“Every person is a walking story” - Mayasabha articles
“ప్రతి మనిషీ నడయాడే కథ!” – మయసభ వ్యాసాలు
- Deva Katta
Introduction
Behind Mayasabha’s success are underdogs whose grit and passion kept them chasing cinema against all odds. This article series celebrates those journeys—how each cast and crew member was chosen, the struggles that shaped them, and how one project’s nationwide acclaim became the turning point of their careers. Because every person you meet is a walking story—sometimes all it takes is one opportunity for the world to listen.
మయసభ విజయం వెనకున్న సైన్యం, సంవత్సరాలుగా కష్టాలు, అడ్డంకులు ఎదుర్కొంటూ సినిమా తప్ప వేరే జీవితమే లేదని బతుకుతున్న అండర్‌డాగ్స్. వారి ప్రయాణానికి నివాళిగా ఈ వ్యాసాలు రాస్తున్నాను. వారిని తీర్చిదిద్దిన జీవిన పోరాటాలు, మయసభలో వారి ఎలా ఎంపిక, ఈ విజయంలో వారి పాత్ర ఈ వ్యాసాల్లో ప్రధాన అంశాలు. ప్రతి మనిషి ఒక నడిచే కథ—ఆ కథని ప్రపంచం వినడానికి, ఒకే ఒక్క అవకాశం చాలు.
Shakthikanth Karthick has been a music maniac since childhood. Born and brought up in Chennai, he started his career as a music programmer around 2005. He quickly became one of the busiest programmers until Anish Kuruvilla launched him as a music director with Ko Ante Koti. Their connection went back to Avakai Biriyani, Anish’s debut film, where Anish was immensely impressed by Shakthi’s ability to enhance content through his background score.
After Ko Ante Koti, Shakthi was out of action for a while due to a personal crisis. He was later introduced to Sekhar Kammula by Anish Kuruvilla, who had earlier worked with Sekhar. It turned out to be a crucial film for both Sekhar and Shakthi. Their collaboration delivered a chartbuster album—I still remember the echoes of Pilla Vachinde across the Telugu states—and a memorable blockbuster in Sekhar’s filmography.
Despite such a phenomenal success, I kept wondering who this talent was and what he would do next. After Nela Ticket, he scored for Anish Kuruvilla’s highly successful Zee5 series Gods of Dharmapuri (G.O.D). While watching the series, I found the background score and title tracks outstanding—they elevated the well-written and executed project despite its extreme resource limitations. We were so impressed that we brought on board Srikanth Ramisetty, the talented production designer of G.O.D, for Republic.
And then came Shakthi’s turn with Mayasabha. The moment we suggested his name, even the Sony creative heads were excited, as they had already seen his contribution in another of their shows, Brinda, which streamed during our post-production phase and went on to become a superhit for the platform. Shakthi read the Mayasabha script and came back in a trance—already humming the title track. He even wrote the lyrics in Tamil just to give us an idea. The tune was instantly catchy, energetic, and epic—exactly the scale and sound Shakthi envisioned for the show.
Though our budget wasn’t large—especially for a 400-minute series with 6–8 songs (including English worded tracks accompanying the score)—Shakthi’s heart and skill were big enough to deliver music that elevated the visuals, performances, and nuances of every line, every scene, and the overall show. By far, Shakthi is the music director I’ve most enjoyed working with. He was prompt, timely, and qualitative—always bringing in some surprising element in every episode.
We spent hours experimenting with each score, going layer by layer—muting, unmuting, adding, subtracting—and whenever we discovered something fresh and exciting, it was bliss. That process gave us space to understand the emotions we wanted to convey, and Shakthi successfully engineered the score to package the entire show’s intent so effectively and energetically.
His contributions to the final mix, along with the highly accomplished mixing engineer Kannan Ganpat, were invaluable. A special mention also goes to Kannan Ganpat (Mixing Engineer) and Sachin of SyncCinema (Sound Designer), who deeply understood the mood of the cinema and designed the sound accordingly. Having earlier worked with them on Republic, the continuation of that collaboration gave us the freedom to explore, exchange, and enjoy multiple versions of the mix.
Shakthi is a delight to work with. His positive energy, endless creative options, and patience in engineering music to suit every beat of a scene and the story overall are extraordinary.
Though he has already proved himself with highly successful projects like Fidaa, G.O.D, and Brinda, I believe he deserves much bigger challenges. Mayasabha is just another beginning step in his long and promising career.
Wishing Shakthi a phenomenal journey ahead as a music director.
శక్తికాంత్ కార్తిక్ చిన్నతనం నుండి సంగీతం మీద పిచ్చితో పెరిగాడు. చెన్నైలో పుట్టి పెరిగిన శక్తి, 2005లో మ్యూజిక్ ప్రోగ్రామర్‌గా కెరీర్ ప్రారంభించాడు. త్వరలోనే ఇండస్ట్రీలో బిజీ ప్రోగ్రామర్లలో ఒకడయ్యాడు. 2012 లో అనీష్ కురువిల్లా తనని “కో అంటే కోటి” సినిమాతో మ్యూజిక్ డైరెక్టర్‌గా పరిచయం చేశాడు. వారిద్దరి పరిచయం, 2008 లో అనీష్ డెబ్యూట్ ఫిల్మ్ అయిన “ఆవకాయ్ బిరియానీ” తో మొదలైంది. ఆ సినిమా లో మ్యూజిక్ ప్రోగ్రామర్ శక్తి ఇచ్చిన బాక్గ్రౌండ్ స్కోర్ చూసి అనీష్ చాలా ఇంప్రెస్ అయ్యాడు.
“కో అంటే కోటి” తర్వాత, వ్యక్తిగత సమస్యల వల్ల శక్తి కొంత కాలం సినిమాలకు దూరంగా ఉన్నాడు. తర్వాత మళ్లీ అనీష్ కురువిల్లా ద్వారా శేఖర్ కమ్ముల గారికి పరిచయం అయ్యాడు. ఆ సినిమా ఇద్దరికీ చాలా కీలకమైనది. వాళ్ల కలయికతో వచ్చిన ఆల్బమ్ ఓ చార్ట్బస్టర్ అయింది — “పిల్లా వచ్చిందే” పాట తెలంగాణ, ఆంధ్రాలో ప్రతిచోటా మార్మోగింది. ఆ సినిమా శేఖర్ కెరీర్‌లోనూ పెద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.
అంతటి విజయం వచ్చిన శక్తి తర్వాత ఏం చేస్తున్నాడు అని కుతూహలంగా ఎదురు చూసాను. “నెల టికెట్” తర్వాత శక్తి, తన మిత్రుడు అనీష్ కురువిల్లా దర్శకత్వం వహించిన Gods of Dharmapuri (G.O.D) అనే సీరీస్‌కి (Zee5) సంగీతం అందించాడు. ఆ సీరీస్ చూసినప్పుడు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, టైటిల్ ట్రాక్ అన్నీ అద్భుతంగా అనిపించాయి. బడ్జెట్ తక్కువ ఉన్నా, స్కోర్ చాలా ఎఫెక్టివ్‌గా అనిపించింది. అంత ఆ సీరీస్‌కి ప్రొడక్షన్ డిజైనర్ అయిన శ్రీకాంత్ రామిసెట్టిని మేము Republic కోసం తీసుకున్నాం.
మయసభకి శక్తి పేరు ప్రస్తావించగానే Sonyలో క్రియేటివ్ టీం కూడా ఉత్సాహంగా స్పందించింది. అప్పటికే వారు వాళ్ల ప్లాట్ఫాం లో ఆయన చేసిన మరో షో Brinda చూస్తున్నారు. అది కూడా పెద్ద హిట్ అయ్యింది.
