తెలుసు కాబట్టి నేను ముందు కాస్త భయపడ్డాను. చాలా మంచి సపోర్ట్‌ ఇచ్చాడు. మంచి నటుడు.. హార్డ్‌ వర్కర్‌. తన కాళ్లపై నిలబడాలని కష్టపడిన నటుల్లో గౌతమ్‌ ఒకరు'' అన్నారు.

కెమెరా మెన్‌ విశ్వనాథ్‌ మాట్లాడుతూ - ''ఇది నా తొలి సినిమా. బెస్ట్‌ అవుట్‌పుట్‌ ఇచ్చాను. సైకలాజికల్‌గా జనాలకు అర్థం కావడానికి కొన్ని టెక్నిక్స్‌ ఉపయోగించి చేశాను. ఫణి మంచి డైరెక్టరే కాదు.. మంచి ఆర్టిస్ట్‌ కూడా. తన విజన్‌ గొప్పగా ఉంటుంది. అందరికీ థాంక్స్‌'' అన్నారు.

జాన్‌ కొటొలి మాట్లాడుతూ ''మను ప్రీ వర్క్‌ ముందుగానే క్లారిటీ వచ్చేసింది. అందువల్ల సినిమా కోసం ఓ క్లారిటీతో పనిచేశాం'' అన్నారు.

నిర్వాణ సినిమాస్‌ రాజ్‌ నిహార్‌ మాట్లాడుతూ - ''ఒక సినిమా అందరికీ రీచ్‌ కావాలంటే మంచి కథ కావాలి. అలాంటి కథతో ఫణి చేసిన చిత్రమిది. ఫైనల్‌ కాపీ రెడీ అయ్యింది. మంచి సినిమా వచ్చినప్పుడు దాన్ని ప్రేక్షకులకు అందించాల్సిన బాధ్యత డిస్ట్రిబ్యూటర్స్‌గా మాపై ఉందనిపించింది. అందుకే మేము ఈ సినిమాలో భాగమైయాం'' అన్నారు.

డైరెక్టర్‌ ఫణీంద్ర నార్‌శెట్టి మాట్లాడుతూ - ''ఇంత పెద్ద ప్రయాణం ఎక్కడ మొదలైందని చెప్పలేను. ఈ సినిమా కోసం వెయ్యి రూపాయల నుండి నలబై లక్షల వరకు ఇచ్చిన వాళ్లు ఉన్నారు. ఇది నాకు ఎమోషనల్‌ మూమెంట్‌. కాబట్టి ఇన్వెస్టర్స్‌ను మరచిపోలేను.ఎందుకు నమ్మారో తెలియదు కానీ.. అందరూ ఎంతగానో నమ్మారు.. అయితే ఎవరి నమ్మకాన్ని తగ్గించేలా సినిమా ఉండదని కచ్చితంగా చెప్పగలను. ఇక టీమ్‌ గురించి చెప్పాలంటే నన్ను ఏమీ అడగకుండా.. సినిమా గురించి సపోర్ట్‌ చేశారు. సినిమా మా వర్క్‌ గురించి ఎక్కువగా చెబుతుందని నమ్ముతున్నాం. ఇంత కంటే బెస్ట్‌ టీమ్‌తో పనిచేయలేనేమోననిపిస్తుంది. సినిమా తీసుకుంటామని ఏడాదిన్నర క్రితమే నిర్వాణ సినిమాస్‌ మమ్మల్ని సంప్రదించారు. వాళ్ల నమ్మకాన్ని సినిమా నిజం చేస్తుందని నమ్ముతున్నాను'' అన్నారు. ఈ కార్యక్రమంలో చిత్రయూనిట్‌ సభ్యులు పాల్గొన్నారు.

రాజా గౌతమ్‌, చాందిని చౌదరి, జాన్‌ కొటొలి, మోహన్‌ భగత్‌, అభిరామ్‌, శ్రీకాంత్‌ ముళ్లగరి తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: విశ్వనాథ్‌ రెడ్డి, ఆర్ట్‌: శివ్‌కుమార్‌, సౌండ్‌ డిజైన్‌: సచిన్‌ సుధాకరన్‌, హరిహరన్‌, నిర్మాణం: క్రౌడ్‌ ఫండింగ్‌ మూవీ(115 మెంబర్స్‌), రచన, దర్శకత్వం: ఫణీంద్ర నార్‌శెట్టి.

 

Photo Gallery (photos by G Narasaiah)

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved