“Every person is a walking story” - Mayasabha articles
“ప్రతి మనిషీ నడయాడే కథ!” – మయసభ వ్యాసాలు
- Deva Katta
Introduction
Behind Mayasabha’s success are underdogs whose grit and passion kept them chasing cinema against all odds. This article series celebrates those journeys—how each cast and crew member was chosen, the struggles that shaped them, and how one project’s nationwide acclaim became the turning point of their careers. Because every person you meet is a walking story—sometimes all it takes is one opportunity for the world to listen.
మయసభ విజయం వెనకున్న సైన్యం, సంవత్సరాలుగా కష్టాలు, అడ్డంకులు ఎదుర్కొంటూ సినిమా తప్ప వేరే జీవితమే లేదని బతుకుతున్న అండర్‌డాగ్స్. వారి ప్రయాణానికి నివాళిగా ఈ వ్యాసాలు రాస్తున్నాను. వారిని తీర్చిదిద్దిన జీవిన పోరాటాలు, మయసభలో వారి ఎలా ఎంపిక, ఈ విజయంలో వారి పాత్ర ఈ వ్యాసాల్లో ప్రధాన అంశాలు. ప్రతి మనిషి ఒక నడిచే కథ—ఆ కథని ప్రపంచం వినడానికి, ఒకే ఒక్క అవకాశం చాలు.
Shiva Kamesh entered the Telugu film industry in 1999. His deep passion for cinema naturally led him to the world of art direction, the department that lays the visual foundation for storytelling through production design.
Over the years, he worked as an Assistant Art Director on a wide range of films—mass entertainers like Oosaravelliand Julayi, a socio-fantasy like Anaganaga Oka Dheerudu, a war drama like Kanche, and historical epics such as Gautamiputra Satakarni and Manikarnika. These projects opened up new worlds and perspectives for him.
Later, Shiva Kamesh made his mark as an Art Director on films like NTR – Kathanayakudu (a biographical drama), Gandeevadhari Arjuna, Arebia Kadali, Tuck Jagadish, Macherla Niyojakavargam, and Maestro.
Recognizing how valuable his experience could be for a period political drama, we entrusted him with the role of Production Designer for Mayasabha. From the moment he heard the story, Kamesh immersed himself into the world with immense excitement. Driven by the desire to capture even the scent of the era, he conducted meticulous research on everything—pens, papers, vehicles, books, calendars, household items, clothing, and lifestyle used during that time.
Sleepless nights, countless journeys, and painstaking research all culminated in a rewarding moment when Mayasabhawas released and embraced by the audience. In Kamesh’s own words: “Mayasabha is not just a film, it’s a time-travel. I consider it my fortune to have been part of that journey.”
--------------------------
Tirumala, born in Karimnagar district of erstwhile Andhra Pradesh, spent his formative years in a rural environment, observing society while studying up to his SSC. His passion for fine arts led him to pursue Intermediate at a Government College in Manchiryal, where he was an active student leader in AISF and explored his interests in drawing and painting.
For higher studies, he moved to Hyderabad, where he secured 7th rank in the JNTU entrance exam and joined BFA (Painting). Alongside academics, he began working at ETV to earn pocket money. Around the same time, he was introduced to the world of cinema through Cine Friends, which marked his entry into the film industry.
His cinematic journey began with Pawan Kalyan’s “Tholiprema”, where he worked on painting 1000 cards for Keerthi Reddy’s scene. After completing his MFA, he participated in national and international painting exhibitions and camps. Early in his career, he had the rare opportunity to work with top filmmakers, especially Bapu–Ramana, which remains one of his most cherished memories.
As an art director, Tirumala has worked on over ten films. His realistic and rooted art design for the Telangana-based rural film Balagam was noteworthy, even though it didn’t bring him widespread recognition. However, working on the historical film Razakar earned him both reputation and respect. While riding that wave of enthusiasm, he got the opportunity to join the Mayasabha project.
Working on Mayasabha was nothing short of a battle—navigating historical backdrops, tight timelines, and budget constraints. Tirumala approached each set by preparing three versions (Low, Medium, High budget) and consulting with the team before implementing the most viable one. One of the most remarkable feats was completing the Assembly set in just three days, a testament to his planning and execution skills.
In his view, this "three-option approach" served as a bridge to achieve high-quality results under pressure. His designs for key locations such as the Assembly, IRA Office, President of India’s Office, KKN’s Office, Sandeep Basu’s Office, RCR House, college premises, party meetings, and trade union office were not only visually striking but also budget-conscious, providing immense strength to the project.
Despite the pressures of limited budget and time, Tirumala, along with fellow production designer Kamesh, delivered incredible output with tireless dedication and a smile on his face. We hope that their phenomenal work in Mayasabhaopens the doors to many more remarkable opportunities in the future.
“ప్రతి మనిషీ నడయాడే కథ!” – ఆర్టికల్ #16: శివ కామేష్ & తిరుమల (ప్రొడక్షన్ డిజైనర్స్)
శివ కామేష్ 1999లో తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు. సినిమా మీదున్న అపారమైన ఇంట్రెస్ట్ తనని కదా చెప్పడానికి పునాది ఐన చిత్ర కళను సృష్టించే ఆర్ట్ డైరెక్షన్ విభాగంలోకి తీసుకెళ్లింది. ‘ఊసరవెల్లి’, ‘జులాయి’ వంటి కాంటెంపరరీ మాస్ ఎంటర్‌టైనర్స్, ‘అనగనగా ఒక ధీరుడు’ వంటి సోషియో-ఫాంటసీ, ‘కంచె’ లాంటి యుద్ధగాథ, ‘గౌతమీ పుత్ర శాతకర్ణి’, ‘మనికర్ణిక’ వంటి హిస్టారికల్ డ్రామాలు—ఈ సినిమాల్లో అసిస్టెంట్ ఆర్ట్ డైరెక్టర్‌గా చేసిన అనుభవం ఆయనకు కొత్త ప్రపంచాన్ని పరిచయం చేసింది.
ఆ తరువాత ‘ఎన్‌టిఆర్ – కథానాయకుడు’ వంటి బయోగ్రాఫికల్ డ్రామా, ‘గాండీవదారి అర్జున’, ‘అరేబియా కడలి’, ‘టక్ జగదీష్’, ‘మాచర్ల నియోజకవర్గం’, ‘మేస్ట్రో’ వంటి చిత్రాలకు ఆర్ట్ డైరెక్టర్‌గా తన ముద్ర వేశారు.
మా పీరియడ్ పొలిటికల్ డ్రామాకి తన అనుభవం చాలా ఉపయోగపడుతుందని గ్రహించి ‘మయసభ’లో ప్రొడక్షన్ డిజైజర్ బాధ్యతలు అప్పగించాం. కథ విన్నప్పట్నుంచి, కామేష్ మా ప్రపంచంలో లీనమై చాలా ఎక్సైట్మెంట్ తో పని చేసారు. ఆ కాలపు గాలి వాసన వరకు పట్టుకోవాలనే తపనతో, పెన్ను, పేపర్ నుండి వాహనాలు, పుస్తకాలు, క్యాలెండర్లు, ప్రజలు వాడిన వస్తువులు, జీవనశైలి...ఇలా ప్రతి అంశం మీదా లోతైన రీసెర్చ్ చేశారు. నిద్రలేని రాత్రులు, లెక్కలేనన్ని ప్రయాణాలు, కష్టసాధ్యమైన పరిశోధన—తన కృషి అంతా ‘మయసభ’ విడుదలై ప్రేక్షకుల ఆదరణ పొందిన క్షణం ఒక మధురస్మృతిగా మారిపోయింది. శివ కామేష్ మాటల్లో—“మయసభ కేవలం సినిమా కాదు, అది ఒక కాలయానం. ఆ యాత్రలో భాగమవడం నా అదృష్టం.”
--------------------
తిరుమల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని కరీంనగర్ జిల్లాలో జన్మించి, SSC వరకు గ్రామీణ వాతావరణంలోనే చదువుకుంటూ సమాజాన్ని గమనించడం నేర్చుకున్నాడు. లలితకళలపై ఉన్న ఆసక్తి కారణంగా, మంచిర్యాలలోని ప్రభుత్వ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతూ AISFలో క్రియాశీలక విద్యార్థిగా ఉండి, డ్రాయింగ్స్, పెయింటింగ్స్ చేస్తూ ముందుకు సాగాడు. పై చదువుల కోసం హైదరాబాద్ వచ్చి, JNTU ఎంట్రన్స్‌లో 7వ ర్యాంక్ సాధించి, BFA (Painting)లో ప్రవేశం పొందాడు. చదువుతో పాటు పాకెట్ మనీ కోసం ఈటీవీలో పనిచేయడం ప్రారంభించాడు. అదే సమయంలో Cine Friends పరిచయమై, సినిమా తల్లి ఒడిలోకి అడుగుపెట్టాడు.
పవన్ కళ్యాణ్ గారి “తొలిప్రేమ” చిత్రంతో (కీర్తి రెడ్డి పెయింటింగ్ 1000 కార్డులపై) ఆయన సినీ ప్రయాణం మొదలైంది. ఆ తర్వాత MFA పూర్తి చేసి, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పెయింటింగ్ ఎగ్జిబిషన్స్, క్యాంపుల్లో పాల్గొన్నాడు. కెరీర్ ప్రారంభంలోనే అగ్రదర్శకులతో పని చేసే అవకాశం రావడం, ముఖ్యంగా బాపు–రమణలతో పనిచేయడం ఆయన జీవితంలో మరపురాని జ్ఞాపకం.
ఆర్ట్ డైరెక్టర్‌గా పదికి పైగా సినిమాల్లో పనిచేసిన ఆయన, బలగం వంటి తెలంగాణ గ్రామీణ వాతావరణం ఆధారంగా తీసిన సినిమాకు వాస్తవికతతో కూడిన ఆర్ట్ వర్క్ అందించాడు. అయితే పెద్దగా గుర్తింపు రాకపోయినా, రజాకార్ వంటి చారిత్రక చిత్రంలో పని చేయడం తనకి మంచి పేరు ప్రతిష్టలు తెచ్చి పెట్టింది. అదే ఉత్సాహం కొనసాగుతున్న సమయంలో, మయసభ ప్రాజెక్ట్‌లో భాగమయ్యే అవకాశం వచ్చింది.
మయసభలో పనిచేయడం ఎన్నో సవాళ్లతో కూడిన ఒక యుద్ధం. చారిత్రక నేపథ్యం, సమయపరిమితులు, బడ్జెట్ సవాళ్లు—ఎన్ని ఎదురైనా, ప్రతి సెట్‌కు మూడు ఆప్షన్లు (Low, Medium, High Budget) సిద్ధం చేసి, మాతో చర్చించి ఉత్తమ మార్గాన్ని అమలు చేసేవాడు. ముఖ్యంగా అసెంబ్లీ సెట్‌ను కేవలం మూడు రోజుల్లో పూర్తి చేయడం ఒక అద్భుతమైనా సాధన.
తిరుమల దృష్టిలో ఈ మూడు ఆప్షన్స్ విధానం తక్కువ సమయంలో అధిక నాణ్యతతో పనిని సాధించడానికి ఒక వంతెనలా నిలిచింది. అసెంబ్లీ, IRA ఆఫీసు, President of India Office, KKN Office, సందీప్ బసు ఆఫీసు, RCR హౌస్, కళాశాల ఆవరణ, పార్టీ మీటింగ్స్, ట్రేడ్ యూనియన్ ఆఫీస్ వంటి కీలక సన్నివేశాల రూపకల్పనలో తిరుమల అప్రోచ్ ఎంతో క్రియేటివ్ గా బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉండడం ప్రాజెక్ట్ కి ఎంతో బలాన్నిచ్చింది.
బడ్జెట్ లిమిటేషన్స్, టైం లిమిటేషన్స్ తో పాటు ఎన్నో ఒత్తిళ్లు తట్టుకుని నవ్వు మొహంతో రాత్రింబవళ్ళు ఎనలేని కమిట్మెంట్ తో మయసభకు ఇంత విలువైన ఔటపుట్ నీ ఇచ్చిన ప్రొడక్షన్ డిజైనర్స్ శివ కామేష్ మరియు తిరుమలకు మరెన్నో గొప్ప అవకాశాలు రావాలని ఆశిస్తున్నాం.