pizza
Jaya Janaki Nayaka Vijayotsava Veduka at Hamsala Deevi
పవిత్ర క్షేత్రం హంసల దీవిలో అత్యంత ఘనంగా జరిగిన "జయ జానకి నాయక" విజయోత్సవ వేడుక !!
You are at idlebrain.com > News > Functions
Follow Us

18 August 2017
Hyderaba
d

యంగ్ సెన్సేషన్ బెల్లంకొండ శ్రీనివాస్ కథానాయకుడిగా మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తెరకెక్కించిన "జయ జానకి నాయక" గతవారం విడుదలై ఘన విజయం సొంతం చేసుకొని సరికొత్త రికార్డులు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్, ప్రగ్యా జైస్వాల్ కథానాయికలుగా నటించగా.. తమిళ స్టార్ నటుడు శరత్ కుమార్ కీలకపాత్రలో నటించారు. ఈ చిత్ర విజయోత్సవ వేడుక నేడు (ఆగస్ట్ 18) పుణ్యక్షేత్రం హంసల దీవిలో ఘనంగా జరిగింది. ఈ వేడుకలో చిత్ర బృందంతోపాటు కృష్ణా జిల్లా కలెక్టర్ బి.లక్ష్మీకాంతం, ఏ.పి డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా చిత్ర దర్శకులు బోయపాటి శ్రీను మాట్లాడుతూ.. "నేను తీసిన ప్రతి సినిమాని ప్రేక్షకులు ఆదరించారు. నేను అందరు స్టార్ హీరోలతోనూ సినిమాలు చేస్తాను, అవి మీరు చూస్తారు. ఏ ఒక్కరూ ఇబ్బందిపడకుండా గుండెల మీద చేయ్యేసుకొని నా సినిమాల్ని ప్రేక్షకులు చూడొచ్చు. అత్యంత పవిత్రమైన ఈ పుణ్యక్షేత్రంలో షూట్ చేయడం కూడా మా సినిమా విజయానికి ముఖ్యకారణం. మా సినిమా విజయోత్సవ వేడుక నిర్వహించడానికి ఇంతకంటే మంచి ప్లేస్ దొరకదు. ఈ పరిసర ప్రాంతాల్లో యువత మా సినిమా షూటింగ్ టైమ్ లో సపోర్ట్ చేసిన తీరును ఎప్పటికీ మరువలేను. ఈ వేడుకకు తరళివచ్చిన ప్రతి ఒక్కరికీ నా ధన్యవాదాలు. ఈ వేడుకను నిర్విఘ్నంగా ఇక్కడ నిర్వహించడానికి సహకరించిన మండలి బుద్ధప్రసాద్ గారికి, బి.లక్ష్మీ కాంతంగారికి, జిల్లా ఎస్పీ గారికి ప్రత్యేక కృతజ్నతలు" అన్నారు.

చిత్ర కథానాయకుడు బెల్లంకొండ శ్రీనివాస్ మాట్లాడుతూ.. "మా "జయ జానకి నాయక" చిత్రానికి ఘన విజయాన్ని అందించిన ప్రేక్షకులందరికీ నా నమస్సుమాంజలి. ఇవాళ 120 థియేటర్లు పెరిగాయంటే కారణం ప్రేక్షకులందరూ కలిసి ఇచ్చిన సపోర్టే. ఇక నుంచి ఇంతకంటే మంచి సినిమాలతోనే ప్రేక్షకుల ముందుకు రావడానికి నిరంతరం కష్టపడుతూనే ఉంటాను. నేను జీవితంలో గర్వంగా చెప్పుకొనే సినిమా "జయ జానకి నాయక", అలాంటి గర్వించదగ్గ చిత్రాన్ని నాకు ఇచ్చినందుకు మా డైరెక్టర్ బోయపాటి శ్రీనుగారికి జీవితాంతం ఋణపడి ఉంటాను. అలాగే నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్నతలు తెలియజేస్తున్నాను" అన్నారు. 

సినిమాలో కీలకపాత్ర పోషించిన జగపతిబాబు మాట్లాడుతూ.. "30 ఏళ్లుగా నన్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికీ కృతజ్నతలు. ఎలాంటి పాత్ర చేసినా నన్ను ఆదరించారు. అసలు "హంసల దీవి" అనే ప్లేస్ ఒకటి ఉందని కూడా నాకు తెలీదు, మా బోయపాటి మమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ షూటింగ్ చేయించాడు. సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ప్రేక్షకులు మా సినిమాని ఓన్ చేసుకొన్నారు. రెండోవారంలో సినిమా థియేటర్లు పెరగడం అంటే చిన్న విషయం కాదు, బోయపాటి సత్తా ఇది. అన్నీ తానై సినిమాని నడిపించాడు. "లెజండ్"కి ముందు నా కెరీర్ అయిపోయింది అని అందరు అనుకొన్నారు. కానీ బోయపాటి అద్భుతమైన పాత్ర ఇచ్చి ఆ సినిమాతో నిలబెట్టాడు. అది నా ఒరిజినల్ క్యారెక్టర్, నేను మొండోడ్ని.. ఎక్కడికీ వెళ్లను. సెల్ ఫోన్, ల్యాండ్ లైన్ చేతిలో పట్టుకొని ఎవడు ఫోన్ చేసి అవకాశం ఇస్తాడా అని ఎదురుచూస్తున్న తరుణంలో బోయపాటి నాకు లైఫ్ ఇచ్చాడు, ఆ పాత్రను మించిన స్థాయిలో ఒక రెస్పాన్సబిలిటీ తీసుకొని "జయ జానకి నాయక"లో అద్భుతమైన పాత్ర ఇచ్చాడు. అలాగే కేవలం బోయపాటి మీద నమ్మకంతో ఖర్చు విషయంలో ఎక్కడా వెనుకడుగు వేయకుండా అద్భుతమైన ఔట్ పుట్ వచ్చేలా చేయడంలో దోహదపడ్డాడు. ఇంతదూరం వచ్చినందుకు ప్రేక్షకులందరికీ కృతజ్నతలు" అన్నారు. 

చిత్ర కథానాయకి ప్రగ్యా జైస్వాల్ మాట్లాడుతూ.. "మా సినిమాని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ నా కృతజ్నతలు. ఈ సినిమాని ప్రేక్షకులు మళ్ళీ మళ్ళీ చూసి మరింత ఘన విజయాన్ని అందివ్వాలని కోరుకొంటున్నాను" అన్నారు. 

ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య అతిధులు అందరు "జయ జానకి నాయక" సినిమా సాధిస్తున్న విజయానికి సంతోషిస్తూ.. చిత్ర బృందాన్ని శాలువాతో సత్కరించారు. అలాగే.. ఇలాంటి సినిమాలు మరెన్నో రావాలని మనస్ఫూర్తిగా కోరుకొన్నారు. 


Photo Gallery (photos by G Narasaiah)

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved