pizza
Tharuvatha Evaru trailer launch
`త‌రువాత ఎవ‌రు` ట్రైల‌ర్ లాంచ్‌
You are at idlebrain.com > News > Functions
Follow Us

3 May 2018
Hyderabad

క‌మ‌ల్ కామ‌రాజు, భ‌ర‌ణి, మ‌నోజ్‌, ప్రియాంక శ‌ర్మ‌, య‌షికా మౌల్క‌ర్‌, సాయి కిర‌ణ్‌, ప్ర‌శాంత్‌, మ‌ద‌న్‌, సురేష్ మున్నా, క‌రుణాక‌ర్‌, ల‌డ్డు, రాధిక‌, జ్యోతి, అమ‌ర్‌దీప్‌, శ‌ర‌త్ గంట ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా తెర‌కెక్కిన చిత్రం `త‌రువాత ఎవ‌రు`. స్టోరీ, స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వం జి.కృష్ణ‌ప్ర‌సాద్‌, కె.రాజేష్ స‌మ‌కూర్చారు. ల‌క్ష్మీ రెడ్డి.కె., రాజేష్ కోడూరి నిర్మించారు. హ్యాపీ ఎండింగ్ క్రియేష‌న్స్ ప‌తాకంపై రూపొందింది.

ద‌ర్శ‌కులు మాట్లాడుతూ `` మా సినిమాకు `త‌రువాత ఎవ‌రు` అనే పేరు పెట్టాం. ఆ టైటిల్‌లోనే సినిమా క‌థ మొత్తం ఉంది. ట్రైల‌ర్ చూసిన వారంద‌రూ చాలా గ్రిప్పింగ్‌గా, థ్రిల్లింగ్‌గా ఉంద‌ని అంటున్నారు. అదే థ్రిల్లింగ్ సినిమా మొత్తం ఉంటుంది. త‌ప్ప‌కుండా యువ‌త‌ను ఆక‌ట్టుకుంటుంది`` అని అన్నారు.

న‌టీన‌టులు మాట్లాడుతూ `` థ్రిల్ల‌ర్స్ ప్ర‌తి ఏడాది చాలానే వ‌స్తుంటాయి. కానీ వాట‌న్నిటిలోకెల్లా మా సినిమా థ్రిల్ల‌ర్ చాలా బావుంటుంది. త‌ప్ప‌కుండా హిట్ అవుతుంది. క్వాలిటీ కూడా బావుంటుంది`` అని చెప్పారు.

సంగీత ద‌ర్శ‌కుడు విజ‌య్ కురాకుల మాట్లాడుతూ ``సిన్సియ‌ర్ ఎఫ‌ర్ట్ తో చేసిన సినిమా ఇది. చూసిన ప్ర‌తి ఒక్క‌రికీ అది అర్థ‌మ‌వుతుంది`` అని అన్నారు.

ఎడిట‌ర్ మాట్లాడుతూ ``మాట‌లు చాలా బావున్నాయి. కెమెరా కూడా చ‌క్క‌గా కంపోజ్ చేశారు`` అని చెప్పారు.

డైలాగ్ రైట‌ర్ మాట్లాడుతూ ``హిందీలో అబ్బాస్ మ‌స్తాన్ ఎంత ఫేమ‌సో ఈ చిత్ర ద‌ర్శ‌కులు అంతే ఫేమ‌స్ కావాలి`` అని అన్నారు.

ఈ సినిమాకు కెమెరా: కె.రాజేంద్ర‌బాబు, సంగీతం: విజ‌య్ కురాకుల‌, ఎడిట‌ర్‌: ఆవుల వెంక‌టేష్‌, మాట‌లు: చిట్టి శ‌ర్మ‌, కె.రాజేష్‌, లిరిక్స్: ఎ. క‌రుణాక‌ర్‌, ఫైట్స్: అహ్‌మ‌ద్‌, సీజీ: వ‌ర్క్ ఫ్లో.



Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved