“Every person is a walking story” - Mayasabha articles
“ప్రతి మనిషీ నడయాడే కథ!” – మయసభ వ్యాసాలు
- Deva Katta
Introduction
Behind Mayasabha’s success are underdogs whose grit and passion kept them chasing cinema against all odds. This article series celebrates those journeys—how each cast and crew member was chosen, the struggles that shaped them, and how one project’s nationwide acclaim became the turning point of their careers. Because every person you meet is a walking story—sometimes all it takes is one opportunity for the world to listen.
మయసభ విజయం వెనకున్న సైన్యం, సంవత్సరాలుగా కష్టాలు, అడ్డంకులు ఎదుర్కొంటూ సినిమా తప్ప వేరే జీవితమే లేదని బతుకుతున్న అండర్‌డాగ్స్. వారి ప్రయాణానికి నివాళిగా ఈ వ్యాసాలు రాస్తున్నాను. వారిని తీర్చిదిద్దిన జీవిన పోరాటాలు, మయసభలో వారి ఎలా ఎంపిక, ఈ విజయంలో వారి పాత్ర ఈ వ్యాసాల్లో ప్రధాన అంశాలు. ప్రతి మనిషి ఒక నడిచే కథ—ఆ కథని ప్రపంచం వినడానికి, ఒకే ఒక్క అవకాశం చాలు.
Subject: Few takeaways out of my Prasthanam from Vennela to Mayasabha through Autonagar Surya in cinema Republic
As soon as I completed my Master’s degree in the U.S. and secured a job at General Motors, I enrolled in film school—the one degree for which I had pursued all the others. As part of my film school project, I made Valasa, a semi-fictional two-hour feature about Indian students in the U.S. I filmed it entirely with non-actors—my friends, roommates, and acquaintances. I took it upon myself to write, shoot, and edit the whole film. That very approach later became both my strength and my weakness.
After screening Valasa to a group of about 100 Telugu NRIs in Detroit, I managed to interest enough investors—32 people in total, with contributions starting from as little as $500—to back my debut feature Vennela. I’ve explained the making of Vennela in several interviews, so I’ll skip ahead to its release and aftermath. Though Vennela was a good hit and continues to be appreciated, I didn’t want to revisit the same genre. I wanted to explore deeper drama, which led me to Prasthanam.
When I came back with Prasthanam, nobody wanted to trust me—even though I had a cult hit to my credit. Every hero I approached expected a love story with some action if I wished to “stretch creatively.” This is the biggest lesson every filmmaker must learn: if you want to be a serious filmmaker who explores different genres, in the Telugu film industry you must be prepared to approach your first four or five films as repeated debuts. People will only back you if you stick to the genre where you were first recognized. Repeating that genre corners you into it, making it harder to break out later—just as actors are lazily typecast despite their versatility.
Because of my breakaway from the Vennela rom-com genre, my struggles with Prasthanam were again those of a debutant. The film was delayed for six months due to financial issues, and its release got sandwiched between blockbusters Simha and Darling. Yet, the appreciation for Prasthanam was instantaneous and kept on growing with time. It took me a while to even believe the depth of admiration people had for the film. Soon, I started receiving calls from almost every hero and producer in the industry, all eager to hear my next idea.
By then, I had another genre-breaking concept in mind. But once again, nobody wanted to bet on it. Everyone wanted something “as intense as Prasthanam” with a socio-political flavour. That’s when I switched to Autonagar Surya, a script that was already developed but which I had planned to explore later. I’ve always believed it’s important to throw yourself into unknown genres, learn, and prevail as an effective storyteller without being cornered into one genre. But more than choosing Autonagar Surya, it was my rushed process and poor decisions that caused costly damage to the trust and credibility I had earned with Prasthanam.
The habit I developed during Valasa—believing that a strong script and conviction were enough to push any actor into any genre—became a weakness. I rushed the project, hopping from one producer to another, without patiently making choices that would strengthen the script-to-screen process. Finally, when Chaitanya and I got together, we picked the most hyped production house out of all the willing backers. Unfortunately, the project got stuck in a financial scam for three years.
Though both Chaitanya and I were deeply attached to the project, I couldn’t move on to another until Autonagar Surya was released. We were trapped in a cycle of lies and mismanagement, with budgets falsely projected at double the actual costs. This was the most gruesome phase of my life. Unlike Vennela and Prasthanam, where we had full control in solving problems, here we were hostages. My core team was dismantled, making it even harder to steer the project toward my vision. An industry friend put it aptly: “You introduced yourself to the industry with Prasthanam, but Autonagar Surya introduced the industry to you.”
Eventually, thanks to intervention from industry seniors, the film released. It didn’t meet the audience’s expectations after Prasthanam, though it did gain a cult following later. Still, my credibility with actors and producers remained intact. Many opportunities awaited me, but instead of settling down and working on a new script, I made the worst decision of my career—a quick remake of a Tamil film out of financial desperation. Despite spending three years on Autonagar Surya, I wasn’t even paid half of my contracted amount.
Ironically, right after committing to the remake (still verbally), another original and exciting story came my way. I felt it was very unethical to walk back on my “word” like I am a Pedarayudu Instead of dropping the remake, I decided to juggle both—foolishly believing I could finish the remake and then move on. After nine shooting days, I walked out of the project due to creative differences, requesting that my name be removed from the credits.
This was the real self-inflicted damage. Just as cricket is a game of confidence, filmmaking is too. Nobody lost confidence in me because of Autonagar Surya; it was my financially desperate remake decision that caused ten times more damage-both financially and credibility wise. Embarking on something you don’t believe in wholeheartedly only leaves you with that kind of a misery—and one wrong step can lead you far away from your true path.
After this, I was thrilled to work on Netflix’s Bahubali: Rise of Sivagami. But halfway through, we realized the time and resources allocated were far from what the Bahubali universe demanded. It had to be India’s Game of Thrones, and it wasn’t feasible within the time and financial boundaries. The project was shelved, but I gained the trust of Shobu, Prasad garu, and Rajamouli garu, and I learned immensely from them.
From there, I started working on Republic, an idea I had pitched to Sai Durga Tej while working on Bahubali series. Just as we were set to shoot Republic, COVID struck, creating another two-year vacuum. During this time, I redeveloped Mayasabha—originally planned as a three-part film—into a web series. Once restrictions eased, we shot Republic with great efficiency, wrapping in 63 days instead of the planned 75. Zee Studios acquired it, and though it only moderately performed in theatres (with 50% ticket rates), it found immense acclaim and reach on OTT. This restored me as a filmmaker committed to exploring the first principles of our very existence, regardless of genre.
As Republic neared completion, I began work on another ambitious project (outside politics and societal themes), but since Mayasabha had matured and SonyLiv showed immense interest, I jumped into it next. Partnering again with my trusted critic and collaborator Kiran Jay Kumar, and my efficient and protective producer Krishna Vijay—who had also been an uncredited producer for Prasthanam—brought the process under full control.
From pre-production to release, Mayasabha was pure bliss. Facing challenges as a collective team, enjoying the process, and creating with total freedom made the project a personal blockbuster for me even before its release. Seeing its immense reach, even down to rural audiences, felt like dessert after a great meal.
Whatever I do, I want to enjoy what I write, and I will only write what I enjoy—extending that joy into every stage: prepping, casting, filming, editing, mixing, and more. Looking back, my career feels like an unfolding story filled with twists and turns—and I’m excited for every one of them ahead.
The reach of any art or cinema lies beyond anyone’s control. It depends on the team you put together, the overall narrative craft, subject matter, intent, and the audience’s mood at release. No creator has control over ALL those factors. That’s why a filmmaker should never be overly joyous or overly disappointed by success. The highest joy lies in creation itself—working with the right team, finding expression for emotions, ideas, and stories your heart engages with. Just focus on that, and you’ve already succeeded.
The only voice of inspiration that rings in my head these days is the opening lyric I wrote for Prasthanam:
A Special Thanks to idlebrain.com and Jeevi:
When Autonagar Surya was stuck in casting, I recorded a dialogue with my own voice and shared it with Jeevi, asking for feedback. He suggested I add a score and release it as a voice teaser. That teaser became a sensation and generated immense curiosity about the project. Later, I extended the idea to create the first-ever Telugu motion poster, reigniting curiosity when the project stalled for three years. It helped us secure strong openings. This also inspired me to write a series of exclusive articles on Idlebrain, sharing the genesis, character backstories, and casting choices for Autonagar Surya. Many readers appreciated the depth that went into scripting.
Once again, I’ve been given this platform—without conditions—to share my journey of making Mayasabha, paying tribute to every soul who contributed. Initially I just posted one such story on twitter about Shankar Mahanthi who played Shiva Reddy’s character. Jeevi saw that and advised that I can use his portal to express any more of such stories pertaining to Mayasabha. Hence, even this series is in a way ignited by Jeevi
I hope these articles are useful to at least some hardcore film buffs out there. Thank you, Jeevi, for being a great support system to new filmmakers including myself to promote our films innovatively. Wishing you all the very best Jeevi.
మయసభ వ్యాసాలు – ఆర్టికల్ #22: ముగింపు
“పయనమే ఆ గమ్యం కన్నా మిన్న పదరా అన్నా!”
సబ్జెక్ట్: సినిమా రిపబ్లిక్ లో వెన్నెల నుంచి మయసభ దాకా వయా ఆటోనగర్ సూర్య నా ప్రస్థానం నేర్పిన కొన్ని పాఠాలు.
యుఎస్‌లో మాస్టర్స్ పూర్తిచేసి, జనరల్ మోటార్స్‌లో జాబ్ జాయిన్ అయిన వెంటనే ఫిల్మ్ స్కూల్‌లో చేరాను. నన్ను మొదటి నుంచి ఆకర్షిస్తూ ఉన్న డిగ్రీ అదే. "వలస" అనే ఫిల్మ్ స్కూల్ ప్రాజెక్ట్ మొదలు పెట్టాను – అమెరికాలో ఉన్న ఇండియన్ స్టూడెంట్స్ జీవితాలను ఆధారంగా చేసుకున్న రెండు గంటల సెమీ-ఫిక్షనల్ సినిమా. అందులో నటించినవాళ్లు అంతా నా ఫ్రెండ్స్, రూమ్‌మేట్స్, పరిచయస్తులే. రాయడం, షూటింగ్, ఎడిటింగ్ అన్నీ నేనే చేసాను. ఆ విధానం తర్వాత నాకు బలం అయ్యింది, బలహీనత కూడా అయ్యింది.
డెట్రాయిట్‌లో 100 మంది తెలుగు ఎన్ఆర్ఐలకి “వలస” ప్రదర్శించాక, "వెన్నెల" అనే పేరుతో నేను రాసుకున్న రొమాంటిక్ కామెడీ తో నా ఫస్ట్ ఫీచర్ ఫిల్మ్ డెబ్యూ కి 32 మంది ఇన్వెస్టర్లు దొరికారు – వాళ్లలో ఒకరు $500 పెట్టుబడి పెట్టారు. “వెన్నెల” ఎలా చేశానో చాలా ఇంటర్వ్యూల్లో చెప్పాను, కాబట్టి ఇక్కడ నుంచి రిలీజ్, ఆ తర్వాతి ప్రయాణం మీద ఫోకస్ చేస్తాను. “వెన్నెల” హిట్ అయింది, కానీ నేను మళ్ళీ ఆ జానర్‌లో సినిమా చేయాలనే ఉద్దేశంలో లేను. అంతర్గతంగా లోతైన డ్రామా తీయాలనే కోరిక నన్ను "ప్రస్థానం"వైపు నడిపించింది.
“ప్రస్థానం” స్క్రిప్ట్‌తో తిరిగి ఇండియా వచ్చినప్పుడు నాపై ఎవరూ నమ్మకం పెట్టుకోలేదు – వెన్నెల అనే కల్ట్ హిట్ ఉన్నా సరే, నేను కలిసిన హీరోలంతా ప్రేమకధే కావాలన్నారు. కావాలంటే నా క్రియేటివ్ గుల కోసం కాస్త యాక్షన్ జోడించికోమన్నారు. ఇది చాలా ముఖ్యమైన పాఠం – ఒక డైరెక్టర్ డిఫరెంట్ జానర్స్ ట్రై చేయాలంటే, తొలినాళ్లలో ప్రతి సినిమా డెబ్యూ లాగే స్టార్ట్ అవుతుంది. తొలి హిట్ వచ్చిన జానర్‌నే రిపీట్ చేస్తే తొందరగా మూల పడి పాతబడి పోతాం. ఒకసారి ఆ మూలలో పడ్డాక బయటకి రావడం కష్టం. నటులకు ఎలా టైప్‌కాస్ట్ అవుతుందో, డైరెక్టర్స్‌కి కూడా అదే జరుగుతుంది.
అలా ప్రస్థానం సినిమాకి కూడా స్ట్రగుల్ మొదలైంది. ఆర్ధిక ఇబ్బందుల వల్ల ఆ సినిమా ఆరు నెలలు వాయిదా పడింది. రిలీజ్ టైం లో సింహా, డార్లింగ్ లాంటి బ్లాక్‌బస్టర్స్ మధ్య సాండ్ విచ్ అయింది. అయినా ప్రస్థానం కి వెంటనే మంచి పేరు రీచ్ అందాయి. ఆ రీచ్ తరవాత ఎంతో కాలం పెరుగుతూనే వచ్చింది. =ఆ సినిమాని ప్రజలు ఎంత లోతుగా రిసీవ్ చేసుకున్నారో తెలుసుకోడానికి నాకు చాలా సమయం పట్టింది. ఇండస్ట్రీ లో యునా ప్రతి హీరోలు, నిర్మాతల నుంచి కాల్స్ వచ్చాయి – నా తదుపరి ఐడియా ఏమిటో వినాలని ఉత్సాహం చూపారు.
ఆ సమయంలో మళ్లీ వేరొక కొత్త జానర్ ఐడియా వచ్చింది. కానీ, ఆ జెన్రీ మీద మళ్లీ ఎవరూ ఆసక్తి చూపలేదు. ఇప్పుడు వాళ్లందరికీ "ప్రస్థానం సినిమా నే కావాలి. అందరూ సోషియో-పాలిటికల్ థీమ్ తో కూడిన కథ కావాలన్నారు. అప్పుడు అప్పటికే రెడీగా ఉన్న "ఆటోనగర్ సూర్య" స్క్రిప్ట్ వైపు మనసు మళ్ళింది. కెరీర్ బిగినింగ్ లోనే వేరు వేరు జానర్స్‌లోకి దూకాలి, కొత్తగా నేర్చుకుంటూ ఫిల్మేకర్ గా ఎదగాలి అని ఆశించాను. ఆ ఆశయాన్ని పక్క దారి పెట్టడం కన్నా ఆటోనగర్ సూర్య మీద ఆ సమయంలో నేను తీసుకున్న కొన్ని త్వరిత నిర్ణయాలు, పొరపాట్లే నన్ను ఎక్కువగా బాధించాయి. ప్రస్థానం తో సంపాదించిన నమ్మకాన్ని దెబ్బతీశాయి.
వలస టైం లో నేర్చుకున్న అలవాటు – స్ట్రాంగ్ స్క్రిప్ట్, కాన్ఫిడెన్స్ ఉంటే ఏ నటుడ్నైనా ఏ జానర్‌లోనైనా ఒప్పించవచ్చు అన్న నమ్మకమే ఈ సినిమా విషయంలో నా బలహీనత అయింది. ఈ ప్రాజెక్ట్‌ని త్వరగా స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో, సరైన ప్రొడ్యూసర్ ఎంచుకోకుండా ఒక్కొక్కరిని మార్చుతూ వెళ్లాను. చివరకు చైతన్యతో కలిసి, అందరికంటే ఎక్కువ పబ్లిసిటీ ఉన్న ప్రొడక్షన్ హౌస్‌ని ఎంచుకున్నాం. కానీ ఆ ప్రాజెక్ట్ మూడు ఏళ్ళ పాటు ఫైనాన్షియల్ స్కామ్‌లో చిక్కుకుంది.
చిత్తశుద్ధితో మా ఇద్దరికీ ప్రాజెక్ట్ మీద ఎంత ప్రేమ ఉన్నా, ఆటోనగర్ సూర్య రిలీజ్ అయ్యే వరకు వేరే పనికి వెళ్ళలేకపోయాం. బడ్జెట్లు రెట్టింపు చేసినట్లు చూపించి మోసం జరిగింది. ఇది నా జీవితంలోనే కఠినమైన దశ. వెన్నెల, ప్రస్థానం లో లాగా సమస్యల్ని మేమే సీసీ సొల్యూషన్స్ కూడా మేమే వెతుక్కునే కంట్రోల్ లేకుండా పోయింది. ఒక విధంగా బందీ అయ్యాను. నా కోర్ టీమ్ ని కూడా దూరం చేశారు. ఒక ఇండస్ట్రీ ఫ్రెండ్ చెప్పినట్టు: "ప్రస్థానం తో నువ్వు ఇండస్ట్రీకి పరిచయం అయ్యావు, ఆటోనగర్ సూర్యతో ఇండస్ట్రీ నీకు పరిచయం అయ్యింది." అన్నట్టు సాగిందా చెడు ప్రయాణం.
కొంత మంది సీనియర్ ప్రొడ్యూసర్స్ సహాయంతో చివరికి సినిమా రిలీజ్ అయ్యింది. ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక పోయింది. కానీ తరువాత క్రమంగా కొంత కల్ట్ స్టేటస్ సంపాదించుకుంది. అయితే ఆ సినిమా మీదున్న నెగెటివిటీ అంతా ప్రొడక్షన్ హౌస్ మీద పడడంతో, నాకున్న క్రెడిబిలిటీ ఏ మాత్రం చెరిగి పోలేదు. అది కూడా మరో మిస్టేక్ చేసే వరకు తెలుసుకోలేక పోయాను. కొత్త స్క్రిప్ట్ మీద ప్రశాంతంగా పని చేయాల్సిన టైంలో, ఆర్థిక ఇబ్బందుల వల్ల జీవితంలోనే అతి చెత్త నిర్ణయం తీసుకున్నాను – ఒక తమిళ సినిమాని క్విక్ గా రీమేక్ చేయడానికి ఒప్పుకున్నాను. మూడు సంవత్సరాలు ఆటోనగర్ సూర్య మీద పని చేసినా, నా కాంట్రాక్ట్‌లో అర్ధ భాగం కూడా రెమ్యునరేషన్ ఇవ్వలేదు.
ఆ టైంలోనే, ఒక పెద్ద స్టార్ పంపిన మరో ఒరిజినల్ స్టోరీ నన్ను విపరీతంగా ఆకర్షించింది. కానీ నేను ఇచ్చిన మాట మీద తప్పకూడదన్న చెత్త మోరలిటీ తో – ఏదో పెద్దరాయుడు లా – రీమేక్ సినిమా ని కొనసాగించాను. రెండు ప్రాజెక్ట్స్‌ని ఒకేసారి హ్యాండిల్ చేయగలనన్న భ్రమతో, రెండూ చేయాలని ఫిక్స్ అయ్యాను. 9 రోజుల షూటింగ్ తర్వాత, క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల ఆ రీమేక్ ప్రాజెక్ట్ వదిలేసాను. నా పేరు టైటిల్స్‌లో కూడా వెయ్యొద్దని కోరాను.
ఇది నేను స్వయంగా చేసుకున్న డ్యామేజ్. ఆటోనగర్ సూర్య వల్ల ఎవరికీ నా మీద నమ్మకం పోలేదు. కానీ నన్ను నమ్మిన నేను – ఆ రీమేక్ వల్ల నా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయాను. ఎప్పుడైనా మనం నమ్మని ప్రాజెక్ట్‌లో పని చేస్తే – బాధ తప్ప ఇంకేమీ మిగలదు. ఆ ప్రాజెక్ట్ వల్ల మరో పదింతలు ఆర్ధికంగానూ, అవకాశాల విషయంలోనూ నష్టపోయాను. ఒక పొరపాటు మన దారిని పూర్తిగా తప్పుదారి పట్టించేస్తుంది. చాలా కాలం వెంటాడుతుంది.
తర్వాత నెట్‌ఫ్లిక్స్ కోసం “బాహుబలి: రైజ్ ఆఫ్ శివగామి” అనే వెబ్ సిరీస్ మీద పని చేయడం నాకు గొప్ప అనుభవం అయింది. కానీ ఆ ప్రాజెక్ట్‌కు కావాల్సిన resources, time మేము ఊహించిన దానికంటే తక్కువగా ఉండడంతో అది shelve అయింది. అయినా, ఈ ప్రయాణంలో శోభు, ప్రసాద్ గారు, రాజమౌళి గార్లతో మంచి బంధం ఏర్పడింది. వాళ్ల దగ్గర ఎంతో నేర్చుకున్నాను.
అక్కడినుంచి రిపబ్లిక్ అనే ప్రాజెక్ట్‌ను మొదలుపెట్టాను. అది బాహుబలి సిరీస్ మీద పని చేస్తున్న సమయంలోనే సాయి దుర్గా తేజ్ కి pitch చేశాను. షూటింగ్‌కు సిద్ధంగా ఉన్న సమయానికే COVID వచ్చింది. మళ్ళీ రెండు సంవత్సరాల గ్యాప్ వచ్చింది. ఆ సమయంలో మయసభ ప్రాజెక్ట్‌ను మూడుభాగాల సినిమాగా తీద్దామని రాశి ఉంచాను. దాన్ని వెబ్ సిరీస్‌గా రూపాంతరం చేసుకున్నాను.
రిపబ్లిక్ షూటింగ్ షురూ అయ్యింది. 75 రోజులు ప్లాన్ చేసి 63 రోజుల్లోనే సినిమాను efficientగా పూర్తి చేసాం. ZEE Studio సినిమాను తీసుకుంది. థియేటర్లలో మితమైన కలెక్షన్స్ వచ్చినా, OTTలో విపరీతమైన ప్రశంసలు, రీచ్ వచ్చింది. ఇది ఫిల్మ్‌మేకర్‌గా నేను పోగుట్టుకున్న నమ్మకాన్ని తిరిగి తీసుకు వచ్చింది.
మయసభ స్క్రిప్ట్ పిచ్ చేసినప్పుడు SonyLiv చాలా ఆసక్తి వ్యక్తపరిచి కావలసిన బడ్జెట్ ని ఫ్రీడమ్ ని ఇచ్చారు. వెంటనే దానిమీదకి దూకేశాను. మళ్ళీ నా నమ్మకమైన క్రిటిక్, సహ రచయిత కిరణ్, కృష్ణ విజయ్ అనే సమర్థవంతమైన, రక్షణాత్మక నిర్మాతతో కలిసి పని చేయడం వల్ల ప్రాజెక్ట్ పూర్తి స్థాయిలో కంట్రోల్‌లోకి వచ్చింది. కృష్ణ విజయ్ ప్రస్థానం సినిమాకి అనధికారిక నిర్మాత కూడా.
ప్రీ-ప్రొడక్షన్ నుంచి రిలీజ్ దాకా మయసభ ప్రాజెక్ట్ నా జీవితం లో ఒక బ్లిస్‌గా మారింది. ఒక టీమ్‌గా అన్ని సమస్యలను ఎదుర్కొనడం, నిర్మాణంలో ఆనందించడం నాకు పర్సనల్ బ్లాక్‌బస్టర్ అనిపించింది. ఆ ప్రాజెక్ట్ విజయం చూసిన rural audienceలోకీ how it penetrated... it's like having dessert after a perfect meal.
