pizza

“Every person is a walking story” - Mayasabha articles
“ప్రతి మనిషీ నడయాడే కథ!” – మయసభ వ్యాసాలు
- Deva Katta

Article #17: Nagi (EP) & Sri Chow (LP)
ఆర్టికల్ #17: నాగి & శ్రీ చౌదరి

You are at idlebrain.com > news today >

2 September 2025
Hyderabad

“Every person is a walking story” - Mayasabha articles
“ప్రతి మనిషీ నడయాడే కథ!” – మయసభ వ్యాసాలు
- Deva Katta


Introduction
Behind Mayasabha’s success are underdogs whose grit and passion kept them chasing cinema against all odds. This article series celebrates those journeys—how each cast and crew member was chosen, the struggles that shaped them, and how one project’s nationwide acclaim became the turning point of their careers. Because every person you meet is a walking story—sometimes all it takes is one opportunity for the world to listen.

మయసభ విజయం వెనకున్న సైన్యం, సంవత్సరాలుగా కష్టాలు, అడ్డంకులు ఎదుర్కొంటూ సినిమా తప్ప వేరే జీవితమే లేదని బతుకుతున్న అండర్‌డాగ్స్. వారి ప్రయాణానికి నివాళిగా ఈ వ్యాసాలు రాస్తున్నాను. వారిని తీర్చిదిద్దిన జీవిన పోరాటాలు, మయసభలో వారి ఎలా ఎంపిక, ఈ విజయంలో వారి పాత్ర ఈ వ్యాసాల్లో ప్రధాన అంశాలు. ప్రతి మనిషి ఒక నడిచే కథ—ఆ కథని ప్రపంచం వినడానికి, ఒకే ఒక్క అవకాశం చాలు.

Don’t encourage piracy. Please watch #Mayasabha only on SonyLiv

Nagi (N93) – our Executive Producer was born into the film industry, though not in the glamorous way people often imagine. His father has long worked as a production assistant, often serving food on movie sets. Watching his father’s dedication taught him an early lesson: no job is small, and every role matters in cinema.

He began his own career as an office boy, taking up the smallest tasks behind the scenes. But instead of treating it as mere work, he observed, learned, and carried out every role with honesty—a quality that became his greatest strength. Step by step, he grew through the ranks, taking on responsibilities as production assistant, photographer, assistant director, manager, line producer, and eventually Executive Producer, managing entire projects and leading teams. Alongside his work, Nagi also invested in learning. He earned an MBA, which honed his management and leadership skills, and later pursued a Diploma in Screenwriting, which deepened his passion for storytelling. His journey reinforced his belief that opportunities are often bigger than the skills one currently has—and that persistence, humility, and dedication are what enable growth.

While his father accepted life as it came, Nagi dared to dream bigger. Guided by perseverance, he believes wholeheartedly in the universe: if one asks sincerely, the universe will respond. This belief has driven him to pursue his ultimate dream of becoming a director. For him, working on Mayasabha as an Executive Producer marked a golden midpoint on that journey, offering both responsibility and inspiration. No matter what time of the day or night you message him, you find an answer within 30 seconds. Lot of times I ask if he ever sleeps at all. Sometimes I doubt if he is human or a ghost 

Nagi carries a philosophy that identity transcends labels. Since names often carry caste or religious associations, he chose to call himself N93 (N Nynthri), a reminder that he belongs not to any community but to the universe itself.

--------------------------

Sri Chowdary Inaganti, line producer of Mayasabha, was born in a small village called Nimmagaddavari Palem in Guntur district. His parents, who came from a modest farming background, naturally hoped that he would pursue engineering and secure a good software job. In line with their wishes, he completed his engineering and went on to pursue his Master’s degree in the UK. Later, he worked in the IT sector in Hyderabad. His parents were proud and villagers often spoke highly of their accomplished son.

However, Sri Chowdary’s deep-rooted passion for cinema, which had been with him since childhood, never left him. The emotional impact of watching good films and the desire to one day create such stories himself continued to chase him. Eventually, he could no longer suppress his calling. He quit his stable job and stepped into the world of cinema. This decision initially brought criticism from his family and ridicule from villagers, but he didn’t back down. He began with short films and, after two years of hard work, got his first break as a Production Controller for a small feature film. He firmly believed:

“If your desire is strong and your effort is sincere, you’ll reach your goal.”

A testament to that belief was his opportunity to work on Mayasabha, where he served as an Line Producer. Seeing his name appear as a single card credit on screen was a proud moment. The insults once faced in his village were replaced with admiration after the release of the series. Mayasabha became a turning point in his film journey.

Nagi and Sri, are like two eyes and two legs to our producer Vijaya Krishna, working day and night without rest as the first commanders in his battle. They helped win that battle—and in doing so, won for themselves as well.

Wishing these two dedicated and trustworthy professionals, who believe in living just one life doing what they love—no matter how hard it gets—many more bigger opportunities in the future.

Don’t encourage piracy. Please watch #Mayasabha only on SonyLiv

“ప్రతి మనిషీ నడయాడే కథ!” – ఆర్టికల్ #17: నాగి & శ్రీ చౌదరి

నాగి (N93) – మయసభ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్-సినిమా ఇండస్ట్రీలోనే పుట్టి పెరిగాడు. కానీ జనాలు ఊహించేలా గ్లామర్ లో కాదు. నాగి నాన్నగారు చాలా ఏళ్లు సినిమా సెట్లలో ప్రొడక్షన్ అసిస్టెంట్గా పని చేశారు – చాలాసార్లు ఆర్టిస్టులకు భోజనం పెట్టే పని కూడా చేశారు. నాగి సినిమా సెట్లలో తన నాన్నని చూస్తూ పెరిగాడు. చిన్నతనంలోనే నేర్చుకున్న పెద్ద పాఠం – "చిన్న పని పెద్ద పని అనేదేం ఉండదు, సినిమా లో ప్రతి పని అతి విలువైన పనే."

నాగి తన కెరీర్‌ను ఒక ఆఫీస్ బాయ్గా మొదలుపెట్టాడు. చిన్న పనులే అయినా, ఏ మాత్రం చిన్నచూపు లేకుండా మనస్ఫూర్తిగా, నిజాయితీగా చేసేవాడు. అది అతని బలం, గొప్పతనం కూడా. ఒకొక్క మెట్టు ఎదుగుతూ, ప్రొడక్షన్ అసిస్టెంట్, ఫోటోగ్రాఫర్, అసిస్టెంట్ డైరెక్టర్, మేనేజర్, లైన్ ప్రొడ్యూసర్ వంటి భిన్నమైన బాధ్యతలు నిర్వహించాడు. చివరకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అయ్యాడు – టీమ్స్‌ని లీడ్ చేస్తూ, సినిమాలు పూర్తి చేసే స్థాయికి ఎదిగాడు. పనితో పాటు విద్యలోనూ శ్రద్ధ పెట్టాడు. MBA చేసి, తన లీడర్‌షిప్ స్కిల్స్ పెంచుకున్నాడు. తర్వాత స్క్రీన్‌రైటింగ్ లో డిప్లొమా చేసి, కథ చెప్పే పట్ల తన ఆసక్తిని ఇంకా పెంచుకున్నాడు.

నాగి నమ్మకం: "మనకి ప్రస్తుతం ఉన్న స్కిల్స్ కంటే పెద్ద అవకాశాలే జీవితంలో వస్తాయి. వాటిని పట్టుకునే శక్తి – ఓర్పు, వినయం, నిబద్ధత మన దగ్గర ఉండాలి."

తన తండ్రి జీవితం ఎలా వస్తే అలా స్వీకరించగా, నాగి మాత్రం పెద్ద లక్ష్యంతో పెరిగాడు. తన లక్ష్యం– ఏదో ఒకరోజు ఒక మంచి దర్శకుడిగా ఎదగడం. ఈ ప్రయాణంలో మయసభలో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా పనిచేయడం అతనికి ఒక వారధి లాంటి అనుభవం.

ఏ టైమ్‌కి అయినా అతనికి మెసేజ్ చేస్తే, 30 సెకన్లలో రెస్పాన్స్ వస్తుంది.

చాలా సార్లు "నువ్వసలు నిద్రపోతావా ఎప్పుడైనా?" అని అడిగేవాడ్ని.

కొన్నిసార్లు– "ఇతను మనిషేనా? లేక... దెయ్యమా?" అనిపిస్తాడు. 😄

నాగి తత్వం: "మన పేరు అనేది ఒక కమ్యూనిటీనో క్యాస్ట్ నో చూపకూడదు. మన వ్యక్తిత్వాన్ని చూపాలి."

అందుకే, తన పేరును "N93 (N Nynthri)" గా మార్చుకున్నాడు – తనకు ఒక మతం లేదా కులం కాదు, ఈ విశ్వమే తన ఇల్లు అనే గుర్తుగా. పని చిన్నదైనా పెద్దదైనా మనం దానిని చేసే విధానం ఎప్పుడూ పెద్దగా బలంగా ఉండాలి అన్నదే తన సిద్ధాంతం. ఆసక్తి, నిజాయితీ, ఆశయం మీద నమ్మకంతో ముందుకెళ్తే… విశ్వం దానికి స్పందిస్తుందన్నది ఇదివరకు తాకాను జీవితం నేర్పిన పాఠం.

-----------------------

శ్రీ చౌదరి ఇన్నగంటి-మయసభ లైన్ ప్రొడ్యూసర్-గుంటూరు జిల్లాలోని నిమ్మగడ్డవారి పాలెం అనే చిన్న గ్రామంలో పుట్టాడు. సాధారణ రైతు కుటుంబీకులైన శ్రీ తల్లిదండ్రులు సహజంగా తను ఇంజినీరింగ్ చదివి ఒక మంచి సాఫ్ట్‌వేర్ ఉద్యోగం సంపాదిస్టాడని ఆశించారు. ఆ కోరిక మేరకు ఇంజనీరింగ్ పూర్తి చేసి, తరువాత మాస్టర్స్ కోసం UK వెళ్లి చదివాడు. తరువాత హైదరాబాద్‌లో ఐటీ ఉద్యోగం కూడా చేశాడు. ఆయన తల్లిదండ్రులు సంతోషించారు. ఊరిలో వారి కొడుకు గురించి గొప్పలు చెప్పుకునే వారు.

కానీ చిన్నప్పటి నుంచీ సినిమాల మీద ఉన్న ఆసక్తి శ్రీ చౌదరిని వదల్లేదు. మంచి సినిమాలు చూసినప్పుడు కలిగిన అనుభూతి, అలాంటి సినిమాలు తానేనాడైనా నిర్మించాలన్న తపన వెంటాడింది. చివరికి మనసాక్షిని చంపుకోలేక, స్థిరమైన ఉద్యోగాన్ని వదిలేసి సినిమా దారిలో పడ్డాడు. వెంటనే కుటుంబ సభ్యుల నుంచి తిట్లు, ఊర్లో అవహేళనలు ఎదుర్కున్నాడు. అయినా వెనుకడగు వేయలేదు. చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్‌తో మొదలు పెట్టి, రెండు సంవత్సరాల కష్టానికి ఒక చిన్న సినిమాకు ప్రొడక్షన్ కంట్రోలర్‌గా పనిచేశాడు. తన నమ్మకం—మన కోరిక బలంగా ఉంటే, మన ప్రయత్నం నిజాయితీగా ఉంటే, లక్ష్యం తప్పకుండా చేరుకుంటాం.

దానికి నిదర్శనం “మయసభ” అవకాశం. ఈ ప్రాజెక్ట్‌లో శ్రీ అసోసియేట్ ప్రొడ్యూసర్‌గా పనిచేశాడు. స్క్రీన్ మీద తన పేరును సింగిల్ కార్డు‌గా చూసుకుని ప్రౌడ్ ఫీల్ అయ్యాడు. ఊర్లో ఒకప్పుడు ఎదురైన అవమానాలు సిరీస్ రిలీజ్ తరువాత అభిమానాలుగా మారాయి. మయసభ తన సినీ ప్రయాణాన్ని మలుపు తిప్పింది.

నాగి, శ్రీ ఇద్దరూ నా ప్రొడ్యూసర్ విజయ కృష్ణ రెండు కళ్లుగా, కాళ్లుగా, తన యుద్ధంలో ఫస్ట్ కమాండర్స్ గా అహోరాత్రులు కునుకు లేకుండా పని చేశారు. యుద్ధంలో గెలిపించి వారు గెలిచారు. “ఒకటే జీవితం, మనసుకు నచ్చిన పని చేద్దాం. ఆ పని కోసం పడే ఎంత కష్టం అయినా మనసుకు ఆనందాన్నిస్తుంది” అని నమ్మే ఇద్దరు నమ్మకమైన పనిగాళ్ళకు భవిష్యత్తులో మరెన్నో గొప్ప అవకాశాలు రావాలని ఆశిస్తున్నాం.

పైరసీ ని అరికట్టండి. సోనీ లివ్ లో “మయసభ” చూడండి!

- Deva Katta

Other articles from "Mayasabha - Every Person is a Walking Story series:

16.Production Design - Shiva Kamesh & Thirumala
15.Direction department - Karthik, Bhargav Tetali (Bobby), Aarthi, Puneeth, Aravind
14.Nageswaar, Bhanu Prasad, Angadi Raghavendra, Narayana, Teja Raju, Giriyashvardhan, Lekya, Ruchitha Nihani
13.Parth Ganesh & Sivayya
12.Devi Sri & Ambika Yashraj
11.Charitha Varma & Yasho Bharath
10.Pranav Preetham & Phanindra Devarapalli
9.Sakul Sharmaa & Rohit Satyan
8.Bhavana
7.Ravindra Vijay
6.Shankar Mahanthi
5.Sai Kumar
4.Shatru
3.Tanya Ravi Chandran
2.Chaitanya Rao
1.Aadhi Pinisetty



Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2025 Idlebrain.com. All rights reserved