మయసభ స్క్రిప్ట్ చదివిన తర్వాత శక్తి ఒక ట్రాన్స్ లోకి వెళ్లిపోయాడు—టైటిల్ ట్రాక్ హమ్ చేస్తూ మీటింగ్ కి వచ్చాడు. డెమో కోసం తమిళంలో తనే లిరిక్స్ రాశాడు. టైటిల్ ట్యూన్ విన్న వెంటనే హుక్ అయ్యేలా energetic గా & epic గా ఉంది.
మా బడ్జెట్ పెద్దదేం కాదు – 400 నిమిషాల సీరీస్‌కి, 6–8 పాటలతో (ఇంగ్లీష్ లిరిక్స్ పాటలు కూడా ఉన్నాయి). అయినా శక్తి తన టాలెంట్‌తో, పెద్ద హృదయంతో మా బడ్జెట్ కన్నా చాలా ఉన్నతమైన మ్యూజిక్ అందించాడు. ప్రతి సీన్, ప్రతి డైలాగ్, ప్రతి ఎమోషన్‌కి ఆయన ఇచ్చిన స్కోర్ సిరీస్ సిరీస్ ని చాలా ఎలివేట్ చేసింది. ఇప్పటివరకు నేనెవరితోనూ శక్తితో పని చేసినంతగా ఎంజాయ్ చేస్తూ పనిచేయలేదు. ప్రతి ఎపిసోడ్‌కి స్కోర్ ని లేయర్‌ల వారీగా మేము కలిసి ప్రయోగాలు చేసేవాళ్లం. స్కోర్ రెడీ అయిన తరువాత కూడా ఒక్కో ఎపిసోడ్ మీదా ఒక్కో వారం ఇంప్రూవ్మెంట్స్ కోసం ప్రయోగాలు చేసేవాళ్లం. ఎప్పుడూ ఏదో ఒక కొత్త ఆవిష్కరణ దొరకేది. అది ఒక పండగలా అనిపించేది. ఎమోషన్స్ ని అర్థం చేసుకోవడంలో శక్తి చూపిన ఆసక్తి, ప్రయాస చాలా హెల్ప్ అయ్యింది.
మిక్స్‌లో కూడా శక్తి కాంట్రిబ్యూషన్ చాలా ఉంది. మిక్సింగ్ ఇంజినీర్ కన్నన్ గణపత్ మరియు సౌండ్ డిజైనర్ సచిన్ (SyncCinema) చేసిన పని ప్రత్యేకంగా అభినందించాలి. వాళ్లు సినిమాకి కావాల్సిన మూడ్‌ను బాగా అర్థం చేసుకున్నారు. వీరితో Republic లోనూ పని చేశాం, మళ్లీ ఈ ప్రాజెక్ట్‌లో కలవడం వల్ల మంచి అవగాహనతో ఆప్షన్స్ ఎక్స్‌ప్లోర్ చేయగలిగాం.
శక్తితో పని చేయడం హ్యాపీ గా ఒక పిక్నిక్ లా సాగి పోయింది. ప్రతి సీన్‌కీ, ప్రతి మూడ్‌కీ సరిపోయే సంగీతాన్ని అందించడానికి శక్తి చూపించే క్షమ, క్రియేటివిటీ, ఎనర్జీ అసాధారణం.
Fidaa, G.O.D, Brinda లాంటి విజయాలతో ఇప్పటికే తను టాలెంటెడ్ ప్రూవ్ చేసుకున్న శక్తికాంత్ కార్తీక్, ఇంకా ఎన్నో గొప్ప అవకాశాలు సంపాదించుకోవాలని ఆశిస్తూ, Mayasabha ఆ ప్రయాణంలో కేవలం తొలి మెట్టు మాత్రమే అని భావిస్తున్నాం.
శక్తికాంత్ కార్తిక్‌కి సంగీత దర్శకుడిగా ఎన్నో శిఖరాలు అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.