ఎప్పుడూ నాకు ఆనందాన్నిచ్చే కథలే రాస్తాను. ఆ ఆనందాన్ని షూటింగ్, ఎడిటింగ్, మిక్సింగ్ వరకు carry చేస్తాను. ఇదే నాకు నేను చేసుకున్న ప్రామిస్. వెనక్కు తిర్గి చూసుకుంటే నా కెరీర్ అంతా twists and turnsతో కూడుకున్న ఒక unfolding కథలా అనిపిస్తుంది. ఎక్కడికి తీసుకెళ్తుందో చూస్తూ, ఆనందంగా ప్రయాణం చేస్తాను.
ఒక సినిమా రీచ్ నీ ఈ ఒక్కరూ ప్రెడిక్ట్ చెయ్యలేరు, నిర్ణయించలేరు. అది టీమ్ మీద, నేరేటివ్ గ్రిప్ మీద, ఆడియెన్స్ మూడ్ మీద, ఇంకా చాలా విషయాలపై ఆధారపడి ఉంటుంది. మనం ఏ ఒక్కటిని పూర్తిగా కంట్రోల్ చేయలేం. అందుకే సక్సెస్‌కి ఎక్కువగా ఆనందపడటం, ఫెయిల్యూర్‌కి ఎక్కువగా బాధపడటం పనికిరాదు. క్రియేషన్ లోనే అసలైన ఆనందం ఉంది.
నా మైండ్ లో ఈ మధ్య తరచూ వినిపించే ఒక స్ఫూర్తిదాయకమైన లైన్:
"పయనమే… పయనమే… ఆ గమ్యం కన్నా మిన్న పదరా అన్నా!"
Idlebrain.com & Jeevi కి ప్రత్యేక కృతజ్ఞతలు:
Autonagar Surya సినిమా కాస్టింగ్ కష్టాల్లో ఉండగా, నేను ఒక డైలాగ్‌ను నా స్వరంతో రికార్డ్ చేసి ఒపీనియన్ కోసం Jeevi కి పంపాను. “background score వేసి voice teaser గా రిలీజ్ చెయ్యండి” అని సలహా ఇచ్చారు. ఆ teaser సెన్సేషన్ అయింది. తర్వాత సినిమా ఫైనాన్సియల్ స్కామ్ లో ఇరుక్కుని స్టాలే అయినప్పుడు అదే ఐడియా ఇన్స్పిరేషన్ తో తెలుగులో మొట్టమొదటి motion poster తయారుచేసాం. ఇది సినిమాపై మళ్ళీ ఆసక్తి పెరిగేలా చేసింది. మంచి ఓపెనింగ్స్ ఇచ్చింది.
తర్వాత idlebrain లో Autonagar Surya ప్రాజెక్ట్ మీద ఒక ఆర్టికల్స్ సిరీస్ రాశాను — స్క్రిప్ట్ పుట్టుక, పాత్రల నేపథ్యం, కాస్టింగ్ మొదలైన విషయాలు. చాలా మంది ఆ ఆర్టికల్స్ వెనక ఉన్న లోతైన ఆలోచనలను మెచ్చుకున్నారు.
మయసభలో శివ రెడ్డి పాత్ర పోషించిన శంకర్ మహంతి కష్టాల గురించి క్లుప్తంగా ట్విట్టర్ లో నేను పంచుకున్న మెసేజ్ చూసి, జీవి అలాంటి కథనాలు ఇంకా ఏమున్నా ఇడ్లీబ్రైన్ లో ప్రచురించుకోవచ్చని ప్రోత్సహించాడు. అలా మాయాసభ ప్రయాణంలోని అన్ని పాత్రల వెనుక ఉన్న కథల్ని ఈ మాధ్యమంలో ప్రస్తావించగలిగాను.
ఇది కొన్ని hardcore సినిమా ప్రేమికులకు ఉపయోగపడుతుందనే ఆశ. ఇలా కొత్త దర్శకులు నాలాంటి వాళ్ళు వాళ్ళ సినిమాలను వినూత్నంగా ప్రమోట్ చేసుకోడానికి సహకరిస్తున్న idlebrainకి, మరియు Jeeviకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అల్ ది బెస్ట్ జీవి!
- Deva Katta
Other articles from "Mayasabha - Every Person is a Walking Story series: