“Every person is a walking story” - Mayasabha articles
“ప్రతి మనిషీ నడయాడే కథ!” – మయసభ వ్యాసాలు
- Deva Katta
Introduction
Behind Mayasabha’s success are underdogs whose grit and passion kept them chasing cinema against all odds. This article series celebrates those journeys—how each cast and crew member was chosen, the struggles that shaped them, and how one project’s nationwide acclaim became the turning point of their careers. Because every person you meet is a walking story—sometimes all it takes is one opportunity for the world to listen.
మయసభ విజయం వెనకున్న సైన్యం, సంవత్సరాలుగా కష్టాలు, అడ్డంకులు ఎదుర్కొంటూ సినిమా తప్ప వేరే జీవితమే లేదని బతుకుతున్న అండర్‌డాగ్స్. వారి ప్రయాణానికి నివాళిగా ఈ వ్యాసాలు రాస్తున్నాను. వారిని తీర్చిదిద్దిన జీవిన పోరాటాలు, మయసభలో వారి ఎలా ఎంపిక, ఈ విజయంలో వారి పాత్ర ఈ వ్యాసాల్లో ప్రధాన అంశాలు. ప్రతి మనిషి ఒక నడిచే కథ—ఆ కథని ప్రపంచం వినడానికి, ఒకే ఒక్క అవకాశం చాలు.
Nageswaar, an introvert pursuing B.Tech in Computer Science, first joined a theatre workshop to become an actor. After graduation, he pursued an acting course at Annapurna College of Film and Media. Just before his first shoot, he met with an accident, but after recovery he returned with greater determination—auditioning, performing theatre in Hyderabad and West Bengal, and acting in four feature films.
Casting director Kiran (Dreams Casting Agency) invited him to audition for Mayasabha. We chose him to play Basava Rayudu. Though a little anxious initially as a newcomer, he grew in confidence by the day and did a brilliant job.
-------
Bhanu Prasad was born into a family of daily wage laborers in the village of Nellakota in the Anantapur district. He completed a B.Com degree. From a young age, influenced by Chiranjeevi’s films, he developed a passion for acting through participating in plays and dance performances. Due to family circumstances, he initially took up a small job in Bangalore. However, in 2015, driven by his deep interest in cinema, he quit his job and moved to Hyderabad. With no knowledge of how auditions worked, Bhanu struggled and spent 20 days living in a mechanic shed in Krishna Nagar, thanks to the kindness of a man named Basha Bhai. There, he met a young man named Kali Anna who helped him get started by guiding him to attend auditions and act in short films and stage dramas. In 2016, Bhanu joined a Telugu-Kannada bilingual film titled Darlinge Osi Na Darlinge as an assistant director. Impressed by his work, the director gave him a lead role—marking Bhanu’s first film as an actor. Following that, he played the role of a blind man in another Kannada film, which received good appreciation. When his parents saw his face on the big screen at Bhumika Theatre, their tears of joy helped Bhanu find clarity in his life’s purpose. Later, he gained recognition as an anti-hero in the Zee5 original film Meka Suri.
Though the role he got in Mayasabha is small, Bhanu Prasad proved himself and impressed all of us as a talented actor.
--------------
Angadi Raghavendra hails from a small village named Ramapuram near Kadiri in the erstwhile Anantapur district. His primary inspiration for developing an interest in cinema was his father, who was a stage actor known for playing roles like Lord Krishna and Arjuna in dramas. Wanting to earn recognition like his father, Raghavendra moved to Hyderabad in 2018. After arriving in Hyderabad, he soon realized how difficult it is to make a mark in the film industry and how scarce opportunities really are. With little money in hand, even paying rent for a room became a struggle. In this situation, he began working as a junior artist and also took up set work. However, as the income from set work wasn’t enough, he switched to driving to make ends meet. He currently shares a single room with eight others. Despite losing many opportunities during the COVID-19 pandemic, he continued pursuing his passion—attending shoots during the day and driving an Uber cab at night to sustain himself.
Raghavendra has been active on the Tamada Media YouTube channel, and though his role in Mayasabha was small, he worked with great commitment and earned everyone’s appreciation.
--------
Narayana came to Hyderabad for the first time in 2017, hoping to find opportunities in the film industry. He wandered for about nine months and was even cheated out of ₹25,000. After those experiences, he decided to formally learn acting and planned to join Satyanand Film Institute. However, since the course fee was ₹3.5 lakhs, his father advised him to first take up a small job and save money. But his mother gave him her full support.
Eventually, convincing his parents and taking loans, Narayana enrolled and learned acting. Afterwards, he spent two years performing street plays and stage dramas. Due to growing loan interest, he had to sell his land and lost his property. Around the same time, his mother’s health also deteriorated.
