pizza

“Every person is a walking story” - Mayasabha articles
“ప్రతి మనిషీ నడయాడే కథ!” – మయసభ వ్యాసాలు
- Deva Katta

Article #15: Direction Department
ఆర్టికల్ #15: డైరెక్షన్ డిపార్ట్మెంట్

You are at idlebrain.com > news today >

31 August 2025
Hyderabad

“Every person is a walking story” - Mayasabha articles
“ప్రతి మనిషీ నడయాడే కథ!” – మయసభ వ్యాసాలు
- Deva Katta


Introduction
Behind Mayasabha’s success are underdogs whose grit and passion kept them chasing cinema against all odds. This article series celebrates those journeys—how each cast and crew member was chosen, the struggles that shaped them, and how one project’s nationwide acclaim became the turning point of their careers. Because every person you meet is a walking story—sometimes all it takes is one opportunity for the world to listen.

మయసభ విజయం వెనకున్న సైన్యం, సంవత్సరాలుగా కష్టాలు, అడ్డంకులు ఎదుర్కొంటూ సినిమా తప్ప వేరే జీవితమే లేదని బతుకుతున్న అండర్‌డాగ్స్. వారి ప్రయాణానికి నివాళిగా ఈ వ్యాసాలు రాస్తున్నాను. వారిని తీర్చిదిద్దిన జీవిన పోరాటాలు, మయసభలో వారి ఎలా ఎంపిక, ఈ విజయంలో వారి పాత్ర ఈ వ్యాసాల్లో ప్రధాన అంశాలు. ప్రతి మనిషి ఒక నడిచే కథ—ఆ కథని ప్రపంచం వినడానికి, ఒకే ఒక్క అవకాశం చాలు.

Don’t encourage piracy. Please watch #Mayasabha only on SonyLiv

1. Karthik: From technology to cinema:

Karthik began his career in technology before finding his true calling in cinema. After completing his B.Tech, he worked as a software engineer for two years—an experience that instilled in him a strong and disciplined work ethic. His creative drive eventually led him to pursue film studies in Delhi, where he immersed himself in the craft of filmmaking. His journey in the film industry started as an Assistant Editor, working on three feature films and gaining invaluable hands-on experience in shaping stories at the editing table. He later collaborated closely with director Praveen Sattaru, contributing to three of his films. Brought into the Republic direction department by then first AD and writer-partner Kiran Jay Kumar, Karthik was trained in scheduling by Kiran and later promoted to be the First AD for Mayasabha.

Karthik worked tirelessly under extreme resource limitations compared to standard film productions. He deserves major credit for helping us complete Mayasabha (almost the length of three films, including songs and action sequences) within just 89 days. His sharp acumen in scheduling and managing the set proved to be a vital asset.

Each project has strengthened Karthik’s vision as a filmmaker and reinforced his belief that cinema is not just a profession but a lifelong journey of learning, storytelling, and facing new challenges every day.

-------------------------------

2. Bhargav Tetali (Bobby):

Bobby’s (Bhargav Tetali) passion for cinema goes back as far as he can remember. By the time he reached 10th grade, he had already watched countless films. He was such a regular at the theatre that even the ticket sellers and canteen staff knew him—and sometimes scolded him for showing up so often. But he didn’t care; he was there to absorb and dream. When a teacher once asked what he wanted to become, Bobby replied without hesitation:

“A director — I’ll make Barrister Parvateesam into a film.” That moment set his course.

Through a friend’s reference, he joined as an Assistant Director on Nuvva Nena, which gave him his first taste of life on set. After that, he went through a long stretch without consistent work, taking up short stints just to stay connected to cinema. His turning point came with Anil Ravipudi’s Patas, a blockbuster that boosted his confidence. Later, he worked with Praveen Sattaru on PSV Garuda Vega, where he learned the importance of precision in filmmaking. He joined our team with Republic and was phenomenal at commanding the set—organising background activities and controlling even the largest crowds with ease. After Republic, he went on to join Director Shankar’s team for Game Changer.

Bobby returned to Mayasabha and shared responsibilities with Karthik as First AD. Their different skill sets complemented each other, making them a solid duo who brought clarity, speed, and full control to the shoot. Watching them, I realised how vital the role of a First AD is in enabling the director to focus on creative output while maximising limited resources.

Bhargav’s dream is to become a director. He is already working on some exciting scripts and waits for the right moment to step into the director’s chair—knowing he’ll be ready when the time comes.

-------------------------

3. Aarthi: From numbers to design

Aarthi — Costume Designer + AD — began her academic journey with a Bachelor’s in Statistics, but storytelling was always her true calling. To step closer to cinema, she chose Fashion Designing, which became her gateway into films through costumes. From her very first reputed project, she discovered the joy of turning threads into stories and the magic of bringing characters to life through fabric and design. Several more projects followed, each deepening her craft.

This path eventually led her to Mayasabha, where she initially worked as an assistant director but soon realized that costumes were where her heart truly belonged. Though she explored other career opportunities along the way, the pull of designing never left her—it constantly reminded her that her identity was rooted in costumes.

For Aarthi, Mayasabha was not just another project but a turning point. She found renewed inspiration in overcoming the challenges of limited budgets, tight schedules, and heavy volume. The project didn’t just give her experience—it reaffirmed that storytelling through costumes isn’t just what she does; it is who she is, and it will always remain her way of telling stories.

----------------------------

4. Puneeth: Eighteen year old’s dreams

Puneeth Charan Abbagoni’s journey into the film industry began six years ago when, at the age of 18, he left his Chartered Accountancy course to follow his passion for cinema.

We brought him into Mayasabha as an intern initially, but with his availability, commitment, and passion, he soon became the go-to person for everything and anything for the first ADs. He worked tirelessly, and I often worried that his obsessive dedication might affect his health. From pre-production all the way up to final mastering, he was present at every step. Remarkably, he even completed his MBA in parallel during our pre-production phase.

Working on Mayasabha under so many limitations and challenges compared to cinema was an incredible learning experience for Puneeth—one that sharpened his perspective on filmmaking. For him, Mayasabha is not just a project but a redefining journey he will always cherish.

----------------------------------

5. Aravind: Dark to light

Aravind, a passionate film lover with no family background in cinema, grew up discovering his calling in dark theatres, late-night screenings, and long conversations about movies. From making small short films to writing scripts that never took off, his journey was filled with setbacks—but each failure taught him something and pushed him closer to his dream.

After years of struggle, he joined Mayasabha as an AD, a turning point that made all the hardships worthwhile. Initially overwhelmed by the scale of the project, he soon adapted, learning not only filmmaking techniques but also collaboration, discipline, and patience. The experience gave him invaluable practical knowledge and the confidence to face bigger challenges.

Wishing all my “dreamers’ army” to realize their dreams sooner rather than later, and I remain committed to helping them in every way I can within my capacity.

Don’t encourage piracy. Please watch #Mayasabha only on SonyLiv

“ప్రతి మనిషీ నడయాడే కథ!” – ఆర్టికల్ #15: డైరెక్షన్ డిపార్ట్మెంట్

1. కార్తిక్: టెక్నాలజీ నుంచి సినిమాకు

కార్తిక్ తన కెరీర్‌ను ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా మొదలుపెట్టాడు. B.Tech పూర్తయిన తర్వాత రెండు సంవత్సరాలు సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేశాడు. ఆ అనుభవం వల్ల అతనికి క్రమశిక్షణ వచ్చింది.

కానీ లోపల ఉన్న సృజనాత్మకత అతనిని సినిమాలవైపు లాక్కెళ్లింది. ఢిల్లీలో ఫిల్మ్ స్టడీస్ చేసి, సినిమాని లోతుగా అర్థం చేసుకున్నాడు. మొదట అసిస్టెంట్ ఎడిటర్‌గా మూడు ఫీచర్ ఫిల్మ్స్‌లో పనిచేశాడు. ఆ తరువాత దర్శకుడు ప్రవీణ్ సత్తారుతో కలిసి మూడు సినిమాలు చేశాడు.

'రిపబ్లిక్' సినిమాకి అప్పటి నా ఫస్ట్ AD అయిన కిరణ్ కుమార్ పరిచయం చేశాడు. ఆ పరిచయం, రిపబ్లిక్ లో తన పని తీరు మయసభకి ఫస్ట్ AD అవ్వడానికి దారితీసింది. కార్తిక్ అనుకున్నదానికంటే తక్కువ వనరులతో మయసభను 89 రోజుల్లో పూర్తి చేయడంలో కీలకపాత్ర పోషించాడు. పాటలు, యాక్షన్ సన్నివేశాలు ఉన్న భారీ ప్రాజెక్ట్‌ను సమర్ధంగా మేనేజ్ చేశాడు. సినిమా అనేది కేవలం ఉద్యోగం కాదు, ఒక జీవన యానం అని అతని ప్ర‌తీ అడుగు నిరూపించింది.

------------------------

2. భార్గవ్ (బాబీ): థియేటర్‌ కలలు, సెట్స్‌పై నిజాలు

భార్గవ్్ టేటాలి, చిన్నప్పటి నుంచే సినిమాల పట్ల ఆరాటం ఉన్నవాడు. పదో తరగతిలో ఉండగానే వందల సినిమాలు చూశాడు. థియేటర్లలో టికెట్ అమ్మేవాళ్లు, కెంటీన్ స్టాఫ్ కూడా అతన్ని గుర్తుపట్టే స్థాయికి వచ్చారు! ఒక రోజు టీచర్ “ఏమవాలనుకుంటున్నావు?” అంటే, “డైరెక్టర్ అవుతాను. ‘బారిస్టర్ పరవతీశం’ సినిమాగా తీయాలి”అన్నాడు.

‘నువ్వా నేనా’ సినిమా ద్వారా అసిస్టెంట్ డైరెక్టర్‌గా మొదలయ్యాడు. తర్వాత కొంతకాలం స్ట్రగుల్. 'పటాస్' సినిమా అతనికి మలుపు ఇచ్చింది. PSV గరుడవేగ ద్వారా ప్రెసిషన్ అంటే ఏమిటో నేర్చుకున్నాడు. ‘రిపబ్లిక్’లో మా టీమ్‌లో చేరి క్రౌడ్ మేనేజ్‌మెంట్, సెట్స్ హ్యాండ్లింగ్‌లో మెరిపించాడు. తర్వాత 'గేమ్ ఛేంజర్' కోసం శంకర్ గారి టీమ్‌లో చేరాడు.

తర్వాత మళ్లీ మయసభ కోసం తిరిగి వచ్చి, కార్తిక్‌తో కలిసి ఫస్ట్ AD బాధ్యతలు నిర్వహించాడు.

తన కల – డైరెక్టర్ కావడం. మంచి స్క్రిప్ట్స్ రెడీ చేసుకుంటున్నాడు. తొందర్లోనే తన లక్ష్యం చేరుకుంటాడు.

-------------------------

3. ఆర్తి: నంబర్ల నుంచి డిజైన్ వరకు

ఆర్తి స్టాటిస్టిక్స్‌లో డిగ్రీ చేసింది. కానీ ఆమె నిజమైన ఆసక్తి సినిమా. అందుకే ఫ్యాషన్ డిజైన్ వైపు వచ్చి సినిమాల్లోకి అడుగుపెట్టింది. తొలి ప్రాజెక్ట్ నుంచే ఆమెకు ‘అద్దంలో మనస్సు’ చూపే కళ ఎలా ఉంటుందో తెలిసింది. పాత్రలకి తగినట్టు వస్త్రాల రూపకల్పనలో అసలు మాయ ఉంది అని తెలుసుకుంది.

మయసభలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా మొదలుపెట్టినా, కాస్ట్యూమ్స్ చేయడంలోనే తన ప్రాణం ఉందని తెలుసుకుంది. తక్కువ బడ్జెట్, టైట్ డెడ్‌లైన్లలో కూడా అద్భుతంగా డిజైన్ చేసి ప్రాజెక్ట్‌ను అందంగా చేసింది. ఆమెకు కాస్ట్యూమ్స్ అనేవి ఉద్యోగం కాదు — ఆమె కథలు చెప్పే భాష.

------------------

4. పునీత్ చరణ్ అబ్బగోని: 18 ఏళ్ల కుర్రాడి ‘కలలు’

పునీత్ చరణ్ సినిమాల పట్ల ఉన్న ఆసక్తితో చార్టెడ్ అకౌంటెన్సీ మధ్యలోనే మానేశాడు. మయసభలో మొదట ఇంటర్న్‌గా వచ్చాడు. కానీ ప్రతి పని చేయడంలో అగ్రగామి అయ్యాడు. పని పిచ్చితో ఒక్కోసారి ఆరోగ్యం పాడు చేసుకుంటాడేమో అనే కన్సర్న్ కూడా అనిపించేది.

మయసభ ప్రీ-ప్రొడక్షన్ నుంచి మాస్టర్ ఫైనల్ అవ్వేవరకూ ప్రతి అడుగునా ఉండే వాడు.

ఇంటర్న్‌గా వచ్చిన తను, చివరికి అసలు ప్రాజెక్ట్‌ను డిఫైన్ చేసిన టీమ్‌లో భాగమయ్యాడు.

ఈ ప్రయాణం పునీత్‌కి కేవలం పని కాదు – జీవితాన్ని మార్చిన పాఠశాల.

------------------------

5. అరవింద్: డార్క్ నుంచి లైట్‌లోకి

అరవింద్ సినిమాల పట్ల ఉన్న ప్రేమతో, కుటుంబంలో ఎవరూ సినిమా బ్యాక్‌గ్రౌండ్ లేకపోయినా, తాను తీయాలనుకున్న స్క్రిప్ట్స్ మీద పని చేశాడు. చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ తీశాడు. అనుకున్న స్క్రిప్ట్స్ టేక్ ఆఫ్ అవకపోయినా బాధపడలేదు. ఫెయిల్యూర్స్ అన్నిటినీ పాఠాలుగా తీసుకుని తన ప్రయాణాన్ని కొనసాగించాడు.

మయసభలో ADగా చేరడం అతని కెరీర్‌లో టర్నింగ్ పాయింట్. ఆరంభంలో ప్రాజెక్ట్ స్కేలు చూసి భయపడ్డా – త్వరగా అడాప్ట్ అయిపోయాడు. క్రమశిక్షణ, కోఆర్డినేషన్, పేషెన్స్ లాంటి విలువల్ని నేర్చుకున్నాడు. ఇది అనుభవమే ఒక విజయంగా భావిస్తున్నాడు.

పై అందరినీ నేను "డ్రీమర్స్ ఆర్మీ" అని పిలుస్తాను. వాళ్ల కలలు త్వరగా నెరవేరాలని ఆశిస్తున్నాం. మా వంతు సాయం ఎప్పుడూ ఉంటుంది.

పైరసీ ని అరికట్టండి. సోనీ లివ్ లో “మయసభ” చూడండి!

- Deva Katta

Other articles from "Mayasabha - Every Person is a Walking Story series:

14.Nageswaar, Bhanu Prasad, Angadi Raghavendra, Narayana, Teja Raju, Giriyashvardhan, Lekya, Ruchitha Nihani
13.Parth Ganesh & Sivayya
12.Devi Sri & Ambika Yashraj
11.Charitha Varma & Yasho Bharath
10.Pranav Preetham & Phanindra Devarapalli
9.Sakul Sharmaa & Rohit Satyan
8.Bhavana
7.Ravindra Vijay
6.Shankar Mahanthi
5.Sai Kumar
4.Shatru
3.Tanya Ravi Chandran
2.Chaitanya Rao
1.Aadhi Pinisetty



Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2025 Idlebrain.com. All rights reserved