Despite facing so many hardships, with the support of his mother, friends, and well-wishers, Narayana continues to fight for his dream. His life’s goal is to establish himself as an actor.
--------------
Teja Raju hails from a small village called Bommaram near Railway Koduru. He completed a BA in Electronics. His inspiration to enter the film industry was Rebel Star Prabhas. At the age of 18, he wanted to enter the film world, but due to family circumstances, the elders advised him to complete his education and take up a job.
Eventually, he made up his mind and began his journey towards cinema. In 2021, he moved to Hyderabad and made numerous efforts to break into the industry. At one point during that journey, he began to lose faith in himself.
He feels Mayasabha helped restore some of that lost confidence in him.
---------------------
Giriyashvardhan, completed his M.Sc. in Mathematics at S.V. University, Tirupathi. Inspired by cinema from a young age, he honoured his father's advice to finish his studies first. Active in cultural events during college, he performed in stage plays and represented his college at South Zone youth festivals, building his confidence. After moving to Hyderabad, he began making YouTube videos, attending auditions, and networking at industry events. His persistence led to small roles in films and an opportunity to work as an associate director.
We picked him for the Rayalaseema slang in Mayasabha. On set, he quickly bonded with fellow actors and did an excellent job.
---------------------
Lekya faced countless auditions, rejections, and moments of deep self-doubt, often questioning whether the pursuit of her acting dream was truly worth it. Like many aspiring actresses, her early days in the industry were filled with hope—but it was rejection that proved to be the hardest part. Each failed audition felt personal, even when it wasn’t, and she constantly found herself torn between practicality and passion. Yet, through all the emotional highs and lows, those struggles shaped her. They taught her patience, resilience, and the strength to keep going.
After numerous setbacks, the day finally came when an audition went right—and that moment marked the beginning of her journey into Mayasabha.
------------------
Ruchitha Nihani, from Dharmaraopet near Warangal, is from a middle-class family but always dreamed big. Active in cultural activities since childhood, she loved performing on stage. After completing a Diploma in Civil Engineering, she moved to Hyderabad for her B.Tech, working part-time as a telecaller and later as an Assistant Engineer, becoming financially independent at a young age. Post-B.Tech and during the COVID lockdown, she realized her true passion was acting. She began attending auditions, but her first experience was disheartening—misled into a background role and insulted for her skin tone. Instead of quitting, she grew stronger. To sustain herself, she worked as a makeup artist and started an online boutique, continuing to face rejections but never giving up.
Her first break came with Mattikatha. That led to roles in Yeshoda, Ooruperu Bhairavakona, Mothevari Love Story, Pottel, and Saripodasanivaram. On Pottel sets, actor Srikatha Iyyangar encouraged her to audition for Mayasabha.
She was selected to play one of the sisters to Pothineni Rameh. Ruchitha continues to grow as an actor, driven by hard work and unwavering passion for her craft.
-----------------
Wishing all the above passionate actors many more great opportunities to realise their dream and thrive.
నాగేశ్వర్, కంప్యూటర్ సైన్స్‌లో B.Tech చదువుతున్న రోజుల్లో ఒక ఇంట్రావర్ట్. నటుడు కావాలనే లక్ష్యంతో, మొదట ఒక థియేటర్ వర్క్‌షాప్‌లో జాయిన్ అయ్యాడు. డిగ్రీ పూర్తయ్యాక, అన్నపూర్ణ ఫిల్మ్ & మీడియా కాలేజ్ లో యాక్టింగ్ కోర్సు చేశాడు. తన తొలి షూటింగ్‌కు ముందు ఒక ప్రమాదం ఎదురైంది. కానీ కోలుకున్న తర్వాత, ఇంకెంతో దృఢనిశ్చయంతో తిరిగి వచ్చాడు. ఆడిషన్లు ఇస్తూ, హైదరాబాద్ మరియు వెస్ట్ బెంగాల్ లో నాటకాల్లో నటిస్తూ, ఇప్పటివరకు నాలుగు సినిమాల్లో నటించాడు.
డ్రీమ్స్ కాస్టింగ్ ఏజెన్సీకి చెందిన కాస్టింగ్ డైరెక్టర్ కిరణ్, నాగేశ్వర్‌ను మయసభ కోసం ఆడిషన్‌కి పిలిచారు.
బసవరాయుడు పాత్ర కోసం ఎంపిక చేశాం. మొదట్లో కొంత నెర్వస్ గా ఉన్నా, రోజు రోజుకీ ఆత్మవిశ్వాసం పెంచుకుంటూ, చివరికి అద్భుతమైన నటనతో పాత్రకు జీవం పోశాడు.
------------------
భాను ప్రసాద్ అనంతపురం జిల్లా, నెలకోట అనే గ్రామంలో కూలి పనులు చేసుకుని జీవనం సాగించే కుటుంబాలో పుట్టాడు. బీకామ్ డిగ్రీ చదివాడు. చిన్నప్పటి నుంచి చిరంజీవిగారి సినిమాల ప్రభావంతో నాటకాలు, డాన్స్‌లు చేస్తూ నటన పట్ల మక్కువ పెంచుకున్నాడు. కుటుంబ పరిస్థితుల వల్ల మొదట బెంగళూరులో చిన్న ఉద్యోగం చేశాడు. కానీ 2015లో సినిమాల పట్ల ఉన్న ఆసక్తితో ఉద్యోగాన్ని వదిలి హైదరాబాద్‌కు వచ్చాడు. ఆడిషన్స్ ఎలా ఉంటాయో కూడా తెలియని భాను, కష్టపడుతూ కృష్ణానగర్ బస్తీలో బాషా బాయ్ అనే మెకానిక్ షెడ్ లో 20 రోజుల పాటు షెడ్‌లో 20 రోజులు పాటు గడిపాడు. అక్కడ పరిచయమైన కాళీ అన్న అనే యువకుని సాయంతో చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్, స్టేజ్ డ్రామాల్లో నటిస్తూ ఆడిషన్స్ అటెండ్ అవడం మొదలుపెట్టాడు, 2016లో “డార్లింగే ఓసి నా డార్లింగే” అనే ఒక కన్నడ-తెలుగు బైలింగ్వల్ సినిమాలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేరి, డైరెక్టర్ నమ్మకంతో ఒక లీడ్ రోల్‌లో నటించే అవకాశం పొందాడు. అదే తన తొలి సినిమా. ఆ సినిమా విడుదల తరువాత మరో కన్నడ సినిమాలో గుడ్డివాడిగా చేసిన పాత్రకు మంచి పేరు వచ్చింది. భూమిక థియేటర్‌లో తన బొమ్మ చూసిన తల్లిదండ్రుల కన్నీళ్లు అతనికి జీవిత లక్ష్యాన్ని స్పష్టం చేశాయి. ZEE5లో ప్రసారమైన మేకసూరిలో యాంటీ హీరోగా నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు.
మయసభలో తనకు దొరికిన అవకాశం చిన్నదైనా భాను ప్రసాద్ తనను తాను ప్రూవ్ చేసుకుని మంచి నటుడిగా మా అందరి దృష్టిలో పడ్డాడు.
----------------
అంగడి రాఘవేంద్ర, ఉమ్మడి అనంతపురం జిల్లా కదిరి సమీపంలోని రామాపురం అనే చిన్న గ్రామానికి చెందినవాడు. సినిమాలపై ఆసక్తి ఏర్పడటానికి ప్రధాన కారణం ఆయన తండ్రిగారే. ఆయన ఒక నాటక కళాకారుడు—శ్రీకృష్ణుడు, అర్జునుడి పాత్రలు వేసేవారు. తండ్రిలాగే మంచి గుర్తింపు తెచ్చుకోవాలనే కోరికతో రాఘవేంద్ర 2018లో హైదరాబాద్‌కు వచ్చాడు. హైదరాబాద్‌కు వచ్చిన తర్వాత సినీ పరిశ్రమలో ఎదగడం ఎంత కష్టమో, అవకాశాలు ఎంత కొరతగా ఉంటాయో అర్థమైంది. చేతిలో డబ్బులేమీ లేకపోవడం, గదికి అద్దె చెల్లించడమే భారంగా మారింది. ఈ పరిస్థితుల్లో జూనియర్ ఆర్టిస్ట్‌గా, సెట్ వర్క్‌లకు వెళ్లాడు. అయితే సెట్ వర్క్ లో వచ్చే సంపాదన సరిపోక పోవడంతో డ్రైవింగ్ వైపు మళ్ళాడు. ప్రస్తుతం ఎనిమిది మందితో కలిసి ఒకే గదిలో ఉంటున్నాడు. కరోనా సమయంలో ఎన్నో అవకాశాలు కోల్పోయినా, పగలు షూటింగ్స్‌లో పాల్గొంటూ రాత్రిళ్లు Uber క్యాబ్ డ్రైవింగ్ చేస్తూ జీవనం సాగిస్తూ వచ్చాడు.
తమడా మీడియా యూట్యూబ్ ఛానెల్‌లో యాక్టివ్‌గా ఉంటున్న రాఘవేంద్ర, మయసభలో చిన్న పాత్రే అయినా చాలా కమిటెడ్ పని చేసి మా అందరి మెప్పు పొందాడు.
-------------------
నారాయణ, 2017లో సినిమా రంగంలో అవకాశాలు వెతుక్కోవడానికి మొదటిసారిగా హైదరాబాద్‌కు వచ్చాడు. సుమారు 9 నెలలు తిరిగాడు. రూ. 25,000 మోసపోయాడు కూడా. ఆ అనుభవాల తర్వాత, నటన నేర్చుకోవాలి అని నిర్ణయించి, సత్యానంద్ ఫిలిం ఇన్‌స్టిట్యూట్లో చేరాలనుకున్నాడు. అయితే ఫీజు రూ. 3.5 లక్షలు కావడంతో తండ్రి ముందుగా చిన్న పని చేసి డబ్బు కూడబెట్టమన్నాడు, కానీ తల్లి సంపూర్ణ మద్దతు ఇచ్చింది.
తల్లిదండ్రులను ఒప్పించి అప్పులు తీసుకుని నటన నేర్చుకున్న నారాయణ, తర్వాత రెండేళ్లు వీధినాటకాలు, స్టేజ్ ప్లేలు చేశాడు. అప్పుల వడ్డీలతో భూములు అమ్ముకోవాల్సి వచ్చి ఆస్తి కోల్పోయాడు. అదే సమయంలో తల్లి ఆరోగ్యం కూడా క్షీణించింది.
ఇన్ని కష్టాలు ఎదురైనా, తల్లి, స్నేహితులు, బంధువుల సహాయంతో నారాయణ తన లక్ష్యాన్ని అందుకునేలా పోరాటం కొనసాగిస్తున్నాడు. నటుడిగా నిలదొక్కుకోవడం అతని జీవిత ఆశయం.
---------------
తేజరాజు, రైల్వే కొడూరు సమీపంలోని బొమ్మరం అనే చిన్న గ్రామానికి చెందినవాడు. BA ఎలక్ట్రానిక్స్ చదివాడు. సినిమా రంగంలోకి రావడానికి అతనికి ప్రేరణ రెబల్ స్టార్ ప్రభాస్. వయసు 18 ఏళ్లు ఉన్నప్పుడే ఇండస్ట్రీలోకి రావాలనుకున్నాడు. కానీ కుటుంబ పరిస్థితుల వల్ల చదువు పూర్తి చేసి, ఉద్యోగం చేయాలని పెద్దలు చెప్పారు. చివరకు ఒక రోజు తాను నిర్ణయం తీసుకుని, సినిమాలవైపు తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. 2021లో హైదరాబాద్ వచ్చి, ఎన్నో ప్రయత్నాలు చేశాడు. అయితే ఆ ప్రయత్నాల్లో ఒక దశలో తన నమ్మకాన్ని కోల్పోయాడు.
మళ్లీ తనకి కాస్త నమ్మకం కలిగించిన ప్రాజెక్ట్ "మయసభ".
--------------
గిరియశ్వర్ధన్, తిరుపతిలోని S.V University లో గణిత శాస్త్రంలో M.Sc. పూర్తి చేశాడు. చిన్నప్పటినుంచి సినిమాలపై ఆసక్తి ఉన్నా, ముందు చదువులు పూర్తి చేయాలన్న తండ్రి సూచనను గౌరవించి డిగ్రీ పూర్తిచేశాడు. కాలేజీ రోజుల్లో సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ, స్టేజ్ నాటకాల్లో నటించాడు.
అంతే కాకుండా, సౌత్ జోన్ యూత్ ఫెస్టివల్స్‌లో తన కాలేజీకి ప్రాతినిధ్యం వహించి ఆత్మవిశ్వాసాన్ని పెంచుకున్నాడు. తర్వాత హైదరాబాద్కి వచ్చి, యూట్యూబ్ వీడియోలు, ఆడిషన్లు, ఇండస్ట్రీ ఈవెంట్స్ attended చేస్తూ తనను పరిచయం చేసుకునే ప్రయత్నం చేశాడు. ఆ పట్టుదలతో కొన్ని సినిమాల్లో చిన్న పాత్రలు, అలాగే అసోసియేట్ డైరెక్టర్‌గా పని చేసే అవకాశం కూడా దక్కింది.
మయసభ కోసం తనని ఎంపిక చేసిన కారణం—రాయలసీమ శైలిలో మాట్లాడగలగడం.
షూటింగ్ సెట్లో త్వరగా ఇతర నటులతో బంధం ఏర్పరుచుకుని, తన పాత్రను చాలా బాగా పోషించాడు.
----------
లేక్య ఎన్నో ఆడిషన్లు ఇచ్చింది, రిజెక్షన్లు ఎదుర్కొంది. ఎన్నో సార్లు తన మీద తనకి నమ్మకం పోయేలా అనిపించింది—"ఈ యాక్టింగ్ కల కోసం ఇంతగా పోరాడడం అవసరమా?" అని అనిపించిన రోజులూ ఉన్నాయి. చాలా మంది ఆశావహ నటీమణుల లాగే, తన సినీ ప్రయాణం కూడా ఒక ఆశతో మొదలైంది. కానీ దానిలో రిజెక్షన్ అనే పాఠం చాలా కఠినంగా ఎదురైంది. ప్రతి ఫెయిల్డ్ ఆడిషన్ కూడా వ్యక్తిగతంగా బాధించేది —even if it wasn’t personal. ప్రాక్టికాలిటీ (వాస్తవ జీవితం) vs ప్యాషన్ (కలలు) మధ్య ఆమె నిలకడగా నడవలేని స్థితి. కానీ ఈ ఎమోషనల్ అప్ అండ్ డౌన్స్ మధ్యలోనే, లేక్య సహనం, ఓర్పుటు పాటు, తనలోని బలాన్ని తెలుసుకుంది. ఆ పోరాటాలే ఆమెను మలుస్తూ వచ్చాయి.
ఎన్నో రిజెక్షన్ల తర్వాత, ఒక రోజు ఒక ఆడిషన్ సక్సెస్ అయ్యింది—మయసభ ప్రయాణం మొదలైంది.
-------
రుచిత నిహాని, వరంగల్ దగ్గరలోని ధర్మరావుపేట గ్రామానికి చెందిన అమ్మాయి. మధ్య తరగతి కుటుంబం నుండి వచ్చినా, ఆమె కలలు మాత్రం ఎప్పుడూ పెద్దవే. చిన్నప్పటినుంచే సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనేది, స్టేజ్ మీద ప్రదర్శన ఇవ్వడం అంటే ప్రాణం. డిప్లొమా (సివిల్ ఇంజినీరింగ్) పూర్తయ్యాక, B.Tech కోసం హైదరాబాద్కి వచ్చింది. అదే సమయంలో టెలికాలర్, తరువాత అసిస్టెంట్ ఇంజినీర్ గా పార్ట్ టైం జాబ్స్ చేస్తూ చిన్న వయసులోనే ఆర్థిక స్వావలంబన సాధించింది. COVID లాక్‌డౌన్ సమయంలో తన నిజమైన ప్యాషన్ యాక్టింగ్ అని గ్రహించింది. అప్పటి నుంచి ఆడిషన్‌లు ఇవ్వడం మొదలుపెట్టింది. కానీ మొదటి అనుభవాలు చాలా నిరుత్సాహపరిచాయి—బ్యాక్గ్రౌండ్ రోల్ లేక్ పరిమితం చేసేవారు, తన రంగు మీద చాలా అవమానకరమైన వ్యాఖ్యలు ఎదుర్కునేది. ఆ బాధలో తన పట్టుదల కోల్పోలేదు. ఇంకా ధైర్యంగా ముందుకెళ్లింది. ఫైనాన్సియల్ స్టెబిలిటీ కోసం మేకప్ ఆర్టిస్ట్గా పని చేసి, ఒక ఆన్‌లైన్ బుటిక్ కూడా మొదలుపెట్టింది. రిజెక్షన్లు ఎదురైనా తన లక్ష్యాన్ని వదలలేదు. అంతే కాదు, ఆమెకి తొలి బ్రేక్ మట్టికథ సినిమాతో వచ్చింది. అక్కడ్నుంచి యశోదా, ఊరుపేరు భైరవకొన, మొతేవారి లవ్ స్టోరి, పొట్టెల్, సరిపోదసనివారం వంటి సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. పొట్టెల్ సెట్లో ఆమెతో కలిసి పనిచేసిన శ్రీకాంత అయ్యంగార్, మయసభ కోసం ఆడిషన్ ఇవ్వమని ప్రోత్సహించారు.
ఆ ఆడిషన్ తో పోతినేని రమేష్ చెల్లెల్లలో ఒకరిగా చేరింది. రుచిత నిహాని ఇప్పుడు క్రమంగా ఎదుగుతున్న నటిగా పేరు తెచ్చుకుంటోంది—శ్రమ, అభిరుచి, మరియు నటనపై ప్రేమ తనని ముందుకు నడిపిస్తున్నాయి.